Tabas City
-
ఇరాన్ గనిలో పేలుడు.. 51 మంది మృతి
టెహ్రాన్: ఇరాన్ తూర్పు ప్రాంతంలోని దక్షిణ ఖొరసాన్ ప్రావిన్స్‌లోని టబాస్ గనిలో భారీ ప్రమాదం సంభవించింది. మిథేన్ గ్యాస్ వెలువడటంతో జరిగిన పేలుడులో 51 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 20 మంది గాయపడ్డారు. మరికొందరి జాడ తెలియడం లేదని అధికారులు తెలిపారు. శనివారం రాత్రి ప్రమాదం జరిగిన సమయంలో 70 మందికి పైగా 700 మీటర్ల లోతులో పనిచేస్తున్నారని చెప్పారు. రక్షణ, సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధ్యక్షుడు పెజెష్కియాన్ అధికారులను ఆదేశించారు. -
కుప్పకూలిన ఇరాన్ విమానం
టెహ్రాన్: మలేసియా విమాన దుర్ఘటన మరవకముందే మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఇరాన్ పౌర విమానం ఒకటి ఆదివారం కూలిపోయింది. టెహ్రాన్ లోని మెహ్రాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన టబాన్ ఎయిర్ లైన్స్ విమానం ఈ ఉదయం 9.18 నిమిషాలకు కూలిపోయిందని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ వెల్లడించింది. విమానం దక్షిణ ఖొరసాన్ ప్రావిన్స్ లోని టబాస్ నగరానికి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగిందని తెలిపింది. 40 మందిపైగా మృతి చెందివుంటారని ఆందోళన చెందుతున్నారు. విమానం శకలాల కోసం గాలింపు జరుపుతున్నారు.