![Peoples killed in multiple car collisions in Egypt - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/29/ezyptttt.jpg.webp?itok=mh3BSgl2)
కైరో: ఈజిప్టులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 32 మంది మృత్యువాతపడ్డారు. కైరో–అలెగ్జిండ్రియా ప్రధాన రహదారిపై బెహీరా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొదటగా ప్రయాణికులతో వెళ్తున్న బస్సు రోడ్డు పక్కన నిలిపి ఉంచిన వాహనాన్ని ఢీకొట్టింది.
ఆ వెనుకే వస్తున్న కార్లు ఒకదానినొకటి ఢీకొట్టి, మంటలు చెలరేగాయి. మొత్తం 29 వాహనాలు ప్రమాదంలో చిక్కుకోగా బస్సు సహా ఆరు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనలో 32 మంది వరకు చనిపోగా మరో 63 మంది గాయపడ్డారు. దట్టంగా కురుస్తున్న మంచు కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment