న్యూఢిల్లీ: ఒడిశాలో వెలుగుచూసిన మాంగనీస్, ఇనుప ఖనిజాల అక్రమ మైనింగ్‌పై జస్టిస్ ఎం.బి. షా కమిషన్ సంచలన సిఫార్సు చేసింది. మైనింగ్ కంపెనీలు రూ. 59,203 కోట్ల మేర అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డాయని...ఈ సొమ్మును ఆయా కంపెనీల నుంచి వీలైనంత త్వరగా రాబట్టాలని ఒడిశా ప్రభుత్వానికి సూచించింది. అక్రమ మైనింగ్ వల్ల తీవ్రంగా దెబ్బతిన్న కియోంఝర్, సుందర్‌గఢ్ జిల్లాల అభివృద్ధికి ఆ సొమ్మును ఖర్చు చేయాలని కేంద్రానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. కమిషన్ నివేదిక ప్రకారం కేవలం పర్యావరణ అనుమతులలోనే రూ. 45,453 కోట్ల మేర ఇనుప ఖనిజం, రూ. 3,089 కోట్ల మేర మాంగనీస్ అక్రమ మైనింగ్ జరిగింది.
అలాగే ఉలిబూరు రిజర్వ్, రెవెన్యూ అడవుల్లో రూ. 2వేల కోట్లకుపైగా అక్రమ మైనింగ్ జరిగిందని కమిషన్ గుర్తించింది. దీనిపై ఒడిశా అటవీశాఖ 2011లో నామమాత్రంగా బార్బిల్‌లోని ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలు చేయ డం వెనక కుట్ర దాగి ఉందని...అందువల్ల ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కమిషన్ పేర్కొంది. భవిష్యత్తులో మైనింగ్ లీజులను వేలం ద్వారానే అప్పగించాలని సిఫార్సు చేసింది. ప్రధాని మన్మోహన్‌సింగ్ అధ్యక్షతన గురువారం సమావేశమైన కేబినెట్ ముందుకు ఈ నివేదిక వచ్చింది.
ఉల్లం‘ఘనుల’ నుంచి రూ. 60 వేల కోట్లు రాబట్టండి
Published Fri, Jan 3 2014 12:48 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM
Advertisement