garuda
-
'బఘీర' మూవీ రివ్యూ
టైటిల్: బఘీరనటీనటులు: శ్రీ మురళి, రుక్మిణి వసంత్, అచ్యుత్, గరుడ రామ్, ప్రకాశ్ రాజ్ తదితరులుదర్శకుడు: డాక్టర్ సూరినిర్మాతలు: హోంబలే ఫిలింస్సంగీత దర్శకుడు: అజనీష్ లోకనాథ్సినిమాటోగ్రఫీ: అర్జున్ శెట్టివిడుదల: 31 అక్టోబర్, 2024ప్రశాంత్ నీల్ తొలి సినిమా ఉగ్రం హీరో శ్రీ మురళి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బఘీర. ప్రశాంత్ నీల్ కథ అందించిన ఈ చిత్రంతో డాక్టర్ సూరి డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు. దీపావళి కానుకగా కన్నడతో పాటు తెలుగులో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం..కథవేదాంత్ (శ్రీ మురళి)కి చిన్నప్పటి నుంచే ప్రజలను కాపాడే ఒక సూపర్ హీరో కావాలని కోరుకుంటాడు. సూపర్ హీరోలకు పవర్ ఉంది కాబట్టి వాళ్లు జనాన్ని కాపాడుతున్నారు కానీ ఏ పవర్ లేకపోయినా పోలీసులు కూడా జనాన్ని కాపాడుతున్నారని తల్లి చెప్పడంతో వేదాంత్ కష్టపడి చదివి ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు. కొన్నాళ్లపాటు సిన్సియర్ పోలీసాఫీసర్‌గా పని చేస్తాడు. కానీ పై నుంచి ఒత్తిళ్లు ఎక్కువవుతాయి. తనకు పరిమితులు విధిస్తారు. అంతేకాదు, తన పోలీసు ఉద్యోగం కోసం తండ్రి రూ.50 లక్షలు లంచం ఇచ్చాడని తెలిసి కుంగిపోతాడు. తన స్టేషన్ ముందు జరిగిన ఓ ఘటన వల్ల అతడు బఘీరగా అవతారమెత్తుతాడు. రాత్రిపూట బఘీరగా మారి క్రిమినల్స్‌ను వేటాడుతుంటాడు. అలా బఘీరకి జనాల్లో మంచి క్రేజ్ వస్తుంది. ఓ క్రిమినల్ రానా( గరుడ రామ్) అన్ని వ్యాపారాలకు బఘీర అడ్డొస్తాడు. ఈ ప్రయాణంలో బఘీరకు ఎదురైన సవాళ్లేంటి? వేదాంతే బఘీర అని సీబీఐ పసిగడుతుందా? వేదాంత్ ప్రేమకథ సుఖాంతమైందా? లాంటి విషయాలు తెరపై చూడాల్సిందే!విశ్లేషణప్రశాంత్ నీల్ నుంచి వచ్చే సినిమాల్లో భారీ యాక్షన్ ఉంటుంది. బఘీర కూడా ఆ కోవకు చెందినదే.. కాకపోతే కేజీఎఫ్‌లో అమ్మ సెంటిమెంట్, సలార్‌లో స్నేహం.. బాగా పండాయి. అలాంటి ఓ బలమైన ఎమోషన్ ఈ సినిమాలో పండలేదు. ప్రజల్ని నేరస్థుల బారి నుంచి రక్షించేందుకు హీరోలు ముసుగ వేసుకుని సూపర్ హీరోలా మారడం ఇదివరకే చాలా సినిమాల్లో చూశాం. కాకపోతే ఈ మూవీలో హీరో పోలీస్ కావడం.. పోలీస్‌గా ఏదీ చేయలేకపోతున్నానన్న బాధతో సూపర్ హీరోగా మారడం కొత్త పాయింట్.ఆరంభ సన్నివేశాలు ఆసక్తికరంగా మొదలవుతాయి. అయితే హీరో లవ్ ట్రాక్ కథకు స్పీడ్ బ్రేకులు వేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. హీరో బఘీరగా మారాక కథనం మరింత రంజుగా మారుతుంది. ఇంటర్వెల్ సీన్.. సెకండాఫ్‌పై అంచనాలు పెంచేస్తుంది. సిబిఐ ఆఫీసర్‌గా ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథలో వేగం పెరుగుతుంది. ఈ బఘీర ఎవరు? అని తెలుసుకునేందుకు ప్రకాష్ రాజ్ పడే తిప్పలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా ఉన్నాయి. అయితే క్లైమాక్స్ వరకు హీరోకు, విలన్‌కు మధ్య బలమైన ఫైట్ ఉండదు. క్లైమాక్స్ కొత్తగా ఏమీ ఉండదు.ఎవరెలా చేశారంటే?వేదాంత్ అనే ఐపీఎస్ అధికారిగా, సూపర్ హీరో బఘీరగా శ్రీ మురళి రెండు షేడ్స్ లో నటిస్తూ ఆకట్టుకున్నాడు. రుక్మిణి వసంత్ పాత్రకు కథలో ప్రాధాన్యతే లేదు. ప్రకాష్ రాజ్, అచ్యుత్ కుమార్, గరుడ రామ్, రంగనాయనా వంటివాళ్లు స్క్రీన్ మీద చేసిన మ్యాజిక్ భలే అనిపిస్తుంది.టెక్నికల్ వాల్యూస్ విషయానికి వస్తే కథ రొటీన్ కావడంతో సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడా కొత్తదనం ఫీలింగ్ రాదు. ఎందుకంటే ఏ సీన్ చూసినా ఎక్కడో చూశానే అనే ఫీలింగ్ కలుగుతుంది. యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి. అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి తగ్గట్టుగా ఉంది. ఏజే శెట్టి సినిమాటోగ్రఫీ సినిమాకు ఆకర్షణగా నిలిచింది.(కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)రేటింగ్: 2.75 /5 -
మహేశ్-రాజమౌళి సినిమా: టైటిల్ ఇదేనా? ఆ పోస్ట్ అర్థం ఏంటి?
మహేశ్ బాబు-రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు కానీ.. ఈ సినిమాపై రోజు ఏదో ఒక పుకారు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. మొన్నటికి వరకు ఈ సినిమాలో నటించబోయే నటీనటులు గురించి రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఏకంగా ఈ సినిమా టైటిల్‌పైనే ఓ రూమర్ వచ్చింది. దానికి విజువల్ డెవలప్మెంట్ ఆర్టిస్ట్ టీపీ విజయన్ ఇన్‌స్టాలో చేసిన ఓ పోస్టే కారణం. (చదవండి: ‘వన్స్ మోర్’ అంటున్న ఫ్యాన్స్.. పాత సినిమాలే సరికొత్తగా!)తాజాగా విజయన్ తన ఇన్‌స్టా స్టోరీలో బంగారు వర్ణంలో ఉన్న గద్ద రెక్కల ఫోటోని షేర్ చేస్తూ దానికి #SSMB29, #SSMB29DIARIES హ్యాష్ ట్యాగ్‌లను జత చేశాడు. దీంతో ఇది కచ్చితంగా మహేశ్-రాజమౌళి సినిమా అప్డేటే అని, ఈ చిత్రానికి ‘గరుడ’ అని టైటిల్ పెట్టారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. (చదవండి: స్త్రీ-2 దెబ్బకు బాక్సాఫీస్ షేక్.. బద్దలవుతున్న రికార్డులు!)ఈ టైటిల్‌ని రాజమౌళి చాలా రోజుల కిందటే ప్రకటించాడు. ‘బాహుబలి’ తర్వాత ‘గరుడ’ అనే సినిమా చేస్తానని గతంలోనే ప్రకటించాడు. కానీ ఆ సినిమా రిలీజ్ తర్వాత గరుడ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఇప్పుడు మహేశ్‌తో తీయబోయే సినిమాకు ఈ టైటిల్‌నే పెట్టారంటూ ప్రచారం జరుగుతోంది. ఇందులో మహేశ్‌ని సరికొత్త అవతారంలో చూపించబోతున్నాడట. ఇప్పటికే మహేశ్ తన లుక్‌ని మార్చేశాడు. సినిమా కోసం జట్టు, గడ్డాన్ని పెంచేశాడు. ప్రస్తుతం రాజమౌళి ప్రీ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉన్నాడు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. -
కొచ్చి నేవీ కేంద్రంలో హెలికాప్టర్ ప్రమాదం
కొచ్చి/న్యూఢిల్లీ: కొచ్చి నావికా కేంద్రంలో శనివారం జరిగిన ప్రమాదంలో నేవీకి చెందిన ఒక నావికుడు ప్రాణాలు కోల్పోయారు. ఐఎన్ఎస్ గరుడపై ట్యాక్సీ చెకింగ్ సమయంలో చేతక్ హెలికాప్టర్ అనుకోకుండా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో లీడింగ్ ఎయిర్ మ్యాన్ యోగేంద్ర సింగ్ ప్రాణాలు కోల్పోయారని నేవీ ఒక ప్రకటనలో తెలిపింది. ఘటనపై బోర్డ్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించినట్లు వెల్లడించింది. నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ యోగేంద్ర సింగ్ మృతికి సంతాపం ప్రకటించారని వివరించింది. యోగేంద్ర సింగ్ స్వరాష్ట్రం మధ్యప్రదేశ్ అని తెలిపింది. -
గరుత్మంతుడు, హనుమంతుడి మధ్య పోరులో ఎవరు గెలిచారో తెలుసా?
శ్రీమహావిష్ణువు వాహనంగా గరుత్మంతుడు యుగయుగాలుగా సేవలందిస్తూ వస్తున్నాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణావతారంలో కూడా అవసరమైన వేళల్లో గరుత్మంతుడు శ్రీహరిని సేవించుకుంటూ ఉండేవాడు. గరుత్మంతుడు పుట్టుకతోనే అమిత బలశాలి. ‘అసలు ముల్లోకాలలోనూ నా ఎదుట నిలిచి, తనను యుద్ధంలో గెలవగల ధీరుడెవడున్నాడు? లోకపాలకుడైన శ్రీమన్నారాయణుడినే వీపుమీద మోస్తున్నవాడిని నన్ను మించిన వీరుడింకెవడున్నాడు’ అనుకుని గర్వించసాగాడు.గరుడుని ధోరణిని కొన్నాళ్లుగా గమనిస్తున్న శ్రీకృష్ణుడు ఎలాగైనా, అతడికి గర్వభంగం చేయాలని తలచాడు. ద్వారకలో సత్యా సమేతుడై సభలో కొలువుదీరిన శ్రీకృష్ణుడు ఒకసారి గరుత్మంతుడిని తలచుకున్నాడు. వెంటనే గరుత్మంతుడు కృష్ణుని ముందు వాలి, ‘ప్రభూ! ఏమి ఆజ్ఞ’ అంటూ మోకరిల్లాడు.‘వీరాధి వీరా! వైనతేయా! నీతో ముఖ్యమైన పని పడింది. అందుకే నిన్ను తలచుకున్నాను’ అని చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు కృష్ణుడు. ‘ఆజ్ఞ ఏమిటోసెలవివ్వు ప్రభూ’ అంటూ చేతులు జోడించాడు గరుత్మంతుడు.‘మరేమీ లేదు. గంధమాదన పర్వతం మీద కదళీవనంలో తపస్సు చేసుకుంటూ హనుమంతుడు ఉంటాడు. అతడితో ముఖ్యమైన విషయం మాట్లాడవలసి ఉంది. అతణ్ణి ఇక్కడకు తోడ్కొని రావాలి. ఈ పనికి నువ్వే తగిన సమర్థుడవు’ అన్నాడు కృష్ణుడు. కృష్ణుడి ఆదేశానికి గరుత్మంతుడు మనసులో నొచ్చుకున్నాడు. ‘నేనేమిటి? నా పరాక్రమమేమిటి? ఒక వానరాన్ని తోడ్కొని రావడానికి నేను స్వయంగా వెళ్లడమా?’ అనుకున్నాడు. అయినా ప్రభువు ఆజ్ఞ కదా, ఎలాగైనా నెరవేర్చవలసిందే అనుకుని తక్షణమే బయలుదేరాడు. మనోవేగంతో ఎగురుకుంటూ వెళ్లి, గంధమాదన పర్వతం మీద వాలాడు. అక్కడ హనుమంతుడు నిశ్చల ధ్యానమగ్నుడై కనిపించాడు. గరుత్మంతుడు హనుమంతుడిని పిలిచాడు. ధ్యానంలో ఉన్న హనుమంతుడికి అతడి పిలుపు వినిపించలేదు. ‘ఓ వానరశ్రేష్ఠా! మహాత్ముడైన భగవంతుడు శ్రీకృష్ణుడు నిన్ను పిలుస్తున్నాడు. శ్రీకృష్ణుని ఆజ్ఞ అనుల్లంఘనీయం. కనుక నిన్ను తీసుకుపోకుండా ఇక్కడి నుంచి కదలను’ అని బిగ్గరగా అన్నాడు. తదేక ధ్యానంలో ఉన్న హనుమంతుడు కదల్లేదు, మెదల్లేదు. గరుత్మంతుడికి కోపం వచ్చింది. హనుమంతుడికి ధ్యానభంగం కలిగించైనా, తనతో తీసుకుపోవాలని నిర్ణయించుకున్నాడు. తన పొడవాటి ముక్కును హనుమంతుడి ముక్కు రంధ్రంలోకి పోనిచ్చాడు. గరుత్మంతుడి వికారచేష్టను గమనించి కూడా, హనుమంతుడు నిశ్చలంగా ఉన్నాడు. కాసేపటికి తన ధ్యానాన్ని విరమించుకుని, ప్రాణాయామం ప్రారంభించాడు. ముక్కు కుడి రంధ్రం నుంచి వాయువును విడిచి, ఎడమ రంధ్రం ద్వారా పీల్చుకోసాగాడు. హనుమంతుడి ప్రాణాయామ సాధన గరుత్మంతుడికి ప్రాణసంకటంగా మారింది. హనుమంతుడు గాలి విడిచేటప్పుడు ఎవరో బలంగా నెట్టేసినట్లు గరుత్మంతుడు దూరంగా వెళ్లి పడుతున్నాడు. హనుమంతుడు గాలి పీల్చుకునేటప్పుడు ఎవరో బలంగా లాగుతున్నట్లు హనుమంతుడి వైపు రాసాగాడు. హనుమంతుడు ఊపిరి బిగించి వాయువును కుంభించేటప్పుడు అతడి ముక్కుకు అతుక్కుంటున్నాడు. ఈ ఉత్పాతానికి బిక్కచచ్చిన గరుడుడు వజవజ వణకసాగాడు. హనుమంతుడి ప్రాణాయామం పూర్తయ్యాక గరుత్మంతుడు విడుదలయ్యాడు. బతుకు జీవుడా అనుకుని తెప్పరిల్లాడు. కృష్ణాజ్ఞను ఉల్లంఘించినందుకు హనుమంతుడి మీద కోపం తెచ్చుకున్నాడు. దేహాన్ని పెంచి, ఆకాశాన్ని కమ్మేస్తూ హనుమంతుడిని తీసుకుపోయేందుకు అతని చుట్టూ ఎగురుతూ తిరగసాగాడు.గరుత్మంతుడిని పట్టుకునేందుకు హనుమంతుడు తన తోకను ఆకాశం వరకు పెంచాడు. అదేదో కొయ్య స్తంభం అనుకున్నాడు గరుత్మంతుడు. ఎగిరి ఎగిరి అలసిపోయి, కాసేపు ఈ స్తంభాన్ని ఆనుకుని సేదదీరాలనుకుని, హనుమద్వాలం మీద వాలాడు. తాను వాలినది స్తంభం కాదని, హనుమంతుడి తోక అని గ్రహించి, దానిని తన పదునైన ముక్కుతో పొడవడం ప్రారంభించాడు. హనుమంతుడికి చిర్రెత్తింది. తన తోక రోమాల మధ్య గరుత్మంతుణ్ణి బంధించాడు. అంత బలశాలి అయిన గరుత్మంతుడు కూడా హనుమంతుడి తోక రోమాలలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరయ్యాడు. హనుమంతుడు తన తోకను గిరగిర తిప్పి, గరుత్మంతుణ్ణి ఒక్కసారిగా విసిరేశాడు. ఆ దెబ్బకు అవయవాలన్నీ చితికిన గరుత్మంతుడు ఏకంగా పాలసముద్రంలో పడ్డాడు. కాసేపు అక్కడే సేదదీరాడు. తిరిగి శక్తి కూడదీసుకుని, ద్వారక చేరుకుని శ్రీకృష్ణుడి ముందు వాలాడు. తన ముందు దీనంగా నిలుచుకున్న గరుత్మంతుణ్ణి చూసిన కృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ, ‘ఖగేంద్రా! అలా నిర్విణ్ణుడవై నీరసంగా నిలుచున్నావేమిటి? ఏం జరిగింది? చెప్పు’ అన్నాడు. ‘దేవదేవా! జగన్నాటక సూత్రధారీ! మీ ఆజ్ఞ నెరవేర్చడానికి హనుమంతుడి వద్దకు వెళ్లాను. అతడు నా మాట వినలేదు’ అని గరుత్మంతుడు చెబుతుండగానే శ్రీకృష్ణుడు అడ్డు తగిలాడు.‘ఛీ! ఏమిటీ ఆలస్యం? అతడితో నాకు ముఖ్యమైన పని ఉంది. వెంటనే తీసుకురా’ అన్నాడు.‘స్వామీ! నా బలగర్వం అణిగింది. వానరరూపంలో నా మృత్యువే అక్కడ ఉంది. హనుమంతుడు ఉండే చోటుకు తప్ప ఇంకెక్కడికి పంపినా వెళతాను’ అన్నాడు గరుత్మంతుడు.‘ఈసారి అలా జరగదు. రామనామం జపిస్తూ వెళ్లు. నీ సీతారాముడు నిన్ను పిలుస్తున్నాడని చెప్పు. హనుమ నీతో మారు మాటాడకుండా వస్తాడు’ అని చెప్పాడు శ్రీకృష్ణుడు. గరుత్మంతుడు ఈసారి వినయంగా వెళ్లి, శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారమే చెప్పి హనుమంతుడిని తనతో తోడ్కొని వచ్చాడు. -
కథను మలుపుతిప్పే రోల్స్.. పాపే ప్రాణంగా రానున్న సినిమాలు
కథను కీలక మలుపు తిప్పే ‘కీ’ రోల్స్ దాదాపు ప్రతి సినిమాలోనూ ఉంటాయి. ఈ కీ రోల్స్‌కి ఏజ్‌తో సంబంధం ఉండదు. చిన్నారులు కూడా కథలో పెద్ద మార్పుకు కారణం అవుతుంటారు. ‘ఆర్ఆర్ఆర్’, ‘బింబిసార’ వంటి సినిమాల్లో చిన్ని పాపలు కథకు ప్రాణంగా నిలిచారు. ఇలా ‘పాపే ప్రాణం’ అంటూ సాగే కథలతో రానున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. సంరక్షకుడు? ‘పసివాడి ప్రాణం, జగదేకవీరుడు అతిలోక సుందరి, అంజి’... వంటి సినిమాల్లో చిన్నారులతో చిరంజీవి చేసిన అల్లరి సన్నివేశాలు, అదే సమయంలో వారి ప్రాణ రక్షకుడుగా చేసిన సాహసాలు ప్రేక్షకులను అలరించాయి. మళ్లీ వెండితెరపై ఓ పాపకు సంరక్షకుడిగా ఉండే పాత్రలో చిరంజీవి నటించనున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్‌ను బట్టి ఇది సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ చిత్రంలో ఓ పాప కీలక పాత్రలో నటించనుందని, ఈ పాప సంరక్షకుడిగా చిరంజీవి చేసే సాహసాలు అబ్బురపరచేలా ఉంటాయని టాక్. ఈ ఏడాది చివర్లో రెగ్యులర్ షూటింగ్ ఆరంభించి, వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో యూనిట్ ఉందని తెలిసింది. ఈ సంగతి ఇలా ఉంచితే... వశిష్ట దర్శకుడిగా పరిచయం అయిన ‘బింబిసార’ చిత్రంలో ఓ పాప సెంట్రల్ క్యారెక్టర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. హార్ట్ ఆఫ్ సైంధవ్ శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా.. ఇలా ముచ్చటగా ముగ్గురు హీరోయిన్లు ఉన్నా కూడా హీరో ‘సైంధవ్’ మనసులో తొలి స్థానం చిన్నారి సారాదే. సారా అంటే ‘హార్ట్ ఆఫ్ సైంధవ్’ అన్నమాట. వెంకటేశ్ టైటిల్ రోల్లో నటిస్తున్న ఈ సైంధవ్ సినిమాకు ‘హిట్’ ఫ్రాంచైజీ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. సైంధవ్ హార్ట్ సారా అని చిత్ర యూనిట్ అంటోందంటే కథలో చిన్నారి సారా పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని ఊహించవచ్చు. తమిళ నటుడు ఆర్య, హిందీ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రలు చేస్తున్న ‘సైంధవ్’ చిత్రం డిసెంబరు 22న విడుదల కానుంది. హాయ్ నాన్న తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెలుగులో రూపొందుతున్న మరో చిత్రం ‘హాయ్ నాన్న’. ఈ ఎమోషనల్ మూవీలో నాని హీరోగా నటిస్తున్నారు. ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర కథ ఓ పాప పాత్ర చుట్టూ తిరుగుతుందని, ఈ క్రమంలో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయని తెలుస్తోంది. ‘హాయ్ నాన్న’ డిసెంబరు 21న రిలీజ్ కానుంది. గరుడ సాహసాలు ‘గరుడ’ సినిమా పోస్టర్ చూశారుగా.. సత్యదేవ్ వీపుపై కూర్చున్న ఓ చిన్నారి ఎంత భయంగా చూస్తుందో కదా! పైగా అది అడవి ప్రాంతం. ఆ చిన్నారి భయాన్ని పోగొట్టి, తనను సురక్షితంగా గరుడ ఎలా రక్షించాడనేది వెండితెర పైనే చూడాలంటోంది యూనిట్. సత్యదేవ్ హీరోగా క్రాంతి బాల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘గరుడ’. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో సాగే అడ్వంచరస్ మూవీగా ఈ చిత్రం ఉంటుందట. ఈ చిత్రం తొలి భాగం ‘గరుడ: చాప్టర్ 1’ త్వరలోనే రిలీజ్ కానుంది. ఇలా చిన్నారులు కీలకంగా నిలిచే చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. -
నేడు నాగ పంచమి? లేక గరుడు పంచమి? అనలా! ఎందుకిలా అంటే..
నిజానికి పంచమి తిథి అనగానే నాగులే గుర్తుకొస్తాయి. చాలామంది పంచమి తిథి రోజున పుట్టలో పాలు పోయడం, నాగ్రేంద్రుడుని పూజించడం వంటివి చేస్తారు. కానీ ఈ శ్రావణ మాసంలో వచ్చే ఈ పంచమి తిథిని మాత్రం 'గరుడ పంచమి' అని కూడా అంటారు. నాగులు. గరుడు (అంటే గ్రద) రెండు పరమ వైరి జంతువులు. అలాంటి రెండింటికి సంబంధించిన రోజుగా పండితులు చెబుతుంటారు. ఇంతకీ దీన్ని నాగుల పంచమి అని పిలవాలా లేక గరుడు పంచమి అనాల? ఎందికిలా రెండు రకాలుగా పిలుస్తున్నాం. దీనికున్న ప్రాశస్యం తదితరాల గురించే ఈ కథనం!. ఎందుకిలా రెండు రకాలుగ పిలుస్తున్నారంటే.. కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. వినతకి గరుత్మంతుడు జన్మించిగా, కద్రువ కడుపున సర్పజాతి జన్మించింది. అందువల్ల సర్పజాతి జన్మించిన శ్రావణ శుద్ధ పంచమి నాగ పంచమిగా పిలవబడుతోంది. ఇక ఇదే రోజున వినతకి గరుత్మంతుడు జన్మించాడు కనుక శ్రావణ శుద్ధ పంచమిని గరుడు పంచమిగా కూడా వ్యవహరిస్తున్నాం. అదీగాక ఆయన తన తల్లి వినత దాస్య విముక్తి కోసం ఆయన కనబర్చిన ధైర్యసాహాసాల రీత్యా ఈ పర్యదినానికి ఆయనకి కూడా ప్రాముఖ్యత ఏర్పడింది. కావున శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ పంచమని నాగపంచిమిగానూ, గరుడ పంచమిగానూ వ్యవహరిస్తున్నాం. కేవలం శ్రావణంలో వచ్చే పంచమికి మాత్రం నాగేంద్రుడి తోపాటు గరుత్మంతునికి అత్యంత ప్రాముఖ్యతనిస్తున్నాం. ఎందుకింత మహిమాన్వితమైంది అంటే.. శ్రావణమాసంలో ఆచరించే ముఖ్యమైన పండుగలలో " గరుడ పంచమి" ఒకటి. గరుత్మంతుడు సూర్యరథసారధి అయిన అనూరుడికి తమ్ముడు. మేరు పర్వతంతో సమానమైన శరీరం కలవాడు. సప్త సముద్రాల్లోని జలాన్నంతటినీ ఒక్కరెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు. అందువలనే అతడికి సువర్ణుడు అనే పేరు కుడా ఉన్నది. గరుడపంచమికి సంబంధించి భవిష్యత్పురాణంలో ప్రస్తావన ఉంది. సముద్రమధనంలో " ఉచ్పైశ్రవం" అనే గుఱ్ఱం ఉద్భవించింది. అది శ్వేతవర్ణం కలది. కశ్యపుడు , వినతల కుమారుడు గరుడుడు. ఓ రోజు వినత ఆమే తోడుకోడలు కద్రువ విహార సమయంలో ఆ తెల్లటి గుఱ్ఱాన్ని చుసారు. కద్రువ , వినతతో గుఱ్ఱం తెల్లగా ఉన్న తోకమాత్రం నల్లగా ఉంది అని చెప్పగా , వినత గుఱ్ఱం మొత్తం తెల్లగానే ఉంది అని చెప్పింది. వాళ్ళిద్దరు ఓ పందెం వేసుకొన్నారు , గుఱ్ఱపు తోక నల్లగాఉంటే వినత కద్రువకు దాస్యం చేయలని , గుఱ్ఱం మొత్తం తెల్లగా ఉంటే వినతకు కద్రువ దాస్యం చేయలని పందెం. కద్రువ తన కపట బుద్దితో సంతానమైన నాగులను పిలిచి అశ్వవాలాన్ని పట్టి వ్రేలాడమని కోరగా . దానికి వారెవ్వరు అంగీకరించలేదు. కోపగించిన కద్రువ " జనమేజయుని సర్పయాగంలో నశించాలని" శపించింది. ఒక్క కర్కోటకుడు అనే కుమారుడు అశ్వవాలాని పట్టి వ్రేలాడి తల్లి పందాన్ని గెలిపించాడు. కొద్దికాలం తరువాత గర్బవతి అయిన వినత, తనకు పుట్టిన రెండు గుడ్లలో మొదటి దాన్ని పగులగొట్టి చూసింది. అప్పటికి ఇంకా పూర్తిగా ఆకారం ఏర్పడని అనూరుడు బైటకురాగానే " అమ్మా నీ తొందరుపాటువలన నేను అవయవాలు లేకుండానే జన్మించాను, కాని నీవు మాత్రం రెండవ గుడ్డును తొందరపడి పగులగొట్టవద్దు" అని చెప్పి , సూర్యభగవానుడి రధసారధిగా వెళ్ళిపోయాడు. కొద్దికాలం తరువాత జన్మించిన గరుత్మంతుడు తన తల్లి వినుత క్షేమం కోసం , తల్లి ఋణం తీర్చుకోవాలని , ఆమెకు దాస్యం నుంచి విముక్తి కలిగించడానికి అమృతాన్ని తెచ్చిస్తానని , పాముల తల్లి అయిన కద్రువకు మాట ఇస్తాడు. ఆ మాట కోసం అమృతాన్ని తేవాలని నిప్పులు వెదజల్లుతూ , ఆకాశంలో పిడుగుల శబ్దం దద్దరిల్లేలాగా బలమైన రెక్కలతో బయలుదేరాడు. ఈ సంగతి తెలిసిన ఇంద్రుడు భయపడి.. అమృతాన్ని కాపాడమని హెచ్చరికలు జారీ చేశాడు. దేవతా శ్రేష్టులంతా గరుత్మంతుడితో రాత్రింబవళ్లు యుద్ధం చేశారు. పెట్రేగిపోయిన గరుడుడు స్వర్గాన్ని చీకటిమయం చేసి , తన రెక్కలతో దుమారాన్ని సృష్టించాడు. వసువులు , రుద్రులు , అశ్వనీ దేవతలూ , కుబేరుడు , వాయువు , యముడు అందరినీ ఎదుర్కొని , ఓడించి అమృతాన్ని సమీపించాడు. అతడిని ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. గరుత్మంతుడు అమృతం తీసుకొనిపోతుండగా.. విష్ణువు అతడిని సమీపించి , ‘‘నీ విజయ సాధనకు మెచ్చాను. ఏమి కావాలో కోరుకో’’ అన్నాడు. ‘‘నిన్ను సేవించాలనేదే నా కోరిక స్వామి’’ అంటాడు గరుత్మంతుడు. తనకు వాహనంగా , జెండాగా ఉండాలంటూ విష్ణువు వరమిచ్చాడు. ఇంద్రుడు గరుత్మంతుడిని ఎదుర్కోలేక , అతడి పరాక్రమాన్ని కొనియాడాడు. ‘‘అమృతం లేకుండానే నీవు మరణించకుండా ఉండే వరం పొందావు. నీవు తీసుకెళ్తున్న అమృతాన్ని ఎవరికైనా ఇస్తావేమో..! అమృతం సేవిస్తే.. వారని జయించడం కష్టం. దాన్ని ఎవ్వరికీ ఇవ్వకుండా, తిరిగి ఇచ్చేస్తే నీవు ఏం కోరినా.. బహుమతిగా ఇస్తా’’ అని అన్నాడు. ‘‘నా తల్లిని రక్షించుకోవడానికే అమృతం కోసం వచ్చాను. నా మాట ప్రకారం కద్రువ సంతానమైన పాములకు ఈ అమృతం ఇచ్చి, నా తల్లిని కాపాడుకుంటాను. వారు అమృతాన్ని తాగకముందే, నువ్వు వెళ్లి దానిని దొంగిలించు. మనిద్దరి కోరికలు నెరవేరతాయి’’ అని అనగానే.. అతని సలహాకు మెచ్చి ఇంద్రుడు సరేనంటాడు. గరుత్మంతుడు అమృతంతో బయలుదేరి, పాములకు ఆ పాత్రనిచ్చి.. ‘‘చాలా శ్రమపడి తెచ్చాను. మీరు తృప్తిగా ఆరగించి , అమరులవ్వండి’’ అంటూ తల్లిని తన భుజస్కంధాలపై ఎక్కించుకుని వాయు, మనోవేగాలతో ఉడాయించాడు. నియమనిష్టల పేరుతో.. పాములను స్నానమాచరించాకే అమృతం తాగాలనే నిబంధన పెట్టి.. ఆ అమృత పాత్రను ఇంద్రుడు తీసుకెళ్లడం వేరే విషయం. తల్లి ఋణం తీర్చుకోవడానికి ఎంతో త్యాగం చేసిన గరుత్మంతుడిని ఎవరైనా ఆదర్శంగా తీసుకోవాలి.. అనుసరించాలి. నిర్మలమైన మనస్సు , తెలివైన పిల్లలకోసం చేసే పూజ గరుడ పంచమి. గరుడ పంచమి రోజున మహిళలు స్నానాంతరం ముగ్గులు పెట్టిన పీఠపై అరటి ఆకును పరచి , బియ్యంపోసి , వారి శక్తి మేర బంగారు , వెండి నాగపడిగను ప్రతిష్టించి , పూజచేసి , పాయసం నైవేద్యం పెడ్తారు. మరి కొన్ని ప్రాంతాలలో పుట్టలో పాలుపోస్తారు. ఇలా మనపూజలందుకొనే గరుడిని వంటి మాతృప్రేమకల కుమారుడు కావాలని తెలిపే గరుడ పంచమి వ్రతం అనంత సౌభాగ్యాలను కలుగచేస్తుంది. అలాగే కాలసర్ప దోషాలు ఉన్నా, సరైన సంతానం లేని దంపతులు ఈ నాగపంచిమి లేదా గరుడ పంచిమి రోజున ఆ ఇరువురిని కొలచినట్లయితే మంచి వివేకవంతులైన పిల్లలు పుడతారని ప్రతీతి. (చదవండి: శివ కేశవులిరువురికి ప్రీతికరమైన మాసం శ్రావణం! ఎందుకంటే..) -
హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రతి 20 నిమిషాలకో ఎలక్ట్రిక్ ఏసీ బస్సు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ‘ఈ–గరుడ’ పేరుతో నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ప్రతి 20 నిమిషాలకు ఒకటి చొప్పున ఈ బస్సులను నడపనున్నారు. మొదటి విడతగా 10 బస్సులను ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లోని మియాపూర్ క్రాస్‌రోడ్ సమీపంలోని పుష్పక్ బస్ పాయింట్ వద్ద మంగళవారం సాయంత్రం 5 గంటలకు జరిగే కార్యక్రమంలోరవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ జెండా ఊపి ఈ బస్సులను లాంఛనంగా ప్రారంభిస్తారు. టీఎస్‌ఆరీ్టసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మిగతా 40 బస్సులను ఈ ఏడాది చివరినాటికి దశలవారీగా ప్రవేశపెట్టనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ–గరుడ బస్సుల ప్రత్యేకతలివీ.. 👉కొత్తగా ప్రవేశపెడుతున్న ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు 12 మీటర్ల పొడవు ఉంటాయి. 41 సీట్లు ఉంటాయి. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు. 👉 ప్రతి సీటు వద్ద మొబైల్ చార్జింగ్ సౌకర్యంతోపాటు రీడిండ్ ల్యాంప్‌లను ఏర్పాటు చేశారు. 👉 ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెహికిల్ ట్రాకింగ్ సిస్టంతోపాటు ప్రతి సీటు వద్ద పానిక్ బటన్ ఉంటుంది. వాటిని టీఎస్‌ఆరీ్టసీ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేస్తారు. 👉 ప్రతి బస్సులో మూడు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటికి ఒక నెల రికార్డింగ్ బ్యాకప్ ఉంటుంది. 👉 బస్సులోని ప్రయాణికులను లెక్కించే ఆటోమేటిక్ ప్యాసింజర్ కౌంటర్ (ఏపీసీ) కెమెరా కూడా ఉంది. 👉 బస్సును రివర్స్ చేసేందుకు వీలుగా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా ఉంటుంది. 👉 బస్సుకు ముందు, వెనుక ఎల్ఈడీ బోర్డులు ఉంటాయి. వాటిలో గమ్యస్థానాల వివరాలను ప్రదర్శిస్తారు. 👉 అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు ఈ బస్సుల్లో ‘ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం (ఎఫ్డీఎస్ఎస్)’ను ఏర్పాటు చేశారు. 👉 ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా బస్సుల్లో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా ఉంది. త్వరలో డబుల్ డెక్కర్ బస్సులు గ్రేటర్ హైదరాబాద్‌లో పరుగులు తీసేందుకు త్వరలోనే 10 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఫ్లైఓవర్లు, మెట్రో మార్గాలు లేని రూట్లలో వీటిని నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక రానున్న రెండేళ్లలో ఆర్టీసీలో మొత్తంగా 1,860 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో 1,300 బస్సులను హైదరాబాద్‌లో నడుపుతారు. మరో 550 బస్సులను హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు తిప్పనున్నారు. చదవండి: 16 బోగీలతో సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్.. ఎప్పటి నుంచి అంటే? -
ఊపందుకున్న గరుడ వారధి నిర్మాణ పనులు
ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి ‘స్మార్ట్’ సిటీ వైపు శరవేగంగా దూసుకుపోతోంది. ఒక్కొక్కటిగా పూర్తవుతున్న అభివృద్ధి పనులతో చూడముచ్చటగా తయారవుతోంది. ‘గరుడ’ వేగంతో దూసుకుపోతున్న ‘వారధి’ నగరానికే తలమానికంగా నిలవనుంది. ఇప్పటికే 48 శాతం పూర్తయిన ఈ వారధిని మరో ఏడాదిలో ప్రారంభించేలా ముఖ్యమంత్రి చొరవ చూపడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సాక్షి, తిరుపతి తుడా: స్మార్ట్‌సిటీలో భాగంగా చేపట్టిన గరుడ వారధి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 2019లో ప్రారంభమైన ఈ పనులు రెండేళ్లలో పూర్తి చేయాలని అధికారయంత్రాంగం భావించింది. కరోనా కారణంగా ఏడాదిన్నరగా నిర్మాణ పనుల్లో కొంత జాప్యం చోటు చేసుకుంది. దీన్ని గుర్తించిన ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి టీటీడీ నిధుల విడుదలకు చొరవ తీసుకోవాలని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆయన సానుకూలంగా స్పందించడంతో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి నిర్మాణ పనులు పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రగతికి దారిది! గరుడ వారధి నిర్మాణ పనుల్లో పురోగతి కనిపిస్తోంది. ఇప్పటికే నిర్ణయించిన 171 పిల్లర్లు నిర్మించారు. కరకంబాడి రోడ్డు నుంచి నంది సర్కిల్‌కు వెళ్లే రెండో అంతస్తు నిర్మాణ పనులు దాదాపుగా పూర్తికాచ్చాయి. ప్రకాశం పార్కు నుంచి శ్రీనివాసం వరకు వారధిపై సెగ్మెంట్లను పూర్తిగా ఏర్పాటు చేశారు. పిల్లర్లకు ప్రయోగాత్మకంగా కలంకారీ చిత్రాలు, అన్నమయ్య పెయింటింగ్స్, దశావతారాల విగ్రహాలతో రంగులు అద్దుతున్నారు. ప్రకాశం పార్కు సమీపంలో డివైడర్ మధ్యలో మొక్కల పెంపకాన్ని ప్రారంభించారు. ఇదే ప్రాంతంలో విశాలమైన ఫుట్‌పాత్‌ను నిర్మిస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్, రామానుజ సర్కిల్ ప్రాంతాల్లో పిల్లర్ల ఏర్పాటు పూర్తిచేశారు. సెగ్మెంట్ల ఏర్పాటు శరవేగంగా చేపడుతున్నారు. ఫ్లై ఓవర్ కింద భాగం పూర్తిగా రంగులు వేసేలా చర్యలు చేపట్టారు. అలిపిరి నుంచి ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లే వాహనాలను శ్రీనివాసం వద్ద ఫ్రీలెఫ్ట్ చేస్తున్నారు. బస్టాండ్ నుంచి అలిపిరికి వెళ్లే వాహనాలను కొర్లగుంట సమీపంలో ఫ్లై ఓవర్లో కలిసేలా చర్యలు చేపట్టారు. -
Maha Samudram: భయంకర పాత్రలో ‘కేజీఎఫ్’ గరుడ
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం’. అదితి రావు హైదరి - అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన శర్వా - సిద్దార్ధ్ - అదితి - అనూ ఇమాన్యూయేల్ - జగపతిబాబు, రావు రమేశ్ ఫస్ట్ లుక్స్ కి మంచి స్పందన వచ్చింది.తాజాగా ఈ చిత్రంలో కీలయ పాత్ర చేస్తున్న కేజీఎఫ్ ఫేమ్ గరుడ రామ్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో ఆయన ధనుంజయ్ అను విలన్ పాత్రని చేస్తున్నాడు. ఒక రాక్షస రాజులా కనిపించనునున్నాడు. ఈ సినిమాలో ఆయన మెయిన్ విలన్ రోల్ చేస్తున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. యాక్షన్ డ్రామాగా రూపొందు తోన్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అజయ్ సుంకర కో- ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. చైతన్య భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. Introducing the Violent Man @GarudaRaam as #Dhanunjay 🔥 The 𝑩𝒂𝒅𝒂𝒔𝒔-𝑩𝒂𝒅𝒅𝒊𝒆 from #MahaSamudram 🌊@ImSharwanand @Actor_Siddharth @aditiraohydari @ItsAnuEmmanuel @DirAjayBhupathi @AnilSunkara1 @kishore_Atv @chaitanmusic @Cinemainmygenes @AKentsOfficial @SonyMusicSouth pic.twitter.com/FJpQGPdRxv — AK Entertainments (@AKentsOfficial) June 26, 2021 -
మణిహారంలా గరుడ వారధి
-
తిరుమల బ్రహ్మోత్సవాలు: గజవాహనంపై శ్రీవారు
-
సింగర్ టు యాక్టర్
‘సన్నాఫ్ సత్యమూర్తి’లో ‘చల్ చలో చలో..’, శ్రీమంతుడులో ‘జాగో జాగోరే జాగో’, జనతా గ్యారేజ్ ‘రాక్ ఆన్ బ్రో’ వంటి బ్లాక్‌బస్టర్ పాటలు సింగర్ రఘు దీక్షిత్ లిస్ట్‌లో ఉన్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సింగర్‌గా సూపర్ పాపులర్ ఆయన. తాజాగా మ్యూజిక్ కిట్ పక్కన పెట్టి మేకప్ కిట్ అందుకున్నారు. సింగర్ కాస్త యాక్టర్‌గా మారారని చెబుతున్నాం. ‘గరుడ’ అనే కన్నడ సినిమాలో రఘు దీక్షిత్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. -
హద్దులు దాటితే..!
పూర్వం మగధ రాజధాని రాజగృహ నగర సమీపంలో ఒక పెద్ద పర్వతం ఉండేది. దాని మీద గరుడ జాతి పక్షులు నివసిస్తూ ఉండేవి. ఆ పక్షుల పేరు మీద దానికి గృధ్రకూట పర్వతం అనే పేరు వచ్చింది. ఆ పర్వతం మీద అపనందుడు అనే గరుడుడు ఉండేవాడు. మంచి బలశాలి కావడం వల్ల ఆకాశంలో అవలీలగా ఎగిరి రాగలిగేవాడు. అతని పుత్రుడు మిగాలోపుడు. అతను కూడా తండ్రిని మించిన రెక్కబలం కలవాడు. కుర్రతనపు జోరు మీద కన్నూమిన్నూ కానేవాడు కాదు. ఆకాశంలో రకరకాల విన్యాసాలు చేస్తూ ఉండేవాడు. కంటికాననంత దూరం ఎగిరి వచ్చేవాడు. ఈ విషయం తండ్రికి తెలిసింది. బిడ్డను పిలిచి– ‘‘కుమారా! మిగాలోపా! నీ విహంగ విన్యాసాల గురించి విన్నాను. మంచిదే! కానీ, నాయనా! ఒక్కో జీవికి ఒక్కో హద్దు ఉంటుంది. అలాగే పక్షులకు కూడా! మన గరుడ పక్షులకూ ఒక హద్దు ఉంది. ఆకాశంలో మనం లేచిపోయి నేలను చూసినప్పుడు ఈ ప్రాంతం నాలుగు మూలలా కనిపించేంత వరకే మనం పోవాలి. ఆ హద్దు దాటి పోతే, మన ప్రాణాల మీదికి మనం తెచుకున్నట్లే. నింగి నుండి నేలరాలడం తప్పదు. ఇకనుండి వేగంలో, ఎత్తులో నీ హద్దుల్లో నీవుండు’’ అని చెప్పాడు. తండ్రి చెప్పాడే కానీ, తనయుడు దాన్ని చెవికెక్కించుకోనేలేదు. ఒక రోజున మిగిలిన పక్షులు వద్దని వారించినా వినకుండా సహజ వాతావరణ పరిధిని దాటి ఇంకా పైపైకి పోయాడు మిగాలోపుడు. అక్కడ మేఘాల్లో సుడిగాలి రేగింది. ఆ సుడిలో చిక్కుకున్న అతని దేహం ఛిద్రమైపోయింది. ప్రాణాలు కోల్పోయిన మిగాలోపుని శరీర భాగాలు గాలిలోనే ఎటో కొట్టుకుపోయాయి. అతని మరణం అతని పరివారాన్ని కుంగదీసింది. తండ్రి తల్లడిల్లాడు. అతని మీద ఆధారపడ్డ భార్యాబిడ్డలు భుక్తి కోల్పోయారు. గృధ్రకూట పర్వతం మీద ఛిద్రమైన పక్షి కుటుంబాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. పెద్దల మాట వినకపోవడం, తమ హద్దులు తాము తెలుసుకోలేకపోవడం, నిర్లక్ష్యం, లెక్కలేనితనం ఎంతటి విపత్తును కలిగిస్తాయో బుద్ధుడు చెప్పిన గొప్ప కథ ఇది. – డా. బొర్రా గోవర్ధన్ -
టైరు పంక్చర్.. గరుడ బస్సు బోల్తా
చివ్వెమ్ల: సూర్యాపేట జిల్లా చివ్వెమ్ల మండలం గుంపుల తిరుమలగిరి వద్ద గరుడ బస్సు ఓ టైర్ పంక్చర్ అయింది. దీంతో అకస్మాత్తుగా అదుపుతప్పిన బస్సు పల్టీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 50 మంది ఉన్నట్లు సమాచారం. గరుడ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడ్డ వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎన్టీఆర్ పరిషత్‌కు కర్నూలు నాటకం
కర్నూలు (కల్చరల్): కర్నూలు లలిత కళా సమితి రూపొందించిన ప్రమీలార్జన పరిణయం నాటకం ఎన్టీఆర్ కళా పరిషత్ ఒంగోలులో జరపనున్న రాష్ట్రస్థాయి నాటకోత్సవాలకు ఎంపికైంది. ఇటీవల తిరుపతిలో గరుడ నాటక పోటీలు నిర్వహించారు. అందులో ప్రమీలార్జన పరిణయం నాటకం ఉత్తమ నాటకంగా ఎంపికై పలవురి ప్రశంసలు పొందింది. ప్రతి యేటా ఒంగోలులో జరిగే ఎన్టీఆర్ కళా పరిషత్ నాటక పోటీలలో రెండు తెలుగు రాష్ట్ర్రాల నాటక సమాజాలు పాల్గొంటాయి. జనవరి 22న ఒంగోలులో జరిగే నాటకోత్సవాలలో ఈ నాటకాన్ని ప్రదర్శించనున్నామని లలిత కళా సమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య ఆదివారం ప్రకటనలో తెలిపారు. గాయని సాయి హారికకు సన్మానం: కర్నూలు మెడికల్ కళాశాలలో మెడిసిన్ చదువుతూ పాడుతా తీయగా అనే ఒక చానల్ సంగీత కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని సాయిహారికను లలిత కళా సమితి ఘనంగా సన్మానించింది. ఆదివారం సాయంత్రం టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన లవకుశ చిత్రప్రదర్శన సందర్భంగా ఈ సత్కారం చేశారు. సాయిహారికను లలిత కళా సమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, రంగ స్థల నటులు ఆదినారాయణ, శ్రీనివాసరావు, మహమ్మద్‌మియా, బాల వెంకటేశ్వర్లు తదితరులు అభినందించారు. -
కర్నూలు నాటకానికి బంగారు గరుడ అవార్డు
– సంగా ఆంజనేయులకు ఉత్తమ హాస్య నటుడు అవార్డు కర్నూలు (కల్చరల్): కర్నూలు లలిత కళా సమితి కళాకారులు తిరుపతి మహతి ఆడిటోరియంలో ప్రదర్శించిన ప్రమీలార్జున పరిణయం నాటకానికి బంగారు గరుడ అవార్డు లభించిందని లలిత కళా సమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం సాయంత్రం తిరుపతి మహతి ఆడిటోరియంలో ఎంపీ శివప్రసాద్ చేతుల మీదుగా నాటకంలోని శ్రీకృష్ణ పాత్రధారి శ్రీనివాసరెడ్డి ఈ అవార్డును అందుకున్నారన్నారు. ఈ నాటకాన్ని ప్రముఖ రచయిత పల్లేటి లక్ష్మి కుల శేఖర్ రచించగా, పత్తి ఓబులయ్య దర్శకత్వం వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం, వెంకటేశ్వర కళా పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో 13 నాటకాలు ప్రదర్శించగా కర్నూలుకు చెందిన ఈ నాటకానికి బంగారు గరుడ అవార్డు లభించండం హర్షణీయమని టీజీవీ కళాక్షేత్రం చైర్మెన్ టీజీ భరత్, లలిత కళా సమితి అధ్యక్షులు నాటక దర్శకులు పత్తి ఓబులయ్య, కార్యదర్శి మహమ్మద్ మియా, సహాయ కార్యదర్శి ఇనాయతుల్లా, రంగస్థల నటులు వన్నెం బలరామ్ తెలిపారు. నాటకంలో హాస్యపాత్ర పోషించిన సంగా ఆంజనేయులకు ఉత్తమ హాస్య నటుడు అవార్డు లభించింది. ఈ నాటకానికి రూ.70 వేల నగదు పారితోషికం వెంకటేశ్వర కళా పరిషత్ అందించింది. -
తేజస్వి ప్రఖ్యకు 'గరుడ' అవార్డు
21న తిరుపతిలో ప్రదానం తెనాలి: గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ యువనర్తకి ఆరాధ్యుల తేజస్వి ప్రఖ్య మరో ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికైంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర నాట్యకళాపరిషత్ రాష్ట్రంలోని వివిధ రంగాల్లో ప్రతిభావంతులకు ప్రదానం చేసే గరుడ అవార్డుకు ప్రఖ్యను ఎంపిక చేశారు. ఈనెల 21వ తేదీన తిరుపతి మహతి ఆడిటోరియంలో జరిగే గరుడ నాటకోత్సవాల్లో ఈ అవార్డును అందజేయనున్నట్టు కళాపరిషత్ ప్రతినిధి నారాయణ తెలియజేశారు. ఏడేళ్లుగా బాలల నాటికల విభాగంలో మన్ననలు పొందుతున్న తేజస్వి ప్రఖ్యను గరుడతో సత్కరించనున్నట్టు వివరించారు. ఇటీవలే మచిలీపట్నంలోని సాంస్కృతిక సంస్థ స్వర్ణోత్సవాల్లో ఈ యువనర్తకి అవార్డును అందుకున్నారు. ఏడేళ్ల వయసులోనే 16 గంటల నిరంతర కూచిపూడి నృత్యప్రదర్శన చేసిన ప్రఖ్య 570 ప్రదర్శనలు పూర్తి చేసింది. ఈమె స్థానిక జేఎంజే మహిళా కాలేజిలో బీఏ స్పెషల్ ఇంగ్లీష్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ప్రఖ్య చిల్డ్రన్ ఆర్ట్స్ బ్యానర్‌పై రానున్న నంది నాటికోత్సవాల్లో ప్రదర్శన ఇచ్చేందుకు 'పరమపదం' బాలికల నాటికను ఈమె సిద్ధం చేస్తోంది. పట్టణ కళాకారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు షేక్ జానిభాషా, ఎం.సత్యనారాయణశెట్టి, జేఎంజే కాలేజి ప్రిన్సిపాల్ సిస్టర్ మేరీ, నృత్యగురువు డాక్టర్ వేదాంతం దుర్గాభవాని ప్రఖ్య అవార్డుకు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. -
గరుడసేవ వీక్షణకు పోటెత్తిన భక్తులు
-
'గరుడ' నుంచి తప్పుకున్న కాజల్
అసలే సక్సెస్‌లు లేక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో చందమామ కాజల్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారీ బడ్జెట్‌తో విక్రమ్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న తమిళ మూవీ గరుడ నుంచి తప్పకుంది ఈ ముద్దుగుమ్మ. డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవటంతో విక్రమ్ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందని బాధ పడుతోంది. గరుడ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలు కావాల్సి ఉన్నా.. విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న ఇరుముగన్ ఆలస్య కావటంతో గరుడ షూటింగ్ ఆలస్యంగా మొదలైంది. దీంతో అదే సమయంలో అజిత్ సినిమాకు డేట్స్ ఇచ్చేయటంతో తప్పనిసరి పరిస్థితుల్లో విక్రమ్ సినిమా నుంచి కాజల్ తప్పకుంది. ప్రస్తుతం అజిత్ సినిమాతో పాటు తెలుగులో ఒక్క సినిమా మాత్రమే చేస్తున్న కాజల్, ఓ భారీ చిత్రం నుంచి తప్పకోవటం ఆమె కెరీర్ చాలా పెద్ద లాస్ అన్న టాక్ వినిపిస్తోంది. -
కాజల్ కూడా చెప్పేస్తోంది
సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా వెలిగిపోతున్న ఉత్తరాది భామలు ఇప్పుడు సొంత గొంతు వినిపించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది తారలు డబ్బింగ్ చెప్పుకోవటం ప్రారంభించగా తాజాగా కాజల్ అగర్వాల్ కూడా ఆ లిస్ట్‌లో చేరడానికి రెడీ అవుతోంది. రకుల్ ప్రీత్ సింగ్, అంజలి లాంటి హీరోయిన్లు కూడా సొంత గొంతుతో అలరిస్తుంటే తాను వెనకపడి పోతాననుకుందేమో.. ఓ తమిళ సినిమాకు డబ్బింగ్ చెప్పేందుకు రెడీ అయ్యింది. సర్దార్ గబ్బర్‌సింగ్, బ్రహ్మోత్సవం సినిమాల రిజల్ట్‌తో కష్టాల్లో పడ్డ కాజల్ ప్రస్తుతం విక్రమ్ సరసన నటిస్తున్న గరుడ సినిమా మీదే ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా సక్సెస్ కోసం అన్ని రకాలుగా కష్టపడుతున్న ఈ బ్యూటీ తొలిసారిగా డబ్బింగ్ చెప్పకునేందుకు రెడీ అయ్యింది. తనకు పెద్దగా పట్టులేని తమిళ రంగంలోనే డబ్బింగ్ చెపుతుందంటే.. నెక్ట్స్ తను చేయబోయే తెలుగు సినిమాకు కూడా కాజల్ సొంతం గొంతు అందించే చాన్స్ ఉందంటున్నారు సినీ జనాలు. -
వాళ్లిద్దరి క్రేజీ కాంబినేషన్ ఇప్పట్లో లేనట్టేనా?
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్, ఎస్.ఎస్. రాజమౌళి క్రేజీ కాంబినేషన్లో మరో సినిమా రాబోతోందనే వార్తలు ఆ మధ్య టాలీవుడ్లో హల్ చల్ చేశాయి. దర్శక ధీరుడు జక్కన్న ఎన్టీఆర్ తో గరుడ అనే మూవీకీ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఈ మధ్యకాలంలో అవకాశం వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తుతుండడంతో ఈ వార్తలకు ఇంకాస్త బలం చేకూరింది. అయితే ఇపుడు దీనికి భిన్నంగా..రాజమౌళి తర్వాత మూవీ గరుడ అనేది పక్కా అయిన్పటికీ హీరో మాత్రం ఎన్టీఆర్ కాదని టాలీవుడ్ టాక్. వెయ్యి కోట్ల భారీ ప్రాజెక్ట్ లో నటించే అవకాశాన్ని బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఎగరేసుకుపోయాడనే వార్తలు గుప్పుమన్నాయి. ఇది ఎన్టీర్ ఫ్యాన్స్ కు నిరాశ కలిగించే వార్త అయినా ఇదే నిజమని ఇండస్ట్రీ విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రయోగాలకు మారుపేరుగా మారిన టాలీవుడ్ దర్శక దిగ్గజం తన భారీ ప్రాజెక్టుకు హృతిక్ రోషన్ ను ఖాయం చేసినట్టు తెలుస్తోంది. తద్వారా మరోసారి అంతర్జాతీయ ఖ్యాతిని దక్కించుకోవాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. అందుకే హృతిక్ ని ప్రిఫర్ చేశాట్ట. అయితే తారక్ తో మరో డిఫరెంట్ స్టోరీతో కచ్చితంగా సినిమా చేసేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట. స్టూడెంట్ నెం1, సింహాద్రి, యమదొంగ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మరోసారి ఎన్టీఆర్ నటిస్తున్నాడని ,డేట్స్ కూడా ఇచ్చారని అప్పట్లో ఫిలిం నగర్ గుసగుసలాడిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం తారక్ కూడా మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై, కొరటాల శివ డైరక్షన్లో వస్తున్న జనతా గ్యారేజ్ మూవీషూటింగ్ లో, రాజమౌళి బాహుబలి 2లో షూటింగ్ లో బిజీ బిజీగా వున్నారు. ఇది ఇలా ఉంటే గతంలో రాజమౌళి, ఎన్టీఆర్‌తో ఓ భారీ 3డీ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. ఎన్టీఆర్తోనే కాదు అసలు 3డీ చిత్రమే చేయడంలేదని రాజమౌళి తన ట్విట్టర్ లో స్పందించారు కూడా. మరి ఈ వార్తలపై జక్కన్న ఎలా స్పందిస్తాడో చూడాలి. -
రాజమౌళి టైటిల్ వాడేస్తున్నాడు
బాహుబలి సినిమాతో ఒక్కసారిగా అంతర్జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించిన రాజమౌళి, ప్రస్తుతం బాహుబలి సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో ఉన్నాడు. భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో మరోసారి సంచలనం సృష్టించటం ఖాయమని నమ్ముతున్నారు సినీజనాలు. దీంతో ఇంతటి భారీ విజయం తరువాత రాజమౌళి చేయబోయే నెక్ట్స్ సినిమా ఏంటి అన్న చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. ముఖ్యంగా గరుడ పేరుతో ఓ పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించాలని భావిస్తున్నాడన్న వార్త బలంగా వినిపించింది. అంతేకాదు మహేష్ బాబు, మోహన్ లాల్, ఎన్టీఆర్ లాంటి స్టార్లు ఈ సినిమాలో నటిస్తున్నారంటూ కూడా రూమర్స్ వినిపించాయి. ఈ వార్తలు ఖండించిన రాజమౌళి గరుడ పేరుతో భారీ చిత్రం చేసే ఆలోచనైతే ఉందంటూ చెప్పాడు. అయితే ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో రాజమౌళి గరుడకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. ఇప్పుడు మరోసారి గరుడ సినిమా వార్తల్లోకి వచ్చింది. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీగా తెరకెక్కిద్దామనుకున్న గరుడ పేరుతో తమిళ హీరో విక్రమ్ సినిమా చేయబోతున్నాడట. తిరు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా త్వరలోనే వస్తుందంటున్నారు చిత్రవర్గాలు. మరి తన సినిమాకు అనుకుంటున్న టైటిల్, విక్రమ్ వాడేయటం పై జక్కన్న ఎలా స్పందిస్తాడో చూడాలి. -
ఫైనల్లో ముంబై గరుడ
► సెమీస్‌లో బెంగళూరుపై విజయం ప్రొ రెజ్లింగ్ లీగ్ న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యుఎల్)లో ముంబై గరుడ అప్రతిహతంగా దూసుకెళుతోంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో బెంగళూరు యోధాస్‌ను 5-2తో ఓడించిన ముంబై ఫైనల్లోకి ప్రవేశించింది. ఇప్పటిదాకా ముంబై ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఒక్క ఓటమి కూడా లేకపోవడం విశేషం. పురుషుల 97కేజీ విభాగంలో జరిగిన తొలి బౌట్లో ఒడికడ్జ్ ఎలిజబెర్ 7-2తో పావ్లో ఒలియనిక్ను ఓడించి ముంబైకి తొలి విజయాన్ని అందించాడు. ఆ తర్వాత మహిళల 48కేజీలో రితూ ఫోగట్ అనూహ్యంగా పోరాడింది. 2013 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన అలీసా లాంప్ (బెంగళూరు)పై తొలి రౌండ్లో 0-4తో వెనుకబడింది. ఈ దశలో కోచ్ వ్యూహం ప్రకారం ముందుకెళ్లిన రితూ ప్రత్యర్థిని అలసిపోయేలా చేసింది. ఆ తర్వాత పుంజుకుని 8-4తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. బౌట్ పూర్తయ్యేసరికి 10-4 తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. పురుషుల 125కేజీలో గియోర్గి సకన్డెలిడ్జ్ 7-4తో డావిట్ను ఓడించి గరుడ ఆధిక్యాన్ని 3-0కు పెంచాడు. మహిళల 53కేజీలో ఒడునాయో అడెకురోయ్ 10-0తో లలితా షెరావత్‌ను చిత్తుగా ఓడించడంతో ముంబై ఫైనల్‌కు చేరడం ఖాయమైంది. చివరి మూడు బౌట్లలో బెంగళూరు ఐకాన్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ (74కేజీ) 7-0తో ప్రదీప్‌పై ఓదార్పు విజయాన్ని సాధించాడు. ముంబై ఐకాన్ రెజ్లర్ అడెలిన్ గ్రే కేవలం 45 సెకన్లలోనే 6-0తో నవజ్యోత్ కౌర్‌ను చిత్తు చేయగా చివరి బౌట్లో బజరంగ్ పూనియా 10-4తో అమిత్ ధన్కర్ను ఓడించి బెంగళూరుకు రెండో విజయాన్ని అందించింది. నేడు జరిగే రెండో సెమీస్‌లో పంజాబ్, హరియాణా తలపడతాయి. ఈ మ్యాచ్ విజేత ఫైనల్లో ముంబై గరుడతో ఆడుతుంది. -
ఏపీ బస్సులు కిటకిట తెలంగాణ బస్సులు కటకట
♦ ఆంధ్రప్రదేశ్ నుంచి ‘ఖాళీ’గా టీఎస్ఆర్టీసీ బస్సులు ♦ అదే సమయంలో ఏపీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ♦ తెలంగాణ బస్సుల టికెట్లు అమ్మకుండా వదిలేస్తున్న అక్కడి సిబ్బంది ♦ కిలోమీటరుకు సగటున రూ.38 చొప్పున నష్టం సాక్షి, హైదరాబాద్: అమలాపురం నుంచి హైదరాబాద్ లోని మియాపూర్‌కు తెలంగాణ ఆర్టీసీ గరుడ ప్లస్ బస్సు వచ్చి ఆగింది. అందులోంచి దిగిన ప్రయాణికులు పది మందే. అదే.. అమలాపురం నుంచి హైదరాబాద్‌కు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ గరుడ ప్లస్ బస్సు కిటకిట లాడుతూ వచ్చింది. ఒకే రోజు ఒకే సమయంలో కనిపిం చినదృశ్యమిది. ఇది అమలాపురం బస్సు కథ ఒక్కటే కాదు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన ప్రాంతాలు-హైదరాబాద్ మధ్య నడుస్తున్న తెలంగాణ ఆర్టీసీ గరుడ, గరుడ ప్లస్ బస్సులన్నింటి కథ ఇదే. ఇప్పుడు తెలంగాణ బస్సులు తీవ్ర నష్టాల్లో చిక్కుకున్నాయి. వాటిని నడిపే బదులు రద్దు చేసుకోవటం మంచిదని అధికారులు భావిస్తున్నారు. ఏపీఎస్ ఆర్టీసీతో పోలిస్తే... తెలంగాణ ఆర్టీసీ ఛార్జీలు తక్కువ. అయినప్పటికీ తెలంగాణ బస్సులు కిటకిటలాడాల్సింది పోయి గరుడ బస్సులు ఖాళీగా వస్తూ తీవ్ర నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. ఏపీ డిపోల్లో తెలంగాణ సిబ్బంది లేకనే.. ఆంధ్రప్రదేశ్ పరిధిలోని ప్రధాన డిపోల్లో రిజర్వేషన్ టికెట్లు, సాధారణ టికెట్లు విక్రయించేందుకు తెలంగాణ సిబ్బంది లేకపోవటంతో ఏపీ సిబ్బంది తెలంగాణ బస్సుల టికెట్లు అమ్మకుండా మొరాయిస్తున్నారు. అసలు ఆ సర్వీసులు ఉన్నట్టు ప్రయాణికులకు సమాచారం కూడా ఉండటం లేదు. దీంతో తెలంగాణ గరుడ బస్సులకు రిజర్వేషన్ ఇబ్బందిగా మారింది. ఫలితంగా సగం సీట్లు కూడా నిండకుండానే బస్సులు ప్రయాణించాల్సి వస్తోంది. విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు, తిరుపతి, అమలాపురం...తదితర ఏపీలోని ప్రధాన ప్రాంతాల్లో తెలంగాణ బస్సులను అక్కడి సిబ్బంది ప్లాట్‌ఫామ్‌ల వద్దకు రానివ్వడం లేదు. దూరంగా నిలపాల్సి వస్తుండటంతో వాటి ఆక్యుపెన్సీ రేషియో బాగా పడిపోయింది. తాజా గణాంకాల ప్రకారం గరుడ కేటగిరీ బస్సుల్లో సగటున కిలోమీటరుకు రూ.38 నష్టం వస్తున్నట్టు అధికారులు తేల్చారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రాంతాలకు వెళ్లే తెలంగాణ ఆర్టీసీ గరుడ బస్సుల సగటు ఆక్యుపెన్సీ రేషియో 80 శాతం ఉండగా, తిరుగుప్రయాణంలో హైదరాబాద్‌కు వచ్చే బస్సుల్లో అది 49-54 శాతం మధ్య ఉన్నట్టు తేలింది. రూ.1.10 కోట్ల ఖరీదు చేసే ఈ కేటగిరీ బస్సుల నిర్వహణ కూడా భారంతో కూడుకున్నదే. వాటి మనుగడ ఉండాలంటే ఆక్యుపెన్సీ రేషియో 75 శాతానికి మించి ఉండాలి. తాజాగా కొందరు డిపో మేనేజర్లు ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తెచ్చారు. ఏపీ అధికారులతో చర్చించి వెంటనే తెలంగాణ సిబ్బందిని అక్కడి డిపోల్లో ఏర్పాటు చేయకుండా.. ఆ సర్వీసులను రద్దు చేయటమే మంచిదని వారు పేర్కొనటం విశేషం. ప్రైవేటు ఆపరేటర్లతోఒప్పందం.. సాంకేతికంగా ఆర్టీసీ ఉమ్మడిగా ఉన్నప్పటికీ పాలనాపరంగా విడిపోయింది. ఏ రాష్ట్రం పరిధిలో ఆ రాష్ట్ర ఆర్టీసీ బస్సులను నిర్వహిస్తోంది. టికెట్ల కేటాయింపు, సీట్ల రిజర్వేషన్ వంటి పనులను కూడా ఇదే పద్ధతిలో నిర్వహించాలి. హైదరాబాద్‌లోని ప్రధాన డిపోల్లో ఏపీఎస్ ఆర్టీసీ సిబ్బంది ఆ రాష్ట్ర ఆర్టీసీ బస్సుల టికెట్లు విక్రయిస్తున్నారు. దీంతోపాటు హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆపరేటర్లతో ఏపీఎస్ ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుని వారితో కూడా టికెట్లు విక్రయింపచేస్తోంది. వెరసి హైదరాబాద్ నుంచి ఏపీ పరిధిలోని ప్రాంతాలకు వెళ్లే గరుడ బస్సులు నిండుగా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ పరిధిలోని ప్రధాన డిపోల్లో తెలంగాణ సిబ్బంది లేరు. ఇదే ఇప్పుడు సమస్యలకు కారణమైంది. -
టీజర్‌కే రూ.25 కోట్లా..?
బాహుబలి సినిమాలో నటించిన నటీనటులకన్నా దర్శకుడు రాజమౌళికే ఎక్కువ క్రేజ్ తీసుకు వచ్చింది. ఆ సినిమాతో అంతర్జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించిన జక్కన్న, తన తదుపరి చిత్రం విషయంలో ఇంకా సస్పెన్స్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం బాహుబలి 2 కోసం భారీ కసరత్తు చేస్తున్న దర్శకధీరుడు తరువాత చేయబోయే సినిమాపై జాతీయ స్ధాయిలో భారీ చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బాహుబలి సీరీస్‌లోనే మరో సినిమా తీస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే తొలుత ఈ వార్తలను కొట్టి పారేసిన రాజమౌళి, తరువాత ఈ సిరీస్‌లో సినిమా ఉండదుగాని ఏదో ఒక రూపంలో బాహుబలి కొనసాగుతుందంటూ మెలిక పెట్టాడు. దీంతో కొత్త కథతో కొత్త తారాగణంతో బాహుబలి 3 తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నాడన్న వార్తలు ఊపందుకున్నాయి. 'గరుడ' పేరుతో ఓ పౌరాణిక గాథను రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించే ఆలోచనలో జక్కన్న ఉన్నట్టుగా ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చాలా రోజులుగా ఈ టాక్ వినిపిస్తున్నా రాజమౌళి మాత్రం ఇంత వరకు స్పందించలేదు. అయితే తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్లో హల్చల్ చేస్తుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న గరుడ సినిమాకు నిర్మాతలను ఆకర్షించడం కోసం రాజమౌళి కొత్త ప్లాన్ చేస్తున్నాడట. రూ. 25 కోట్ల బడ్జెట్‌తో 25 సెకన్ల టీజర్‌ను రూపొందించే ఆలోచనలో ఉన్నాడట. అంతర్జాతీయ స్ధాయి గ్రాఫిక్స్‌తో రూపొందనున్న ఈ టీజర్ గరుడ సినిమా ఎలా ఉండబోతుందో చూపిస్తుందన్న టాక్ వినిపిస్తొంది. ఇప్పటికైనా రాజమౌళి ఈ వార్తలపై స్పందిస్తాడేమో చూడాలి. -
వెయ్యి కోట్లతో రాజమౌళి మహాభారతం?
చెన్నై : దర్శకుడు రాజమౌళిని ఇప్పుడు ఒక భాషకు చెందిన దర్శకుడిగా భావించలేం.అందుకు కారణం బాహుబలి చిత్రం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచ సినిమాను తనవైపు తిరిగి చూసేలా చేసిన చిత్రం బాహుబలి. ఆ గ్రాండీయర్‌ను, ఆ గ్రాఫిక్స్‌ను భారతీయ సినిమా ఇంతకు ముందెప్పుడూ చూడలేదని చెప్పడం అతిశయోక్తి కాదేమో. ఆ చిత్ర సృష్టికర్త బాహుబలి-2ను అంతకు మించిన బ్రహ్మాండంగా సెల్యులాయిడ్ పెకైక్కించే పనిలో నిమగ్నమయ్యారు.ఈ చిత్రం తరువాత మహేశ్‌బాబు, అల్లుఅర్జున్‌లతో చిత్రాలు చేయనున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఆ రెండు చిత్రాల తరువాత రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతాన్ని చిత్రంగా వెయ్యి కోట్ల భారీ బడ్జెట్‌తో తెరపై ఆవిష్కరంచడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తన ట్విట్టర్లో పేర్కొనట్లు ప్రచారం జరుగుతోంది. దానికి గరుడా అని పేరును కూడా నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా నటించే అవకాశం ఉన్నట్లు, మరో ముఖ్య పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించే అవకాశం ఉన్నట్లు పరిశ్రమ వర్గాల్లో టాక్ ఆఫ్ ది టాక్‌గా మారింది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదన్నది గమనార్హం. -
రాబడి చక్రాలపై రయ్ రయ్
ఏపీఎస్ఆర్టీసీకి వరంగా మారిన ఎంట్రీ ట్యాక్స్ 30 శాతాన్ని దాటిన ఆక్యుపెన్సీ ప్రైవేటు బస్సుల జోరుకు కళ్లెం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం విధించిన ఎంట్రీ ట్యాక్స్ (ప్రవేశ పన్ను)... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్సార్టీసీ)కి వరంగా మారింది. మూడు రోజులుగా రాబడి పెరిగింది. ఎంట్రీ ట్యాక్సుతో స్టేజి క్యారియర్లుగా తిరుగుతున్న ప్రైవేటు బస్సుల జోరు కూడా తగ్గింది. దీంతో అత్యధికశాతం మంది ప్రయాణికులు ఆర్టీసీని ఆశ్రయిస్తున్నారు. ఈ కారణంగా ఆక్యుపెన్సీ రేటు 30 శాతాన్ని మించుతోంది. ఇదిలాగే కొనసాగితే ఏపీ నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ నడిపే సూపర్ డీలక్స్, హైటెక్, ఇంద్ర, గరుడ, గరుడ ప్లస్, వెన్నెల బస్సుల వల్ల ఆర్టీసీ ఆదాయం రూ.కోటి దాటుతుందని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అదనపు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం ప్రతిరోజూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఆర్టీసీ... హైదరాబాద్ నగరానికి సుమారు 800 బస్సులను నడుపుతోంది. మరోవైపు అన్ని ప్రాంతాల నుంచి దాదాపు వెయ్యి బస్సులను ప్రైవేటు ఆపరేటర్లు నడుపుతున్నారు. గతంలో ప్రైవేటు బస్సులు పెద్దసంఖ్యలో ప్రమాదాలకు గురైనపుడు...ముఖ్యంగా షిర్టీ సమీపంలో ప్రమాదం జరిగిన సందర్భంలో నిబంధనలకు విరుద్ధంగా స్టేజి క్యారియర్లుగా తిప్పుతున్న ప్రైవేటు బస్సుల్ని రవాణా శాఖ అధికారులు కట్టడి చేశారు. దీంతో అప్పట్లో ఆర్టీసీకి ఆదాయం గణనీయంగా పెరిగింది. మళ్లీ ప్రైవేటు బస్సులపై ఎంట్రీ ట్యాక్స్ ప్రభావం కారణంగా ఆ పరిస్థితి పునరావృతమైంది. నిబంధనలు గాలికి: ప్రైవేటు ఆపరేటర్లు నిబంధనలను పట్టించుకోవడం లేదు. కాంట్రాక్టు క్యారియర్లుగా తిరగాల్సిన ప్రైవేటు బస్సులను ఆన్లైన్ రిజర్వేషన్ చేసుకుంటూ స్టేజి క్యారియర్లుగా నడుపుతున్నారు. ప్రైవేటు ఆపరేటర్లలో ఎక్కువమంది టీడీపీ నేతలే ఉండడంతో రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ వ్యవహారాన్ని కాగ్ తప్పు పట్టినా ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రైవేటు బస్సుల విషయమై రవాణా శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారిపైనా ఫిర్యాదులొచ్చిన సంగతి తెలిసిందే. నిబంధనల మేరకు ప్రైవేటు బస్సులను నడుపుకునే అనుమతి ఇవ్వాలని, అప్పుడే ఆర్టీసీకి మనుగడ ఉంటుందని యూనియన్ నేతలు కోరుతున్నారు. -
గరుడ బస్సు బోల్తా,పలువురికి గాయాలు
-
తప్పిన పెను ప్రమాదం
చింతపల్లి, న్యూస్‌లైన్ : నాగార్జునసాగర్-హైదరాబాద్ హైవేపై గరుడ బస్సు లో అగ్ని ప్రమాదం జరిగింది. డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన చింతపల్లి మండలం నసర్లపల్లి గేటు సమీపంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో 50 మంది ప్రయాణికులను ఎక్కించుకున్న గరుడ బస్సు రాత్రి 12:30 గంటలకు నెల్లూరుకు బయలుదేరింది. నసర్లపల్లి సమీపంలోకి రాగానే గరుడ బస్సు ఇంజన్ డిక్కీలో నుంచి పొగ వచ్చింది. గమనించిన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కకు ఆపాడు. అప్పటికే ఇంజన్ డిక్కీలో నుంచి మంటలు రేగుతున్నాయి. అయితే మాల్ సమీపంలోకి రాగానే బస్సులో నుంచి ఒక రకమైన వాసన వస్తుండడంతో ప్రయాణికులు కూడా ఈ విషయాన్ని డ్రైవర్‌కు చెప్పారు. దీంతో ముందుగానే ఇంజన్ డిక్కీ తెరిచి చూడడంతో ప్రమాదం తప్పింది. డిక్కీలో మంటలు రేగుతున్న విషయాన్ని ప్రయాణికులకు చెప్పడం తో వారు బస్సు నుంచి కిందకు దిగి ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణికులు తమ వద్ద ఉన్న వాటర్ బాటిళ్లతో మం టలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. వెంటనే ఫైరిం జన్‌కు, పోలీసులకు సమాచారం అంది ంచారు. దేవరకొండ అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే డిక్కీలో ఉన్న సామగ్రి కొంతమేర కాలిపోయింది. అయితే మరికొద్దిసేపు విషయాన్ని గమనించకుండా అలాగే బస్సు నడిపితే భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేది. రెండు గంటల అనంతరం మరో బస్సులో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశారు. షార్ట్‌సర్క్యూట్‌తోనే మంటలు బస్సు డిక్కీలో పరిమితికి మించి ప్రయాణికుల లగేజీని ఉంచడమే ప్రధా న కారణమని తెలుస్తోంది. లగేజీని అందులోకి నెట్టి ఉంచడంతో వైర్లు షార్ట్‌సర్క్యూట్ కావడంతోనే ప్రమాదం జరిగిందని డ్రైవర్, ప్రయాణికులు పేర్కొన్నారు.