దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈరోజు(గురువారం) ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఎండ వేడిమి నుంచి ఢిల్లీవాసులకు ఉపశమనం లభించింది. ఈసారి ఢిల్లీలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాడ్పులు కూడా అధికంగా వీచాయి.
దేశంలోని తూర్పు రాష్ట్రాలలో రుతుపవనాలు ఇప్పటికే ప్రవేశించాయి. ఈ నేపధ్యంలో ఢిల్లీలో వర్షాలు ప్రారంభమయ్యాయి. రానున్న కొద్ది రోజుల్లో ఢిల్లీలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని, బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం రాబోయే కొద్ది రోజుల్లో ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోనుంది.
స్కైమెట్ తెలిపిన వివరాల ప్రకారం ఈ వారం చివరి నాటికి రుతుపవనాలు ఢిల్లీకి పూర్తిస్థాయిలో వచ్చే అవకాశం ఉంది. రుతుపవనాలు సాధారణంగా జూన్ 27- 29 తేదీల మధ్య దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంటాయి. గత ఏడాది జూన్ 26న రుతుపవనాలు ప్రవేశించాయి. ఈ ఏడాది ఇప్పటికీ ఉత్తరాదిన హీట్‌వేవ్ కొనసాగుతోంది. జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఈ తరుణంలోనే వాతావరణశాఖ రుతుపవనాల రాకకు సంబంధించిన శుభవార్త చెప్పింది.
#WATCH दिल्ली: राष्ट्रीय राजधानी के कई हिस्सों में बारिश होने से लोगों को गर्मी से राहत मिली।
वीडियो राव तुला राम मार्ग इलाके से है। pic.twitter.com/mkJkJaloVd— ANI_HindiNews (@AHindinews) June 27, 2024
Comments
Please login to add a commentAdd a comment