మాస్కో: రష్యాలో కోవిడ్ 24 గంటల వ్యవధిలో వెయ్యి మందిని బలి తీసుకుంది. ఒకే రోజు 33,208 కొత్త కేసులు నమోదు కాగా, 1,002 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా ప్రభుత్వం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 79,58,384కి చేరుకోగా, ఇప్పటివరకు 2,22,315 మంది ప్రాణాలు కోల్పోయారు.
యూరప్ దేశాల్లో అత్యధిక కరోనా మరణాలు రష్యాలోనే సంభవించాయి. అమెరికా, బ్రెజిల్, భారత్, మెక్సికో తర్వాత కరోనా కేసులు అధికంగా రష్యాలోనే వెలుగులోకి వస్తున్నా యి. అయితే, ప్రభుత్వం మాత్రం కరోనా ఆంక్షలు విధించాలో, వద్దో స్థానిక యంత్రాంగం నిర్ణయించాలని అంటోంది. ఇప్పటి వరకు కేవలం 29% మంది జనాభాకి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment