చింతపల్లి, న్యూస్‌లైన్ : నాగార్జునసాగర్-హైదరాబాద్ హైవేపై గరుడ బస్సు లో అగ్ని ప్రమాదం జరిగింది. డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన చింతపల్లి మండలం నసర్లపల్లి గేటు సమీపంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో 50 మంది ప్రయాణికులను ఎక్కించుకున్న గరుడ బస్సు రాత్రి 12:30 గంటలకు నెల్లూరుకు బయలుదేరింది. నసర్లపల్లి సమీపంలోకి రాగానే గరుడ బస్సు ఇంజన్ డిక్కీలో నుంచి పొగ వచ్చింది. గమనించిన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కకు ఆపాడు. అప్పటికే ఇంజన్ డిక్కీలో నుంచి మంటలు రేగుతున్నాయి. అయితే మాల్ సమీపంలోకి రాగానే బస్సులో నుంచి ఒక రకమైన వాసన వస్తుండడంతో ప్రయాణికులు కూడా ఈ విషయాన్ని డ్రైవర్‌కు చెప్పారు.
దీంతో ముందుగానే ఇంజన్ డిక్కీ తెరిచి చూడడంతో ప్రమాదం తప్పింది. డిక్కీలో మంటలు రేగుతున్న విషయాన్ని ప్రయాణికులకు చెప్పడం తో వారు బస్సు నుంచి కిందకు దిగి ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణికులు తమ వద్ద ఉన్న వాటర్ బాటిళ్లతో మం టలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. వెంటనే ఫైరిం జన్‌కు, పోలీసులకు సమాచారం అంది ంచారు. దేవరకొండ అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే డిక్కీలో ఉన్న సామగ్రి కొంతమేర కాలిపోయింది. అయితే మరికొద్దిసేపు విషయాన్ని గమనించకుండా అలాగే బస్సు నడిపితే భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేది. రెండు గంటల అనంతరం మరో బస్సులో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశారు.
షార్ట్‌సర్క్యూట్‌తోనే మంటలు
బస్సు డిక్కీలో పరిమితికి మించి ప్రయాణికుల లగేజీని ఉంచడమే ప్రధా న కారణమని తెలుస్తోంది. లగేజీని అందులోకి నెట్టి ఉంచడంతో వైర్లు షార్ట్‌సర్క్యూట్ కావడంతోనే ప్రమాదం జరిగిందని డ్రైవర్, ప్రయాణికులు పేర్కొన్నారు.
తప్పిన పెను ప్రమాదం
Published Thu, Nov 14 2013 1:37 AM | Last Updated on Fri, Oct 19 2018 7:22 PM
Advertisement