ఘటన ప్రాంతంలో సహాయక హెలికాప్టర్, సిబ్బంది
బ్రుమాడినో: బ్రెజిల్‌లో వాడుకలోలేని ఓ ఆనకట్ట శుక్రవారం కూలి 11 మంది మరణించగా మరో 300 మందికిపైగా గల్లంతయ్యారు. వారంతా బతికుండే అవకాశాలు తక్కువేనని అధికారులు అంటున్నారు. ఆగ్నేయ బ్రెజిల్‌లోని మినాస్ గెరైస్ రాష్ట్రం, బెటో హొరిజొంటె పట్టణం సమీపంలో, ఇనుప ఖనిజం గని పక్కన ఈ ప్రమాదం జరిగింది. ఆనకట్ట కూలి అందులోని బురద ఒక్కసారిగా గని దగ్గర పనిచేస్తున్న వారిని ముంచేసింది. సమీపంలోని రోడ్లు, ఇళ్లను చుట్టుముట్టింది. శనివారం ఉదయానికి అందిన సమాచారం ప్రకారం 11 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. గల్లంతైన వారిలో 150 మందికి పైగా గనిలో తవ్వకాలు చేపడుతున్న సంస్థ ఉద్యోగులని తెలుస్తోంది. ఇప్పటివరకు మొత్తం 279 మందిని ప్రాణాలతో రక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment