భారత ప్రధాని నరేంద్ర మోదీ మయన్మార్ చేరుకున్నారు.
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ మయన్మార్ చేరుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం మయన్మార్ రాజధాని నే పీ తాకి వెళ్లిన మోదీకి ఘన స్వాగతం లభించింది.
అక్కడి ప్రజలు సంప్రదాయ దుస్తుల్లో మోదీకి స్వాగతం పలికారు. మయన్మార్ అందమైన దేశమంటూ మోదీ ట్వీట్ చేశారు. దక్షిణాసియాకు వారథి వంటిదని అభివర్ణిస్తూ ట్విట్టర్లో ఫొటో పోస్ట్ చేశారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా మోదీ తొలుత మయన్మార్ వెళ్లారు.