ఇజ్రాయెల్ చేరుకున్న రాజ్నాథ్ | Rajnath Singh arrives in Israel | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్ చేరుకున్న రాజ్నాథ్

Published Thu, Nov 6 2014 6:09 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 PM

ఇజ్రాయెల్ చేరుకున్న రాజ్నాథ్

ఇజ్రాయెల్ చేరుకున్న రాజ్నాథ్

న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారం రాత్రి ఇజ్రాయెల్ చేరుకున్నారు. గురువారం రాజ్నాథ్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యెహుతో సమావేశంకానున్నారు. ఉగ్రవాదంపై పోరాటం, భద్రతను పటిష్టం చేయడం తదితర ద్వైపాక్షిక అంశాల గురించి చర్చించనున్నారు.

రాజ్నాథ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విదేశీ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. రాజ్నాథ్ బుధవారం ఉదయమే ఇజ్రాయెల్ చేరాల్సివుంది. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా మొనాకొ నుంచి వెళ్లాల్సిన విమానం రద్దయ్యింది. దీంతో ఆయన పర్యటన ఆలస్యమైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement