ఫిజిలో భారీ భూకంపం
సౌత్ పసిఫిక్ ద్వీప దేశం ఫిజిలో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుఝామున రిక్టర్ స్కేల్ పై 7.9 తీవ్రతతో భూమి కంపించింది. సుమారు 10-15 నిమిషాలపాటు భూమి కంపించినట్టు స్తానికుల సమాచారం. దీంతో పసిఫిక్ సునామీ కేంద్ర అధికారులు మొదట సునామీ హెచ్చరికలు జారీ చేశారు. దీని ప్రభావంతో జనజీవనం ప్రభావితమైంది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అధికారుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
శక్తివంతమైన భూకంపం ఫిజీ రాజధాని సువాను తాకింది. మొదట7.2 తీవ్రతతో తో రికార్డ్ చేయబడింది. కానీ 6.9 కు తగ్గించబడింది. దీంతో మొదట జారీ చేసిన సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు. అయితే సముద్ర సమీపంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తీర ప్రాంత వాసులును సురక్షి ప్రాంతాలకు తరలిస్తున్నారు ఎలాంటి నష్టం సంభవించిందన్న దానిపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు.
****Tsunami Message****
A magnitude 7.2 earthquake has occurred about 200km to the south-southwest of Fiji.
A... https://t.co/3YSZlJLk2I
— Na Draki Weather (@Nadraki) January 3, 2017