యుద్ధ ఖైదీల మార్పిడి | Russia-Ukraine war: Russia and Ukraine exchange 103 prisoners each in deal | Sakshi
Sakshi News home page

యుద్ధ ఖైదీల మార్పిడి

Published Sun, Sep 15 2024 6:22 AM | Last Updated on Sun, Sep 15 2024 6:22 AM

Russia-Ukraine war: Russia and Ukraine exchange 103 prisoners each in deal

103 మంది చొప్పున పరస్పరం మార్చుకున్న రష్యా, ఉక్రెయిన్‌

మాస్కో/కీవ్‌: రష్యా, ఉక్రెయిన్‌లు శనివారం 103 మంది చొప్పున యుద్ధఖైదీలను పరస్పరం మారి్పడి చేసుకున్నాయి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) దీనికి మధ్యవర్తిత్వం వహించింది. ‘మావాళ్లు స్వదేశానికి చేరుకున్నారు. రష్యా చెర నుంచి 103 మంది యోధులను విజయవంతంగా ఉక్రెయిన్‌కు తీసుకొచ్చాం’అని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ శనివారం ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. యుద్ధఖైదీల మారి్పడిలో భాగంగా ఉక్రెయిన్‌కు చేరిన వారిలో 82 సాధారణ పౌరులు, 21 మంది సైనిక సిబ్బంది ఉన్నారు. 

‘కస్క్‌ ప్రాంతంలో ఉక్రెయిన్‌ బందీలుగా పట్టుకున్న 103 సైనిక సిబ్బంది కీవ్‌ ఆ«దీనంలోని భూభాగం నుంచి విముక్తులయ్యారు. బదులుగా 103 యుద్ధఖైదీలను ఉక్రెయిన్‌కు అప్పగించాం’అని రష్యా రక్షణశాఖ వెల్లడించింది. ఉక్రెయిన్‌ చెర వీడిన రష్యా యుద్ధఖైదీలు ప్రస్తుతం బెలారస్‌లో ఉన్నారు. వారికి అవసరమైన వైద్య, మానసిక సహాయాన్ని అందిస్తున్నట్లు రష్యా తెలిపింది. 2022లో రష్యా ఉక్రెయిన్‌పై దండెత్తిన తర్వాత యూఏఈ మధ్యవర్తిత్వంలో జరిగిన ఎనిమిదో యుద్ధఖైదీల మారి్పడి ఇది. మొత్తం ఇప్పటిదాకా 1,994 మంది ఖైదీలకు తమ చొరవతో చెరవీడిందని యూఏఈ తెలిపింది.  

రష్యాలోని సుదూర లక్ష్యాల పైకి దాడికి అనుమతించండి 
రష్యాలోని సుదూర లక్ష్యాల పైకి దాడి చేయడానికి తమను అనుమతించాలని ఉక్రెయిన్‌ పునరుద్ఘాటించింది. పశి్చమదేశాలు ఉక్రెయిన్‌కు సుదూరశ్రేణి క్షిపణులను సరఫరా చేసినప్పటికీ.. వాటి వాడకానికి అనుమతివ్వడం లేదు. ‘రష్యా ఉగ్రవాదం వారి ఆయుధాగారాలు, సైనిక విమానాశ్రయాలు, సైనిక స్థావరాల వద్ద మొదలవుతుంది. రష్యా లోపలి ప్రాంతాల్లోని లక్ష్యాలపై దాడులకు అనుమతి లభిస్తే.. పరిష్కారం వేగమంతమవుతుంది’అని ఉక్రెయిన్‌ అధ్యక్షుడి సలహాదారు ఆండ్రీ యెర్మాక్‌ శనివారం వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement