ఎన్‌టీఆర్ పరిషత్‌కు కర్నూలు నాటకం
ఎన్‌టీఆర్ పరిషత్‌కు కర్నూలు నాటకం
Published Sun, Jan 1 2017 10:14 PM | Last Updated on Tue, Sep 5 2017 12:08 AM
కర్నూలు (కల్చరల్): కర్నూలు లలిత కళా సమితి రూపొందించిన ప్రమీలార్జన పరిణయం నాటకం ఎన్‌టీఆర్ కళా పరిషత్ ఒంగోలులో జరపనున్న రాష్ట్రస్థాయి నాటకోత్సవాలకు ఎంపికైంది. ఇటీవల తిరుపతిలో గరుడ నాటక పోటీలు నిర్వహించారు. అందులో ప్రమీలార్జన పరిణయం నాటకం ఉత్తమ నాటకంగా ఎంపికై పలవురి ప్రశంసలు పొందింది. ప్రతి యేటా ఒంగోలులో జరిగే ఎన్‌టీఆర్ కళా పరిషత్ నాటక పోటీలలో రెండు తెలుగు రాష్ట్ర్రాల నాటక సమాజాలు పాల్గొంటాయి. జనవరి 22న ఒంగోలులో జరిగే నాటకోత్సవాలలో ఈ నాటకాన్ని ప్రదర్శించనున్నామని లలిత కళా సమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య ఆదివారం ప్రకటనలో తెలిపారు.
గాయని సాయి హారికకు సన్మానం:
కర్నూలు మెడికల్ కళాశాలలో మెడిసిన్ చదువుతూ పాడుతా తీయగా అనే ఒక చానల్ సంగీత కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని సాయిహారికను లలిత కళా సమితి ఘనంగా సన్మానించింది. ఆదివారం సాయంత్రం టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన లవకుశ చిత్రప్రదర్శన సందర్భంగా ఈ సత్కారం చేశారు. సాయిహారికను లలిత కళా సమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, రంగ స్థల నటులు ఆదినారాయణ, శ్రీనివాసరావు, మహమ్మద్‌మియా, బాల వెంకటేశ్వర్లు తదితరులు అభినందించారు.
Advertisement