క్విటో: ఈక్వెడార్‌లో దారుణం చోటుచేసుకుంది. ఖైదీలను సంస్కరించాల్సిన కారాగారాల్లో రక్తపాతం జరిగింది. మూడు జైళ్లలో ఖైదీల మధ్య భీకర స్థాయిలో ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 79 మంది మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సోమవారం రాత్రి ఘర్షణ జరగ్గా, 800 మంది పోలీసులు రంగంలోకి దిగి మంగళవారం నాటికి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలిపాయి. దక్షిణ ఈక్వెడార్‌లోని క్యున్‌కా జైల్లో 34 మంది, పసిఫిక్ తీరప్రాంతంలోని గుయాక్విల్ జైల్లో 37 మంది, సెంట్రల్ సిటీ లాటకూంగా జైల్లో 8 మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. అధిపత్యం కోసమే ఈ గ్రూపుల మధ్య దాడులు జరిగినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment