కాజల్ కూడా చెప్పేస్తోంది | Kajal wants to dub in her own voice | Sakshi
Sakshi News home page

కాజల్ కూడా చెప్పేస్తోంది

Published Tue, Jun 14 2016 1:54 PM | Last Updated on Mon, Sep 4 2017 2:28 AM

కాజల్ కూడా చెప్పేస్తోంది

కాజల్ కూడా చెప్పేస్తోంది

సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా వెలిగిపోతున్న ఉత్తరాది భామలు ఇప్పుడు సొంత గొంతు వినిపించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది తారలు డబ్బింగ్ చెప్పుకోవటం ప్రారంభించగా తాజాగా కాజల్ అగర్వాల్ కూడా ఆ లిస్ట్లో చేరడానికి రెడీ అవుతోంది. రకుల్ ప్రీత్ సింగ్, అంజలి లాంటి హీరోయిన్లు కూడా సొంత గొంతుతో అలరిస్తుంటే తాను వెనకపడి పోతాననుకుందేమో.. ఓ తమిళ సినిమాకు డబ్బింగ్ చెప్పేందుకు రెడీ అయ్యింది.

సర్దార్ గబ్బర్సింగ్, బ్రహ్మోత్సవం సినిమాల రిజల్ట్తో కష్టాల్లో పడ్డ కాజల్ ప్రస్తుతం విక్రమ్ సరసన నటిస్తున్న గరుడ సినిమా మీదే ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా సక్సెస్ కోసం అన్ని రకాలుగా కష్టపడుతున్న ఈ బ్యూటీ తొలిసారిగా డబ్బింగ్ చెప్పకునేందుకు రెడీ అయ్యింది. తనకు పెద్దగా పట్టులేని తమిళ రంగంలోనే డబ్బింగ్ చెపుతుందంటే.. నెక్ట్స్ తను చేయబోయే తెలుగు సినిమాకు కూడా కాజల్ సొంతం గొంతు అందించే చాన్స్ ఉందంటున్నారు సినీ జనాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement