
టెగుసిగల్ప: సెంట్రల్ అమెరికాలోని హొండురస్ దేశ జైల్లో ఖైదీల మధ్య జరిగిన గొడవల్లో 18 మంది మరణించగా, 16 మంది గాయపడ్డారు. ఆ దేశంలోని ఉత్తరభాగంలో నగరమైన టెలాలోని జైల్లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వీరిలో 17 మంది జైల్లోనే మృతిచెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు తెలిపారు. ఖైదీల మధ్య గొడవ ఎందుకు జరిగిందో తమకు తెలియరాలేదని చెప్పారు. ఇటీవల ఇదే జైల్లో అయిదు మందిని మరో ఖైదీ కాల్చి చంపడంతో దేశంలోని జైళ్లను అన్నింటినీ ఆర్మీ అదుపులోకి తీసుకోవాలంటూ ఆ దేశాధ్యక్షుడు జువాన్ ఓర్లాండో హెర్నాండెజ్ ఆదేశాలు జారీ చేశారు. జైలు ఆర్మీ అదుపులోకి రాలేదని జైలు అధికారి డిగ్నా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment