Prisoners of war
-
యుద్ధ ఖైదీల మార్పిడి
మాస్కో/కీవ్: రష్యా, ఉక్రెయిన్లు శనివారం 103 మంది చొప్పున యుద్ధఖైదీలను పరస్పరం మారి్పడి చేసుకున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దీనికి మధ్యవర్తిత్వం వహించింది. ‘మావాళ్లు స్వదేశానికి చేరుకున్నారు. రష్యా చెర నుంచి 103 మంది యోధులను విజయవంతంగా ఉక్రెయిన్‌కు తీసుకొచ్చాం’అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శనివారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. యుద్ధఖైదీల మారి్పడిలో భాగంగా ఉక్రెయిన్‌కు చేరిన వారిలో 82 సాధారణ పౌరులు, 21 మంది సైనిక సిబ్బంది ఉన్నారు. ‘కస్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ బందీలుగా పట్టుకున్న 103 సైనిక సిబ్బంది కీవ్ ఆ«దీనంలోని భూభాగం నుంచి విముక్తులయ్యారు. బదులుగా 103 యుద్ధఖైదీలను ఉక్రెయిన్‌కు అప్పగించాం’అని రష్యా రక్షణశాఖ వెల్లడించింది. ఉక్రెయిన్ చెర వీడిన రష్యా యుద్ధఖైదీలు ప్రస్తుతం బెలారస్లో ఉన్నారు. వారికి అవసరమైన వైద్య, మానసిక సహాయాన్ని అందిస్తున్నట్లు రష్యా తెలిపింది. 2022లో రష్యా ఉక్రెయిన్‌పై దండెత్తిన తర్వాత యూఏఈ మధ్యవర్తిత్వంలో జరిగిన ఎనిమిదో యుద్ధఖైదీల మారి్పడి ఇది. మొత్తం ఇప్పటిదాకా 1,994 మంది ఖైదీలకు తమ చొరవతో చెరవీడిందని యూఏఈ తెలిపింది. రష్యాలోని సుదూర లక్ష్యాల పైకి దాడికి అనుమతించండి రష్యాలోని సుదూర లక్ష్యాల పైకి దాడి చేయడానికి తమను అనుమతించాలని ఉక్రెయిన్ పునరుద్ఘాటించింది. పశి్చమదేశాలు ఉక్రెయిన్‌కు సుదూరశ్రేణి క్షిపణులను సరఫరా చేసినప్పటికీ.. వాటి వాడకానికి అనుమతివ్వడం లేదు. ‘రష్యా ఉగ్రవాదం వారి ఆయుధాగారాలు, సైనిక విమానాశ్రయాలు, సైనిక స్థావరాల వద్ద మొదలవుతుంది. రష్యా లోపలి ప్రాంతాల్లోని లక్ష్యాలపై దాడులకు అనుమతి లభిస్తే.. పరిష్కారం వేగమంతమవుతుంది’అని ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు ఆండ్రీ యెర్మాక్ శనివారం వివరించారు. -
ఈక్వెడార్ జైళ్లలో భారీ ఘర్షణ
క్విటో: ఈక్వెడార్‌లో దారుణం చోటుచేసుకుంది. ఖైదీలను సంస్కరించాల్సిన కారాగారాల్లో రక్తపాతం జరిగింది. మూడు జైళ్లలో ఖైదీల మధ్య భీకర స్థాయిలో ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 79 మంది మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సోమవారం రాత్రి ఘర్షణ జరగ్గా, 800 మంది పోలీసులు రంగంలోకి దిగి మంగళవారం నాటికి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలిపాయి. దక్షిణ ఈక్వెడార్‌లోని క్యున్కా జైల్లో 34 మంది, పసిఫిక్ తీరప్రాంతంలోని గుయాక్విల్ జైల్లో 37 మంది, సెంట్రల్ సిటీ లాటకూంగా జైల్లో 8 మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. అధిపత్యం కోసమే ఈ గ్రూపుల మధ్య దాడులు జరిగినట్లు తెలుస్తోంది. -
అమెరికాలో జైల్లో ఖైదీల బీభత్సం
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో అత్యంత పటిష్టమైన భద్రత ఉంటే సెయింట్ లూయిస్ జైల్లో ఖైదీలు శనివారం తెల్లవారుజామున బీభత్సం సృష్టించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఖైదీల పరామర్శకు వచ్చే బంధువులను పరిమితంగానే అనుమతిస్తున్నారు. ఖైదీల కేసుల్లో కోర్టు విచారణలు సైతం నిలిపివేశారు. దీంతో వారంతా అసహనానికి గురయ్యారు. జైలు నాలుగో అంతస్తులో కిటికీలను, పైప్‌లను ధ్వంసం చేశారు. కుర్చీలు, మంచాలు, పరుపులకు నిప్పు పెట్టారు. జైలు అధికారులతో ఘర్షణకు దిగారు. వారిని శాంతింపజేసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఉదయం 10 గంటలకల్లా పరిస్థితి అదుపులోకి వచ్చింది. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అర్పివేశారు. ఈ జైల్లో 633 మంది ఖైదీలు ఉండగా, దాదాపు 115 మంది బీభత్సం సృష్టించినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఘటనలో ఖైదీలెవరూ గాయపడలేదు. ఓ అధికారి స్వల్పంగా గాయపడగా, ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. సెయింట్ లూయిస్ జైలు నుంచి 65 మంది ఖైదీలను డౌన్‌టౌన్ జైలుకు తరలించారు. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై అదనపు చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు. -
హొండురస్ జైల్లో 18 మంది ఖైదీల మృతి
టెగుసిగల్ప: సెంట్రల్ అమెరికాలోని హొండురస్ దేశ జైల్లో ఖైదీల మధ్య జరిగిన గొడవల్లో 18 మంది మరణించగా, 16 మంది గాయపడ్డారు. ఆ దేశంలోని ఉత్తరభాగంలో నగరమైన టెలాలోని జైల్లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వీరిలో 17 మంది జైల్లోనే మృతిచెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు తెలిపారు. ఖైదీల మధ్య గొడవ ఎందుకు జరిగిందో తమకు తెలియరాలేదని చెప్పారు. ఇటీవల ఇదే జైల్లో అయిదు మందిని మరో ఖైదీ కాల్చి చంపడంతో దేశంలోని జైళ్లను అన్నింటినీ ఆర్మీ అదుపులోకి తీసుకోవాలంటూ ఆ దేశాధ్యక్షుడు జువాన్ ఓర్లాండో హెర్నాండెజ్ ఆదేశాలు జారీ చేశారు. జైలు ఆర్మీ అదుపులోకి రాలేదని జైలు అధికారి డిగ్నా చెప్పారు. -
బ్రెజిల్ జైల్లో ఘర్షణలు
సావోపాలో: బ్రెజిల్‌లోని అమెజొనాస్ రాష్ట్ర రాజధాని మనౌస్‌కు 17 మైళ్ల దూరంలో ఉన్న ఓ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ చెలరేగి 15 మంది చనిపోయారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 11 గంటలకు ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇది జైలులోని ఖైదీల మధ్య ఘర్షణేనని కల్నల్ మార్కోస్ వినిసియస్ విలేకరులకు చెప్పారు. పళ్లు తోముకునే బ్రష్‌లను పదునుగా చేసి, వాటితో పొడుచుకున్నారనీ, మరికొందరిని గొంతునులిమి చంపేశారని అధికారులు తెలిపారు. ఘటనకు కారణం కనుగొనేందుకు విచారణను ప్రారంభించారు. అధికారులు తక్షణం స్పందించి గొడవను అదుపు చేశారనీ, లేకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని కల్నల్ చెప్పారు. 2017 జనవరిలోనూ ఇదే జైలులో ఖైదీలు తిరుగుబాటు చేయగా, పరిస్థితిని అదుపు చేసేందుకు దాదాపు 20 గంటలు పట్టింది.నాటి తిరుగుబాటులో 56 మంది చనిపోయారు, 184 మంది ఖైదీలు పారిపోయారు. జైళ్లలో జనం అధికంగా ఉండే దేశాల్లో ప్రపంచంలో బ్రెజిల్‌ది మూడోస్థానం. జైళ్ల సామర్థ్యానికి రెండింతల మంది ఖైదీలు వాటిలో ఉంటున్నారు. ఇక్కడి జైళ్లలో ముఠా హింస, తిరుగుబాట్లు, పారిపోయే ప్రయత్నాలు చాలా ఎక్కువ. గతేడాది సెప్టెంబర్‌లో కొందరు దుండగులు భారీ ఆయుధాలతో వచ్చి జైలు గేటు బయట పేలుళ్లు జరిపి అనంతరం లోపలకు చొరబడి ఓ పోలీస్ సిబ్బందిని చంపి, 92 మంది ఖైదీలను విడిపించుకుని వెళ్లగా, వారిలో సగం మందిని ప్రభుత్వం మళ్లీ పట్టుకుంది. మాదకద్రవ్యాల ముఠా నేతలు బ్రెజిల్ జైళ్లలో ఎక్కువగా ఉంటారు. -
పట్టాలెక్కిన యుద్ధ స్మృతులు
థాయ్‌లాండ్ , బర్మాల మధ్య తలపెట్టిన రైలు మార్గం నిర్మాణాన్ని రచయిత ఇందులో వర్ణించారు. ఇందుకోసం లక్షా ఎనభైవేల మంది ‘రూమూషా’ (జపాన్ భాషలో శ్రామికులు)లను సమకూర్చారు. ఇందులో 60,000 మంది యుద్ధఖైదీలు ఉన్నారు. వీరంతా జపాన్‌కు పట్టుబడిన మిత్రరాజ్యాల సైనికులే. గాయం కంటే, గాయం మిగిల్చిన గాథకే పదునెక్కువ. అందుకే, దుఃఖాన్ని దిగుమింగుకుని చరిత్ర పుటల అట్టడుగున మణిగిపోయిన గాయాలకు రచయితలు గొంతును ఇస్తారు. ఈ సంవత్సరం మ్యాన్‌బుకర్ పురస్కారానికి ఎంపికైన రిచర్డ్ ఫ్లానన్ అలాంటి ఒక లోతైన గాయం చేత మాట్లాడించారు. ఆ మాటలే ‘ది నేరో రోడ్ టు ది డీప్ నార్త్’ నవలగా ఆవిర్భవించాయి. అమెరికా రచయితలను కూడా మ్యాన్ బుకర్ పరిధిలోకి తెచ్చిన తరువాత మొదటిసారి ప్రకటించిన ఈ పురస్కారం ఆస్ట్రేలియాకు చెందిన ఫ్లానన్కు దక్కింది. అలాగే, పోటీలో చివరిదాకా నిలిచిన మరో రచన ‘ది లైవ్స్ ఆఫ్ అదర్స్’. కోల్‌కతాకు చెందిన నీల్ ముఖర్జీ రాసిన నవల ఇది. పన్నెండేళ్లలో, ఐదు పర్యాయాలు తిరగరాసిన ఈ నవలను ఇటీవలే ఫ్లానన్ బుకర్ పోటీకి పంపారు. ఆ రోజునే 93 ఏళ్ల ఆయన తండ్రి కన్నుమూశారు. రెండో ప్రపంచ యుద్ధఖైదీల దుస్థితే నవల ఇతివృత్తం. నవలాకాలం కూడా అదే. థాయ్‌లాండ్, బర్మాల మధ్య తలపెట్టిన రైలు మార్గం నిర్మాణాన్ని రచయిత ఇందులో వర్ణించారు. ఇందుకోసం లక్షా ఎనభైవేల మంది ‘రూమూషా’ (జపాన్ భాషలో శ్రామికులు)లను సమకూర్చారు. ఇందులో 60,000 మంది యుద్ధఖైదీలు ఉన్నారు. వీరంతా జపాన్‌కు పట్టుబడిన మిత్రరాజ్యాల సైనికులే. ఆసియా రాజ్యాలకు చెందిన మరో 90 వేల మంది సాధారణ పౌరులు కూడా దీని కోసం చెమటోడ్చారు. నిజానికి అంతా కలసి రక్తమోడ్చారు. ఆ సమయంలో జపాన్ సేనలు చేసిన అకృత్యాల నే రచయిత వర్ణించారు. ఆ రాక్షసత్వాన్ని తట్టుకోలేక, వాతావరణ పరిస్థితులను భరించలేక వారిలో 12,399 మంది దయనీయ స్థితిలో కన్నుమూశారు. పరిస్థితులు మారిన తరువాత బతికి బయటపడిన వారిలో ఒక యుద్ధఖైదీ సాన్ బయాకు జుగో. అతడి వరస సంఖ్య 335. ఈ యుద్ధఖైదీ కొడుకే రిచర్డ్ ఫ్లానన్. అయితే ఇది తన తండ్రి కథ కాదని రచయిత చెప్పారు. కానీ ఒక పుస్తకం రాయమని ఫ్లానన్కు తండ్రి సలహా మాత్రం ఇచ్చారు. కొడుకు రచన ప్రారంభించాక అందులో ఇతివృత్తం ఏమిటి అని ఏనాడూ అడగలేదు. ఫ్లానన్ తన తొలి నవల ‘డెత్ ఆఫ్ ఎ రివర్గైడ్’ను 1994లో వెలువరించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా నవలాకారులలో అగ్రస్థానంలో ఉన్న ఫ్లానన్ ‘ది సౌండ్ ఆఫ్ వన్ హ్యాండ్ క్లాపింగ్’ (1997), ‘గౌల్డ్స్ బుక్ ఆఫ్ ఫిష్: ఎ నోవెల్ ఇన్ ట్వెల్వ్ ఫిష్’ (2001), ‘ది అన్నౌన్ టైస్ట్’(2006), ‘వాంటింగ్’ (2008) వంటి నవలలు రాసి ఎంతో ఖ్యాతి పొందారు. ఈ ఏటి బుకర్ పురస్కారానికి ఎంపికైన నవల ‘ది నేరో రోడ్ టు ది డీప్ నార్త్’ను నిరుడే రాశారు. ఆయన సినిమా దర్శకుడు, చిత్రానువాదకుడు. చరిత్ర, ప్రకృతి పర్యావరణాల మీద మమకారంతోనే వీటన్నిటినీ ఆయన అక్షరబద్ధం చేశారు. ఫ్లానన్ పత్రికా రచయిత కూడా. ‘డెత్ ఆఫ్ ఎ రివర్గైడ్’లో కథానాయకుడు ఎజాజ్ కోసిని తన అనుభవాలను వివరిస్తాడు. తన స్వస్థలం తస్మానియా దగ్గరి నదిలో మునిగి, బతికి బయటపడిన తరువాత ఈ కథ చెబుతాడు. ఆస్ట్రేలియా వలసగా ఉన్నప్పుడు తన పూర్వీకులు పడిన ఇక్కట్లనే ఇందులో ఇతివృత్తంగా తీసుకున్నారు రచయిత. ‘గౌల్డ్స్ బుక్ ఆఫ్ ఫిష్: ఎ నోవెల్ ఇన్ ట్వెల్వ్ ఫిష్’ నవలకు కూడా 19వ శతాబ్దమే నేపథ్యం. బుకర్ న్యాయనిర్ణేతలు ఎంపిక చేసిన ‘ది నేరో రోడ్ టు ది డీప్ నార్త్’కు మూలం 1689లో జపాన్ కవి రాసిన ఒక రచన ఆధారం. దాని పేరు కూడా అదే. రైలుమార్గం నిర్మాణం కోసం తీసుకువచ్చిన 2,815 మంది ఆస్ట్రేలియా యుద్ధఖైదీల కోసం వచ్చిన వైద్యుడు డోరిగో ఇవాన్స్. ఇతడి చుట్టూ ఇతివృత్తం సాగుతుంది. ఈ ఉద్యోగానికి వచ్చే ముందు తన సమీప బంధువుతో నడిపిన శృంగారాన్ని తలుచుకోవడం, ఎదురుగా కనిపిస్తున్న రక్తసిక్త ఘటనలను చూసి కుమిలిపోవడం అనే రెండు పట్టాల మీద కథ నడుస్తుంది. ఈ నిర్మాణానికి బర్మా రైల్వే నిర్మాణమని, డెత్ రైల్వే నిర్మాణమని కూడా పేర్లు ఉండేవి. ఇక్కడి దృశ్యాలు నాజీల శిబిరాలలో జరిగిన దారుణాలను మరిపించేవిగానే ఉంటాయి. ఎక్కడ చూసినా మానవ కంకాళాలకు తోలు తొడిగినట్టు ఉండే మనుషులే. వారి చేతే పని చేయించారు. కేవలం ఆస్ట్రేలియన్లకే కాకుండా, మిగిలిన బాధితులకు కూడా సేవలు చేసి, ఒక ధీరోదాత్త కథానాయకునిలా డోరిగో స్వదేశానికి వెళతాడు. రెండో ప్రపంచ యుద్ధంలో తన దేశ యుద్ధఖైదీలు పడిన వెతల మీద వెలుగులు ప్రసరింప చేయాలనుకున్న ఫ్లానన్ ఆకాంక్ష ఈ నవలతో తీరింది. డాక్టర్ గోపరాజు నారాయణరావు