
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతోంది. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 3,824 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత ఆరు నెలల్లో ఇవే ఒకరోజు అత్యధిక కేసులు కావడం గమనార్హం. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 18,389కు చేరుకుంది.
దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 4,47,22,605 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. 5,30,881 మంది ఈ మహమ్మారి కాటుకు బలయ్యారు. మరోవైపు రికవరీ రేటు 98.77 శాతంగా ఉంది. 4,41,73,335 మంది కరోనా బారినపడి, చికిత్సతో పూర్తిగా కోలుకున్నారు. కరోనా సంబంధిత మరణాల రేటు 1.19 శాతంగా రికార్డయ్యింది. కేంద్ర ప్రభత్వుం ఇప్పటివరకు 220.66 కోట్ల కోవిడ్–19 వ్యాక్సిన్ డోసులను ప్రజలకు పంపిణీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment