iron ore mining
-
భారీ పెట్టుబడులకు వేదాంతా సై
న్యూఢిల్లీ: మైనింగ్ రంగ ప్రయివేట్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ వివిధ బిజినెస్‌లలో 6 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనుంది. అల్యూమినియం, జింక్, ముడిఇనుము, స్టీల్, చమురు, గ్యాస్ తదితర విభిన్న విభాగాలపై పెట్టుబడులు వెచ్చించేందుకు ప్రణాళికలు వేసింది. తద్వారా వార్షికంగా కనీసం 2.5 బిలియన్ డాలర్ల నిర్వహణ లాభాన్ని(ఇబిటా) జత చేసుకోవాలని చూస్తున్నట్లు ఇన్వెస్టర్ల సమావేశంలో కంపెనీ అత్యున్నత అధికారులు వెల్లడించారు. పైప్‌లైన్‌లో 50 యాక్టివ్ ప్రాజెక్టులుసహా విస్తరణ ప్రణాళికలున్నట్లు తెలియజేశారు. ఇవి కంపెనీ వృద్ధికి దోహదం చేస్తాయని, తద్వారా 6 బిలియన్ డాలర్ల ఆదాయానికి వీలున్నట్లు పేర్కొన్నారు. ఇది ప్రస్తుత ఆరి్థక సంవత్సరం(2023–24)లో సాధించే వీలున్న 5 బిలియన్ డాలర్ల ఇబిటాను వచ్చే ఏడాది(2024–25) 6 బిలియన్ డాలర్లకు పెంచనున్నట్లు అంచనా వేశారు. ఈ బాటలో 2027కల్లా 7.5 బిలియన్ డాలర్ల ఇబిటాను సాధించవచ్చని ఆశిస్తున్నారు. రానున్న 25ఏళ్లలో విభిన్న స్థాయికి కంపెనీ చేరనున్నట్లు వేదాంతా చైర్మన్ అనిల్ అగర్వాల్ ఇన్వెస్టర్లకు తెలియజేశారు. విభిన్న ప్రాజెక్టులపై 6 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తున్నట్లు అనిల్ సోదరుడు, కంపెనీ వైస్‌చైర్మన్ నవీన్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇది 6 బిలియన్ డాలర్ల అదనపు టర్నోవర్‌కు దారిచూపనున్నట్లు, వార్షికప్రాతిపదికన ఇబిటా 2.5–3 బిలియన్ డాలర్లవరకూ అదనంగా బలపడనున్నట్లు వివరించారు. -
రూ.450 కోట్ల ఆదాయంతో ఐరన్ ఓర్ మైనింగ్ ప్రాజెక్ట్!
అమరావతి: ప్రకాశం జిల్లాలో ఐరన్ ఓర్ మైనింగ్ ను జాయింట్ వెంచర్ విధానంలో ఎపీఎండీసీ చేపట్టనుంది. ఇందుకు గానూ జాయింట్ వెంచర్ సంస్థ ఎంపిక కోసం నిర్వహించే టెండర్లకు సంబంధించిన డాక్యుమెంట్లను ఎపీఎండీసీ మంగళవారం జ్యుడీషియల్ ప్రివ్యూకు సమర్పించింది. ఇంటిగ్రేటెడ్ ఐరన్ ఓర్ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్లానింగ్, ఇంజనీరింగ్, ఫైనాన్సింగ్, కనస్ట్రక్షన్, డెవలప్ మెంట్, ఆపరేషన్ కమ్ మైయింటెనెన్స్ కోసం జేవీ సంస్థను టెండర్ల ద్వారా ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే ఎపీఎండీసీ ప్రకాశం జిల్లా కొణిజేడు మర్లపాడు ప్రాంతం పరిధిలో మొత్తం 1307.26 ఎకరాల్లో లో-గ్రేడ్ మ్యాగ్నెటైట్ ఐరన్ ఓర్ మైనింగ్ లీజులను పొందింది. ఇంటిగ్రేటెడ్ ఐరన్ ఓర్ ప్రాజెక్ట్ ద్వారా లోగ్రేడ్ ఖనిజాన్ని మైనింగ్ చేయడం, బెనిఫికేషన్ ద్వారా నాణ్యతను పెంచడం ద్వారా ఏడాదికి సుమారు రూ.450 కోట్ల మేర సంస్థకు రెవెన్యూ లభిస్తుందని అంచనా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.100 కోట్ల కన్నా ఎక్కువ వ్యయం అయ్యే ప్రాజెక్ట్ లకు నిర్వహించే టెండర్ల ప్రక్రియను ముందుగా జ్యుడీషియల్ ప్రివ్యూకు సమర్పించాలని చట్టం చేసింది. దానిలో భాగంగా ఐరన్ ఓర్ టెండర్ డాక్యుమెంట్ లను ఏపీ జ్యుడీషియల్ ప్రివ్యూ కమిషన్ కు సమర్పించడం జరిగిందని ఏపీఎండీసీ వీసీ&ఎండీ వీజీ వెంకటరెడ్డి తెలిపారు. కమిషన్ వెబ్ సైట్ లో పొందుపరిచిన ఈ టెండర్ డాక్యుమెంట్లపై ప్రజల నుంచి సలహాలు, సూచనలను ఈ నెల 14వ తేదీ వరకు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఇందుకోసం కమిషన్ ఈ-మెయిల్ judge-jpp@ap.gov.in ద్వారా తమ అభిప్రాయాలను తెలియచేయవచ్చునని కోరారు. -
ఏది నిజం?: ఇంకెన్నాళ్లీ గలీజు రాతలు?
ప్రతి రోజూ కొంత విషం!. ఒకో రోజు కాస్త ఎక్కువ డోసు!!. మొత్తానికి ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి... అసత్యాలు, అతిశయోక్తులతోనైనా జనంలో ఎంతోకొంత వై.ఎస్.జగన్ సర్కారుపై వ్యతిరేకత నింపాలన్నదే రామోజీరావు అత్యాశ. ఆ మేరకు తన ఆత్మబంధువు చంద్రబాబు నాయుడిని కొంతైనా పైకి లేపాలన్నది ఆయన పరమోద్దేశం. అందుకే ‘ఈనాడు’లో ఏ కథనం రాసినా దాని దృష్టి వేరు.. ప్రయోజనాలు వేరు. బయటకు ప్రభుత్వాన్ని ఎండగడుతున్నట్లు కనిపిస్తున్నా... అడుగడుగునా వక్రీకరణలే. టార్గెట్ జగన్ మాదిరిగా సాగిపోవాల్సిందే. మంగళవారం వండివార్చిన ‘ఓబుళాపురం మైనింగ్ లీజుల్లో అక్రమాలు’ కూడా అంతే!!. 2009లోనే మైనింగ్ ఆగిపోయిన ఈ గనుల గురించి అసలిప్పుడెందుకు రాసినట్లు? అక్కడ గతంలో జరిగిన అక్రమాలపై తాజాగా అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చారని... ఇదంతా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసిన నేపథ్యంలోనే జరిగిందంటూ బోడిగుండుకు– అరికాలుకు లింకు పెడుతూ రాసి పారేశారు రామోజీ. ఏ కాస్త ఇంగితజ్ఞానం... తన వృత్తిపట్ల కనీస జవాబుదారీతనం ఉన్నవారెవరూ ఇలాంటి రాతలు రాయరు గాక రాయరు. పచ్చి అబద్ధాలను అచ్చేయరు. ఓబుళాపురం గనుల విషయంలో అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందో, వాస్తవంగా ఏం జరుగుతోందో... ‘ఈనాడు’ ఎలా భ్రష్టు పట్టించాలని చూస్తోందో చెప్పేదే ఈ ‘ఏది నిజం?’ ఓబుళాపురం గనుల్లో ఇనుప ఖనిజం తవ్వకాల్లో గతంలో చెలరేగిన వివాదాలు అన్నీ ఇన్నీ కావు. అందుకే అక్కడ అత్యంత పారదర్శకంగా మైనింగ్ కార్యకలాపాలు జరిపించడానికి ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వమే మైనింగ్ చేస్తే ఏ గొడవా ఉండదన్న ఉద్దేశంతో... ఏపీఎండీసీకి ఆ లీజులను రిజర్వు చేయించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం కేంద్ర గనుల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు పంపగా.. స్వయంగా ముఖ్యమంత్రి జగన్ సైతం ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఏపీఎండీసీ ద్వారా ఇనుప ఖనిజాన్ని వెలికితీసి, దాన్ని కడప ఉక్కు ఫ్యాక్టరీకి ముడి ఖనిజంగా రవాణా చేయడం ద్వారా ప్రభుత్వ రంగంలోని సంస్థలను ప్రోత్సహించాలని ఆయన కోరుతున్నారు. రెండురోజుల కిందట కూడా ప్రధానిని కలిసినపుడు కడప ఉక్కు ఫ్యాక్టరీకి గనులను కేటాయించాలని కోరారంటే ఆయన చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు రావటంతో పాటు ప్రభుత్వానికి ఆదాయమూ పెరుగుతుందని... అనేక ఆరోపణలున్న ఇనుప ఖనిజం లీజుల్లో ఎటువంటి విమర్శలకు తావు లేకుండా, పారదర్శకంగా మైనింగ్ జరుగుతుందని భావిస్తున్నారు. ‘ఈనాడు’ రామోజీరావు మాత్రం అసలు ఈ గనులే తెరుచుకోకూడదన్న ఏకైక లక్ష్యంతో ఎప్పటికప్పుడు బురద కథనాలను అచ్చేస్తున్నారు. అదీ తేడా!. పరిమితి ముగిసిన లీజులను ఏపీఎండీసీకి ఇవ్వాలనడం తప్పా? ఓబుళాపురం ప్రాంతంలో 6 ఐరన్ ఓర్ లీజులను 1956 నుంచి 2007 వరకు వివిధ దశల్లో అప్పటి ప్రభుత్వాలు మంజూరు చేశాయి. ఆరోపణలు రావటంతో 2009లో అప్పటి ప్రభుత్వం ఈ లీజులన్నిటినీ సస్పెండ్ చేసింది. బళ్ళారి ఐరన్ ఓర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 27.12 హెక్టార్లలో 1956లో, ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి 25.98 హెక్టార్లలో 1964లో, అనంతపురం మైనింగ్ కంపెనీకి 6.5 హెక్టార్లలో 1956లో లీజులు మంజూరు చేశారు. వీటి గడువు 2020 మార్చి 31తో ముగిసిపోయింది. లీజు ముగిసిన వెంటనే ఈ గనులను ఏపీఎండీసీకి రిజర్వు చేయాలని కోరుతూ 09.10.2019నే కేంద్ర గనుల శాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇదే విషయమై 2022 జనవరి 3న ప్రధాని మోదీకి రాసిన లేఖలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ అభ్యర్థించారు కూడా. ఆ తర్వాత 2022 ఫిబ్రవరి 3న ఈ 3 లీజులను ఏపీఎండీసీకి ఇవ్వాలని కేంద్ర గనుల శాఖ కార్యదర్శికి రాష్ట్రం తరఫున మరోసారి లేఖ రాశారు. ఈ వాస్తవాల్లో ఒక్కటి కూడా ఎన్నడూ ప్రస్తావించని ‘ఈనాడు’... పదేపదే ఈ లీజులను కావాల్సిన వారికి కట్టబెట్టడానికి ప్రయత్నిస్తోందంటూ రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచార ఎజెండాను కొనసాగిస్తోంది. సుప్రీంలో కేసు... అంతిమ తీర్పును బట్టే ఏదైనా! ఓబుళాపురం గనులకు సంబంధించి గతంలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన కేసులపై సుప్రీంకోర్టులో ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఈ విచారణ సమయంలోనే... కాలపరిమితి ముగిసిన మూడు ఇనుప ఖనిజం లీజులను... అన్ని అర్హతలూ ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం లీజులు జారీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తాజాగా ప్రభుత్వం అఫిడవిట్ వేసింది. ఇప్పటికే ఈ ప్రాంత గనులకు సంబంధించి అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదం కోర్టు విచారణలో ఉంది. సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా నిర్ధేశించిన మేరకు ఓబుళాపురం సరిహద్దులను నిర్ధారిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సర్వే రాళ్ళను కూడా ఏర్పాటు చేసింది. అదే విషయాన్ని కోర్టుకు తెలియజేసింది. సరిహద్దుల నిర్ధారణ పూర్తయిందని, అన్ని అర్హతలూ ఉన్నవారికి కేంద్ర నిబంధనల ప్రకారం లీజులు జారీ చేయటానికి తమకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో కోర్టులో ఉన్న కేసును పరిష్కరించడం కోసం త్వరగా వాదనలు వినిపించాలని రాష్ట్ర ప్రభుత్వం అడ్వోకేట్ ఆన్ రికార్డ్స్‌ను అభ్యర్థించింది. ఇదేమైనా తప్పా? ఈ వివాదం పరిష్కారమైతే మూడు గనులకూ లీజులు జారీ అవుతాయి. దాంతో రాష్ట్రానికి కొంత రాయల్టీ.. కొందరికి ఉద్యోగాలు వస్తాయన్నదే ఏ ప్రభుత్వమైనా భావించేది. ఇదంతా తప్పంటే ఎలా రామోజీరావు గారూ? ఇదీ మిగిలిన 3 లీజుల పరిస్థితి... ఇవి కాకుండా ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి 2007 జూన్ 19న 39.48 హెక్టార్లు, 68.50 హెక్టార్లలో రెండు లీజులను అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. వాటి కాలపరిమితి 2057 జూన్ 18 వరకు ఉంది. వై.మహాబలేశ్వరప్ప అండ్ సన్స్‌కు 1978 జనవరి 12న 20.240 హెక్టార్లలో మరో లీజు మంజూరు చేశారు. దీని కాలపరిమితి 2028 జనవరి 11 వరకు ఉంది. ఈ మూడు లీజులు ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నాయి. గతంలో చంద్రబాబు– రామోజీరావు కలిసి నడిపించిన కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో ఈ లీజులను సస్పెండ్‌చేశారు. కంపెనీ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ కిరణ్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా... ఆ విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. మరి దీనికి రాష్ట్ర ప్రభుత్వమేం చేస్తుంది? ఈ 3 లీజులకు సంబంధించి కోర్టు ఇచ్చే తీర్పునకు అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. నిజానికి ఏ ప్రభుత్వమైనా చేసేది అదే. అంతకన్నా ప్రత్యామ్నాయం కూడా ఉండదు. కానీ రామోజీ మాత్రం ఇంకా కోర్టు తీర్పు రాకముందే శివాలెత్తిపోతున్నారు. సుప్రీంకోర్టు ఇంకా తీర్పు ఇవ్వకుండానే... ప్రభుత్వం ఎవరెవరికో లీజులిచ్చేయడానికి ప్రయత్నిస్తోందంటూ చేతికొచ్చిన రాతలు రాస్తున్నారు. ఇవన్నీ చూస్తే వయసు ప్రభావంతో ఈయన మానసిక స్థితి ఏమైందోనన్న అనుమానం రాకమానదు. అమికస్ క్యూరీ నివేదిక అడ్డం పెట్టుకుని అడ్డగోలు రాతలు విచారణ నేపథ్యంలో... ఓబుళాపురం ప్రాంతంలో గతంలో జరిగిన అక్రమాలపై తాజాగా అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు ఒక నివేదికను సమర్పించారు. కానీ రామోజీ దాన్ని వక్రీకరిస్తూ... రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ నేపథ్యంలోనే అమికస్ క్యూరీ తన నివేదికను సమర్పించినట్లు అడ్డగోలు రాతలు రాశారు. ఈ గనులను కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఆయనకు కనిపించటమే లేదు. అదే ఈ రాష్ట్ర దౌర్భాగ్యం. -
ఆ జిల్లాలో ఇనుప ఖనిజం.. అపారం!
సాక్షి, ఒంగోలు : జిల్లాలో లోగ్రేడ్ ఇనుప ఖనిజం నిక్షేపాలు ఒంగోలు మండలంలోని యరజర్ల, టంగుటూరు మండలంలోని కొణిజేడు, మద్దిపాడు మండలంలోని బూరేపల్లి, అన్నంగి తదితర ఏడు గ్రామాల పరిధిలోని కొండల్లో అపారంగా ఉన్నాయి. ప్రకాశం జిల్లా ఆవిర్భవించక ముందే ఒంగోలు, టంగుటూరు, మద్దిపాడు మండలాల్లో లోగ్రేడ్ ఐరన్ ఓర్ నిక్షేపాలు ఉన్నాయని సర్వేలో వెల్లడైంది. అయితే ఈ ఇనుప ఖనిజం నిక్షేపాలను వెలికితీయడానికి అప్పట్లో సాంకేతికత అందుబాటులో లేదు. అదీగాక ఐరన్ గ్రేడ్ 28 శాతం మాత్రమే ఉన్నట్లు పూర్వపు సర్వే నివేదికల్లో పేర్కొన్నారు. ఆ తర్వాత తిరిగి సర్వే చేపట్టిన దాఖలాలు లేవు. కర్నాటకలో ఐరన్ ఓర్ మైనింగ్ బాగా విస్తరించడంతో జిల్లాలో ముడి ఖనిజం వెలికితీత మరుగున పడింది. అయితే కర్నాటక రాష్ట్రంలోని కుద్రేముఖ్ ప్రాంతానికి చెందిన ఓ కంపెనీ లోగ్రేడ్ ఐరన్ ఓర్ అయినా మైనింగ్ చేస్తామని ముందుకు వచ్చింది. దీంతో 1998లో ఆ కంపెనీకి అప్పటి ప్రభుత్వం లీజు మంజూరు చేసింది. కుద్రేముఖ్‌కు చెందిన కంపెనీ ఒంగోలు సమీపంలోని యరజర్ల వద్ద పరిశ్రమ ఏర్పాటు చేసి, ఐరన్ ఓర్ నుంచి తీసిన పిల్లెట్లను కొత్తపట్నం సముద్ర తీర ప్రాంతం నుంచి రవాణా చేసేందుకు ప్రాథమికంగా డీపీఆర్ తయారు చేసుకుంది. ఈ క్రమంలోనే యరజర్ల గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధంకాగా గ్రామస్తులు అడ్డుకోవడంతో తాత్కాలికంగా వాయిదా వేశారు. ఆ తర్వాత గ్రామ పెద్దలతో మాట్లాడినా ఐరన్ ఓర్ తీయడం వల్ల ఇబ్బందులు ఎదురావుతాయని అభిప్రాయాలు వెల్లడించడంతో మైనింగ్ అంశం అటకెక్కింది. ముడి ఖనిజం ఉన్న భూములను ఏపీఎండీసీకి కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఐరన్ ఓర్‌ను వెలికితీసి ఎగుమతి చేసుకోవడానికి మాత్రమే అనుమతి ఇచ్చింది. అప్పట్లో ఏపీఎండీసీ వద్ద వనరులు అందుబాటులో లేకపోవడంతో జింపెక్స్ అనే ప్రైవేట్ సంస్థతో కలిసి ఖనిజాన్ని వెలికితీయడానికి సిద్ధమైంది. కానీ మైనింగ్‌లో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. 1300 ఎకరాలు ఏపీఎండీసీ పరిధిలోనే.. జిల్లాలోని ఒంగోలు, టంగుటూరు, మద్దిపాడు మండలాల్లో మొత్తం 1300 ఎకరాలను సర్వే చేసి ఏపీఎండీసీకి అప్పగించారు. ఐరన్ ఓర్ మైనింగ్‌కు రిజర్వ్ చేసిన భూములు కావడంతో ఆయా ప్రాంతాల్లో ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. దీంతో గ్రావెల్ కొరత తీవ్రమైంది. గత ప్రభుత్వం ఈ కొండలను డీ రిజర్వ్ చేసి గ్రావెల్ తవ్వకానికి, ఇతర అవసరాల కోసం ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని ప్రయత్నాలు చేసింది. కోర్టులో వ్యాజ్యాలు నడుస్తున్నందున డీ రిజర్వ్ చేయలేకపోయారు. యర్రజర్ల వద్ద గృహ నిర్మాణానికి, ఇతర కట్టడాలకు ప్రభుత్వం అడ్వాన్స్ పొజిషన్ తీసుకోవడానికి అనుమతులు ఇచ్చినా గత ప్రభుత్వ హయాంలోనే కొన్ని ఇబ్బందులు, పాలనాపరంగా, న్యాయపరంగా చిక్కులు వచ్చాయి. 6 కోట్ల టన్నుల నిక్షేపాలు జిల్లాలోని యర్రజర్ల, కొణిజేడు, మర్లపాడు, బూరేపల్లి, అన్నంగి తదితర గ్రామాల్లో ఉన్న కొండల్లో సుమారు రూ.6 కోట్ల టన్నుల మేర ఐరన్ ఓర్ నిక్షేపాలు ఉన్నట్లుగా అంచనా. జాతీయ రహదారుల అభివృద్ధి కాంట్రాక్టు పొందిన ఓ సంస్థ అన్నంగి, బూరేపల్లి ప్రాంతాల నుంచి వేలాది టన్నుల గ్రావెల్‌ను అడ్డగోలుగా తవ్వేసి వినియోగించుకున్నా గత ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరించింది. ఒంగోలు మండలం యరజర్ల కొండల పరిసరాల్లో అక్రమంగా గ్రావెల్ తవ్వి విక్రయించి రూ.లక్షలు గడించినా పట్టించుకున్న నాథుడే లేడు. జిల్లాలో ఐరన్ ఓర్ మైనింగ్‌కు 2015లో కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. అయితే కాలుష్య నియంత్రణ మండలితోపాటు మరికొన్ని అనుమతులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హొస్పేట్‌కు చెందిన సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ ప్రాంతంలో లీజు కోసం తాము తొలుత దరఖాస్తు చేసుకున్నామని తమకే లీజు ఇవ్వాలని కోరింది. అయితే ఏపీఎండీసీ ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో దానికే ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. సుప్రీం కోర్టులోనూ ఏపీఎండీసీకి అనుకూలంగా తీర్పు రావడంతో జింపెక్స్తో కూడా సంబంధం లేకుండా సొంతగానే ఇనుప ఖనిజం తవ్వాలని యోచిస్తోంది. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. -
బ్రెజిల్లో కూలిన ఆనకట్ట
-
బ్రెజిల్లో కూలిన ఆనకట్ట
బ్రుమాడినో: బ్రెజిల్లో వాడుకలోలేని ఓ ఆనకట్ట శుక్రవారం కూలి 11 మంది మరణించగా మరో 300 మందికిపైగా గల్లంతయ్యారు. వారంతా బతికుండే అవకాశాలు తక్కువేనని అధికారులు అంటున్నారు. ఆగ్నేయ బ్రెజిల్‌లోని మినాస్ గెరైస్ రాష్ట్రం, బెటో హొరిజొంటె పట్టణం సమీపంలో, ఇనుప ఖనిజం గని పక్కన ఈ ప్రమాదం జరిగింది. ఆనకట్ట కూలి అందులోని బురద ఒక్కసారిగా గని దగ్గర పనిచేస్తున్న వారిని ముంచేసింది. సమీపంలోని రోడ్లు, ఇళ్లను చుట్టుముట్టింది. శనివారం ఉదయానికి అందిన సమాచారం ప్రకారం 11 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. గల్లంతైన వారిలో 150 మందికి పైగా గనిలో తవ్వకాలు చేపడుతున్న సంస్థ ఉద్యోగులని తెలుస్తోంది. ఇప్పటివరకు మొత్తం 279 మందిని ప్రాణాలతో రక్షించారు. -
ఉల్లం‘ఘనుల’ నుంచి రూ. 60 వేల కోట్లు రాబట్టండి
న్యూఢిల్లీ: ఒడిశాలో వెలుగుచూసిన మాంగనీస్, ఇనుప ఖనిజాల అక్రమ మైనింగ్‌పై జస్టిస్ ఎం.బి. షా కమిషన్ సంచలన సిఫార్సు చేసింది. మైనింగ్ కంపెనీలు రూ. 59,203 కోట్ల మేర అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డాయని...ఈ సొమ్మును ఆయా కంపెనీల నుంచి వీలైనంత త్వరగా రాబట్టాలని ఒడిశా ప్రభుత్వానికి సూచించింది. అక్రమ మైనింగ్ వల్ల తీవ్రంగా దెబ్బతిన్న కియోంఝర్, సుందర్‌గఢ్ జిల్లాల అభివృద్ధికి ఆ సొమ్మును ఖర్చు చేయాలని కేంద్రానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. కమిషన్ నివేదిక ప్రకారం కేవలం పర్యావరణ అనుమతులలోనే రూ. 45,453 కోట్ల మేర ఇనుప ఖనిజం, రూ. 3,089 కోట్ల మేర మాంగనీస్ అక్రమ మైనింగ్ జరిగింది. అలాగే ఉలిబూరు రిజర్వ్, రెవెన్యూ అడవుల్లో రూ. 2వేల కోట్లకుపైగా అక్రమ మైనింగ్ జరిగిందని కమిషన్ గుర్తించింది. దీనిపై ఒడిశా అటవీశాఖ 2011లో నామమాత్రంగా బార్బిల్లోని ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలు చేయ డం వెనక కుట్ర దాగి ఉందని...అందువల్ల ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కమిషన్ పేర్కొంది. భవిష్యత్తులో మైనింగ్ లీజులను వేలం ద్వారానే అప్పగించాలని సిఫార్సు చేసింది. ప్రధాని మన్మోహన్సింగ్ అధ్యక్షతన గురువారం సమావేశమైన కేబినెట్ ముందుకు ఈ నివేదిక వచ్చింది.