Sardaar gabbarsingh
-
సంపూ బాబు, రజనీ మీదే కౌంటరేశాడు..!
యూట్యూబ్ సెన్సేషన్తో వెండితెర మీద అడుగుపెట్టిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, ఎప్పటికప్పుడు తన ఫాలోయింగ్‌ను కాపాడుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. సోలో హీరోగా సినిమాలు చేస్తూనే కామెడీయన్‌గా కూడా దూసుకుపోతున్న సంపూ, తన ట్విట్టర్ పేజ్‌లో స్టార్ హీరోలను ఉద్దేశించి పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సినిమా మొదట్లో వచ్చే ఈ నగరానికేమయ్యింది యాడ్ స్టైల్లో ఈ ఏడాది స్టార్ హీరోల సినిమాలు ఫ్లాప్ అవ్వడంపై కౌంటరేశాడు సంపూ. సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేసిన కామెంట్‌ను షేర్ చేశాడు సంపూ. 'ఈ 2016కి ఏమైంది? ఓ పక్క సర్థార్ గబ్బర్‌సింగ్, మరో పక్క బ్రహ్మోత్సవం. కబాలి కూడా నోరుమెదపలేదు, ఈ నిర్లక్ష్య ధోరణికి కొబ్బరి మట్ట పాడాలి చరమగీతం' అని రాసున్న పోస్ట్‌ను షేర్ చేశాడు. అయితే ఇలాంటి పోస్ట్‌లు షేర్ చేస్తే అభిమానుల నుంచి ఏ స్థాయిలో వ్యతిరేకత వస్తుందో ముందే ఆలోచించిన సంపూర్ణేష్, ఎవరో పంపించారు సరదాకి తీసుకోండి అంటూ స్టార్ హీరోల అభిమానులను కూల్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. అదే సమయంలో తన కొబ్బరి మట్ట సినిమాకు మంచి ప్రమోషన్ కూడా చేసుకున్నాడు. Hahaha....evaro pampincharu...saradaki theesukondi pic.twitter.com/I4d9U4C2Bs— Sampoornesh Babu (@sampoornesh) 24 July 2016 -
కాజల్ కూడా చెప్పేస్తోంది
సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా వెలిగిపోతున్న ఉత్తరాది భామలు ఇప్పుడు సొంత గొంతు వినిపించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది తారలు డబ్బింగ్ చెప్పుకోవటం ప్రారంభించగా తాజాగా కాజల్ అగర్వాల్ కూడా ఆ లిస్ట్‌లో చేరడానికి రెడీ అవుతోంది. రకుల్ ప్రీత్ సింగ్, అంజలి లాంటి హీరోయిన్లు కూడా సొంత గొంతుతో అలరిస్తుంటే తాను వెనకపడి పోతాననుకుందేమో.. ఓ తమిళ సినిమాకు డబ్బింగ్ చెప్పేందుకు రెడీ అయ్యింది. సర్దార్ గబ్బర్‌సింగ్, బ్రహ్మోత్సవం సినిమాల రిజల్ట్‌తో కష్టాల్లో పడ్డ కాజల్ ప్రస్తుతం విక్రమ్ సరసన నటిస్తున్న గరుడ సినిమా మీదే ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా సక్సెస్ కోసం అన్ని రకాలుగా కష్టపడుతున్న ఈ బ్యూటీ తొలిసారిగా డబ్బింగ్ చెప్పకునేందుకు రెడీ అయ్యింది. తనకు పెద్దగా పట్టులేని తమిళ రంగంలోనే డబ్బింగ్ చెపుతుందంటే.. నెక్ట్స్ తను చేయబోయే తెలుగు సినిమాకు కూడా కాజల్ సొంతం గొంతు అందించే చాన్స్ ఉందంటున్నారు సినీ జనాలు. -
పవన్ రెమ్యూనరేషన్ అంతా..?
సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాతో నిరాశపరిచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రస్తుతం తన నెక్ట్స్ సినిమా మీద దృష్టిపెట్టాడు. మరోసారి తన ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మాణంలో తెరకెక్కనున్న సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడు. తన కెరీర్‌ను ములుపు తిప్పిన, ఖుషీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా అందించిన ఎస్ జె సూర్య దర్శకత్వంలో ఈ సినిమా చేయనున్నాడు పవన్. ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఓ వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. పవన్ తన నెక్ట్స్ సినిమాకు భారీ రెమ్యూనరేషన్ అందుకోనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. సర్దార్ గబ్బర్‌సింగ్ లాంటి భారీ డిజాస్టర్ తరువాత కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గకపోవటంతో ఎంత రెమ్యూనరేషన్ అడిగినా ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌లో పవర్ స్టార్‌కు భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకే సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా, పాత రికార్డులన్ని తుడిచిపెట్టుకుపోతాయన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్. దీంతో ఏకంగా 25 కోట్ల భారీ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నారట. -
పవన్‌కు జోడిగా మలయాళీ బ్యూటీ
భారీ అంచనాల మధ్య విడుదలైన సర్దార్ గబ్బర్‌సింగ్ నిరాశపరచటంతో తన నెక్ట్స్ సినిమా మీద దృష్టి పెట్టాడు పవన్ కళ్యాణ్. గతంలోలా.., లాంగ్ గ్యాప్ తీసుకోకుండా వెంటనే ఎస్ జె సూర్య డైరెక్షన్ లో ఓ సినిమాను ప్రారంభించాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. గతంలో సర్దార్ గబ్బర్‌సింగ్ హీరోయిన్ ఎంపిక విషయంలో అభిమానులకు షాక్ ఇచ్చిన పవర్ స్టార్, మరోసారి అలాంటి నిర్ణయమే తీసుకోబోతున్నాడట. సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ మొదలు కాకముందు అనీషా ఆంబ్రోస్‌ను, ఆ సినిమాకు హీరోయిన్గా సెలెక్ట్ చేసినట్టు ప్రకటించాడు పవన్. అయితే అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న పవన్, కాజల్ అగర్వాల్‌ను హీరోయిన్గా ఫైనల్ చేశాడు. అయితే తన నెక్ట్స్ సినిమా విషయంలో కూడా ఇలాంటి నిర్ణయాన్నే పవన్ తీసుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది. బెంగళూర్ డేస్ సక్సెస్‌తో ఆకట్టుకున్న మలయాళీ భామ పార్వతీ మీనన్‌ను హీరోయిన్గా తీసుకునే ఆలోచనలో ఉన్నాడు. మాలీవుడ్ లో పలు చిత్రాల్లో మెప్పించిన పార్వతి స్టార్ హీరోయిన్గా మాత్రం గుర్తింపు తెచ్చుకోలేదు. అలాంటి హీరోయిన్, పవన్ ఇమేజ్‌కు ఎలా సూట్ అవుతుందన్న డైలామాలో ఉన్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. మరి పవన్ ఈ సారి రిస్క్ చేస్తాడా.? లేక అభిమానుల కోరిక మేరకు స్టార్ హీరోయిన్ వైపు మొగ్గుచూపుతాడా..? చూడాలి. -
మాస్‌కి ఏప్రిల్.. క్లాస్‌కి మే
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సమ్మర్ సీజన్లో భారీ సినిమాలు వరుసగా రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలలో స్టార్ హీరోలు నటించిన భారీ బడ్జెట్ సినిమాలు వరుసగా థియేటర్లలో సందడి చేయనున్నాయి. అయితే రిలీజ్ విషయంలో పక్కాగా ప్లాన్ చేసుకున్నట్టున్నారు మన దర్శక నిర్మాతలు. ఒక నెలలో పూర్తిగా మాస్ సినిమాలను రిలీజ్ చేసి తరువాత వరుసగా క్లాస్ సినిమాల రిలీజ్‌లకు రెడీ అవుతున్నారు. ఈ లిస్ట్‌లో ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా సర్దార్ గబ్బర్‌సింగ్, టాక్ సంగతి ఎలా ఉన్నా.., ఈ సినిమా పూర్తిగా మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూనే తెరకెక్కించారు. ఇక మంచు వారబ్బాయి ఈడో రకం ఆడో రకం కూడా బోల్డ్ కాన్సెప్ట్‌తో యూత్, మాస్ ఆడియన్స్ కోసమే తెరకెక్కింది. రిలీజ్‌కు రెడీ అవుతున్న అల్లు అర్జున్ సరైనోడు ఊర మాస్ అంటూ ట్రైలర్లోనే కన్ఫామ్ చేసేశారు. ఇవేకాదు డబ్బింగ్ సినిమాగా రిలీజ్ అవుతున్న విజయ్ పోలీస్ కూడా మాస్ ఆడియన్స్‌కు కిక్ ఇచ్చే సినిమా అన్నటాక్ వినిపిస్తోంది. ఇలా ఏప్రిల్ నెలంతా మాస్ సినిమాలు మోత మొగిస్తున్నాయి. ఇక మే నెలల రిలీజ్ అయ్యే సినిమాల విషయంలో పూర్తిగా క్లారిటీ లేకపోయినా అన్నీ క్లాస్ సినిమాలే ఆడియన్స్ ముందుకు రానున్నాయి. డేట్ కన్ఫామ్ చేయకపోయినా మహేష్ బ్రహ్మోత్సవం మే లోనే రిలీజ్‌కు రెడీ అవుతోంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్లోనే ఓన్లీ ఫర్ క్లాస్ అని తేల్చేశారు. ఇక త్రివిక్రమ్, నితిన్ కాంబినేషన్లో వస్తున్న అ.. ఆ.. కూడా క్లాస్ ఎంటర్టైనర్లాగే కనిపిస్తోంది. డబ్బింగ్ సినిమాగా రిలీజ్ అవుతున్న సూర్య 24లో మాస్‌ను ఆకట్టుకునే యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నా.. సైన్స్ ఫిక్షన్ సినిమా కావటంతో ఇది కూడా క్లాస్ ఆడియన్స్‌కే బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. -
భారీ చిత్రాల నిర్మాతలకు టెన్షన్
ఈ సమ్మర్ బరిలో స్టార్ హీరోలు నటించిన భారీ చిత్రాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, 'సర్దార్ గబ్బర్‌సింగ్'తో ఆడియన్స్ ముందుకు రాగా.. అల్లు అర్జున్, మహేష్ బాబు, సూర్య లాంటి స్టార్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధం అవుతున్నారు. అయితే తాజాగా సర్దార్ రిజల్ట్‌తో ఈ బడా చిత్రాల నిర్మాతల్లో టెన్షన్ మొదలైంది. ముఖ్యంగా ఆడియన్స్ టేస్ట్ మారుతుండటంతో ఎలాంటి సినిమాను ఆదరిస్తారో అర్ధం కాక తికమకపడుతున్నారు. భారీ స్థాయిలో సినిమాను రిలీజ్ చేసినా.. నష్టాలు తప్పేలా కనిపించటం లేదు. భారీ బడ్జెట్ సినిమాలు కావటంతో కనీసం వారం రోజుల పాటు సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడిస్తేగాని పెట్టుబడి వెనక్కు వచ్చే పరిస్థితి కనిపించటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాకు ఏమాత్రం నెగెటివ్ టాక్ వచ్చినా బయ్యర్ల నుంచి నిర్మాత వరకు అందరూ నష్టపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా రిలీజ్‌కు రెడీ అవుతున్న అల్లు అర్జున్, సరైనోడు, మహేష్ బ్రహ్మోత్సవం, సూర్య 24 సినిమాల విషయంలో రిజల్ట్ ఎలా ఉండబోతుందో అని ఇండస్ట్రీ వర్గాలు టెన్షన్‌గా ఉన్నాయి. -
ఫ్యాన్స్‌కి సర్దార్
చిత్రం: ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ తారాగణం: పవన్‌కల్యాణ్, కాజల్ అగర్వాల్, శరత్ కేల్కర్, ముఖేశ్ రుషి, అలీ, బ్రహ్మాజీ, తనికెళ్ళ భరణి, సంజన మాటలు: సాయిమాధవ్ బుర్రా పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంత్ శ్రీరామ్,దేవిశ్రీప్రసాద్ సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ కళ: బ్రహ్మ కడలి కెమేరా: ఆర్థర్ ఎ. విల్సన్ ఎడిటింగ్: గౌతంరాజు ఫైట్స్: రామ్ - లక్ష్మణ్, కథ స్క్రీన్‌ప్లే : పవన్ కల్యాణ్ నిర్మాతలు: శరత్‌మరార్, సునీల్ లుల్లా దర్శకత్వం: కె.ఎస్. రవీంద్ర (బాబీ) నిడివి: 166 నిమిషాలు రిలీజ్ తేదీ: ఏప్రిల్ 8 కొన్ని సినిమాలంతే! మొదలైన దగ్గర నుంచి ఏదో ఒక సంచలనమే! కొన్నేళ్ళ క్రితం ‘గబ్బర్‌సింగ్’తో, ఆ తర్వాత ‘అత్తారింటికి దారేది’తో ఇండస్ట్రీ హిట్స్ సాధించిన ఘనత పవన్‌కల్యాణ్‌ది. మళ్ళీ పవన్ కల్యాణ్ ఇమేజ్, ‘గబ్బర్ సింగ్’ టైటిల్, పోలీస్ పాత్ర - అన్నీ కలవడంతో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆది నుంచీ వార్తల్లో విశేషమే. కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా. దాదాపు 100 కోట్ల పైగా వ్యాపారమైన సినిమా. 2 వేల పైగా థియేటర్లలో రిలీజైన సినిమా. ప్రపంచంలో ఒక 23 దేశాల్లో తొట్టతొలిగా విడుదలైన తెలుగు సినిమా. అందుకే, ‘హి ఈజ్ బ్యాక్ టు డు సమ్‌థింగ్’ అనే థీమ్ సాంగ్ నిజమేననిపి స్తుంది. ఆసక్తి పెరుగుతుంది. మరి, ఈ గబ్బర్ ఆ మాట నిలబెట్టుకున్నారా? కథ ఏమిటంటే, ఛత్తీస్‌గఢ్‌లోని రతన్‌పూర్. సంస్థానం రాజు, రాణి చని పోవడంతో, దళపతి హరినారా యణ (ముఖేశ్ బుుషి) సంరక్ష ణలో యువరాణి (కాజల్ అగ ర్వాల్) పెరుగుతుంది. ఆ ప్రాంతంలోనే భైరవ్‌సింగ్ (శరత్ కేల్కర్) పెద్ద మైనింగ్ డాన్. తండ్రి (ప్రదీప్ రావత్)ని అవ మానించారని, చిన్నప్పుడే వాళ్ళ చావుకు కారణమైన మనిషి. పచ్చని పంటలు పండే గ్రామాల్ని సైతం మైనింగ్ కేంద్రాలుగా మార్చేసే క్రూరుడు. యువరాణి కుటుంబంతో అతని వైరం, ఆ ప్రాంతంలో అతని దుర్మార్గాల నేపథ్యంలో ఆ ప్రాంతానికి సర్కిల్ ఇన్స్పెక్టర్గా సర్దార్ గబ్బర్ సింగ్ (పవన్ కల్యాణ్)ని పోస్ట్ చేస్తారు. అక్కడకొచ్చిన సర్దార్, రాజవంశీకురాలని తెలి యకుండానే యువరాణితో ప్రేమలో పడతాడు. మరోపక్క విలన్‌తో పోరాటానికి సిద్ధమవు తాడు. ఆ తరువాత ఏం జరుగుతుందన్నది ఊహించగలిగిందే. ట్రైలర్లలోనే కథాంశమేమిటో దాదాపు చూపించేసిన దర్శక, నిర్మాతలు ఒక రకంగా ప్రేక్షకుల్ని మానసికంగా సిద్ధం చేశారు. ఊరు, ఊరిని పీడించే విలన్, ఆ ఊరికి ఒక యువరాణి, ఆమెకు సమస్యలు, వాటిని పరిష్కరించడా నికి వచ్చిన పోలీసు హీరో - అనగానే విషయం అర్థమవుతుంది. ఇక ఆసక్తి అల్లా ఈ కథను ఎంత ఆసక్తికరంగా చెప్పారు, ఎంత ఆహ్లాదంగా తెరపై చూపారన్నదే! దాని కోసమే రెండుమ్ముప్పావు గంటలూ ప్రేక్షకులు ఓపిగ్గా చూస్తారు. సిన్మా మొదలైన కాసేపటికే విషయం అర్థమైపోతుంది. అప్పటి నుంచి ఐటమ్ సాంగ్సలా రకరకాల ఐటమ్ సీన్స్ తో కథ నడుస్తుంటుంది. హీరో, విలన్ల ఎత్తు పెయైత్తుల ఆటగా కథని నడిపిస్తే ఇంకా ఆసక్తి పెరిగేది. సినిమాను మంచి ‘యాక్షన్ ఎంటర్టైనర్’గా తీయాలని భావించ డంతో, సహజంగా వాటి మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టారు. ప్రతి రెండు, మూడు సీన్లకు ఏదో ఒక ఎంటర్టైనింగ్ ఎలిమెంట్ శ్రమపడి జొప్పించారు. అందు కోసం సాక్షాత్తూ పవన్‌కల్యాణే ఆడారు, పాడారు, గన్ను పట్టారు, (పంచ్ డైలాగులతో) గొంతు పెంచారు. ఒకటికి రెండు సార్లు ఆడవారిలా అభిన యిస్తూ, కులుకు ప్రదర్శించారు. అన్నయ్య చిరంజీవి అభిమానుల్ని అలరిం చేలా ఆయన వీణ స్టెప్ ఈయన వేశారు. ఇలా అన్నీ ఒక్కరే, అంతా ఒక్కరే అయి, ఆ భారంతో భుజాలు వాలిపోయేంత పనిచేశారు. రాత్రింబవళ్ళు పడ్డ ఆ శ్రమ, భారం మొత్తం తెరపై ఆయనలో తెలుస్తుంది. ఇక, తెలుగు తెరకు తొలి పరిచయమైన హిందీ టీవీ విలన్ శరత్ కేల్కర్ మంచి ఒడ్డూ పొడుగుతో బాగున్నారు. వినోదం కోసం సినిమాలో అలీ బ్యాచ్, బ్రహ్మానందం, ఊర్వశి - వగైరా చాలామందే ఉన్నారు. ముఖేశ్ ఋషి, ప్రదీప్ రావత్ లాంటి పేరున్న నటీనటులకీ కొదవ లేదు. ఐటమ్ సాంగ్‌కి రాయ్ లక్ష్మిని పెట్టారు. ఈ సినిమాలో ప్రత్యేకించి చెప్పుకోవాల్సినవి - నిర్మాణ విలువలు. రతన్‌పూర్ విలేజ్ సెట్ మొదలు భారీ రాజప్రాసాదాలు, గుర్రాలు, పుష్కలంగా గన్లతో తెర నిండుగా ఉంది. ఆర్థర్ ఎ. విల్సన్, సెకండ్ యూనిట్‌కి ఐ. ఆండ్రూ అందించిన కెమేరావర్క్ - డ్రోన్ కావ్ు్స సాక్షిగా బాగుంటుంది. సాయిమాధవ్ బుర్రా డైలాగుల్లో పంచ్ కొండొ కచో, పవన్ పొలిటికల్ జీవితానికీ అన్వయించేలా సాగింది. ‘‘అరెస్ట్ చేయడమంటే ఎలర్జీ. ఎన్కౌంటర్ చేయడమంటే ఎనర్జీ’’ లాంటి డైలాగ్స్ ఫ్యాన్స్‌కి నచ్చుతాయి. ఒక బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ సహా ఫస్టాఫ్ లోనే 4 పాటలొచ్చే ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ బాణీల్లో ‘తౌబ తౌబ...’, ‘నీ చేపకళ్ళు...’ లాంటివి నచ్చుతాయి. రామ్ - లక్ష్మణ్‌లు కంపోజ్ చేసిన యాక్షన్ పార్టలో ఇంటర్వెల్ ముందు ఘట్టం, క్లైమా క్స్ ఫైట్ ఉద్విగ్నంగా అనిపిస్తాయి. ‘నాక్కొంచెం తిక్కుంది. కానీ దానికో లెక్కుంది’ అనే గబ్బర్‌సింగ్ ఆ డైలాగ్‌ను ఈ సినిమాలో మరోసారి గుర్తు చేశారు. ఫ్యాన్సని దృష్టిలో పెట్టుకొని లెక్కలేశారు. ‘ఎక్కడ నెగ్గాలో కాదో, ఎక్కడ తగ్గాలో తెలియాలి’ అని మరో హిట్ డైలాగ్‌ని కూడా పవన్ పునశ్చరణ చేశారు. అయితే, నెగ్గాలంటే తగ్గాలన్నది హీరోయిజవ్‌ు హంగా మాలో మరిచిపోయారనిపిస్తుంది. ‘గబ్బర్‌సింగ్’ నుంచి బాక్సాఫీస్ ఫార్ములాగా మారిన అంత్యాక్షరిని మళ్ళీ అనివార్యంగా తానే అనుసరించారు. మొత్తం మీద అప్పటి ‘గబ్బర్ సింగ్’ ఘన విజయం దృష్ట్యా ఈ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ తీశారు. ఇప్పుడిదీ అలరిస్తుందనే నమ్మకంతో చివరలో ‘రాజా.. సర్దార్ గబ్బర్‌సింగ్’ అనే ఎండ్ టైటిల్ వేసి, ‘కంటిన్యూస్...’ అని రాశారు. అది చూసి ఫ్యాన్స్ మాత్రం భలే సంతోషిస్తారు. ఏ హీరోకైనా అంతకు మించి కావాల్సింది ఏముంది! కథ కన్నా ఆఫర్ చేసిన ఐటమ్స్ ఎక్కువైపోయిన ఈ చిత్రం గురించి దర్శక, నిర్మాతలు ‘గన్స్... గట్స్... అండ్ లవ్’ అని ప్రకటిం చారు. ఆ పద్ధతిలోనే ఈ సినిమా ఒక్కముక్కలో- ‘సాంగ్స.. ఫైట్స్.. డ్యాన్స్.. అండ్... ఫైనల్లీ స్టోరీ’. హాలులో ఇవన్నీ పేలే గన్నులే! - రెంటాల జయదేవ -
'పవన్ రెండు రూపాయల స్టార్'
ఛాన్స్ దొరికినప్పుడల్లా మెగా హీరోలను టార్గెట్ చేసే రామ్ గోపాల్ వర్మ, సర్దార్ గబ్బర్‌సింగ్ రిలీజ్ సందర్భంగా ప్రతి ఒక్కరినీ ప్రశ్నలతో విసిగిస్తున్నాడు. కొద్ది రోజులుగా సర్దార్ సినిమా సంచలనాలు నమోదు చేస్తుందంటూ మోసేస్తున్న వర్మ.. శుక్రవారం సినిమా విడుదలైన తర్వాత వరుణ్ తేజ్, హారీష్ శంకర్లను సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాపై అభిప్రాయం చెప్పాలని కోరాడు. గతంలో పవన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ ఎనలిస్ట్ కమాల్ ఆర్ ఖాన్‌ను కూడా కదిలించాడు వర్మ. మెగా హీరోలతో పాటు హరీష్ కూడా ఈ సినిమాపై స్పందించకపోయినా, కమాల్ ఆర్ ఖాన్ మాత్రం దీనిపై బాగా ఘాటుగానే స్పందించాడు. సర్దార్ గబ్బర్‌సింగ్ హిందీలోనే కాదు తెలుగులో కూడా బిగెస్ట్ ఫ్లాప్ అన్న రివ్యూలు వస్తున్నాయంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు, డైరెక్ట్‌గా పవన్‌ని ఉద్దేశిస్తూ 'పవన్ కళ్యాణ్ సార్, మీ సర్దార్ గబ్బర్ సింగ్ బిగ్గెస్ట్ ఫ్లాప్, మీరు ఇప్పుడు రెండు రూపాయల స్టార్. కాబట్టి నా దేశ్‌ద్రోహి 2 సినిమాలో నటించి తిరిగి సూపర్ స్టార్‌గా ఎదగండి' అంటూ కామెంట్ చేశాడు. Forget Hindi, I am getting reports tat #SardarGabbarSingh is all time biggest flop in telugu also. Ppl are calling it #SarDardGabbarSingh — KRK (@kamaalrkhan) 8 April 2016 Sir @PawanKalyan ur #SGS is biggest flop so u are a #2RsStar now. So now come n do my film #Deshdrohi2 n you will become super star again. — KRK (@kamaalrkhan) 8 April 2016 -
'సర్థార్ గబ్బర్‌సింగ్' మూవీ రివ్యూ
టైటిల్ : సర్దార్ గబ్బర్‌సింగ్ జానర్ : యాక్షన్ డ్రామా తారాగణం : పవన్ కళ్యాణ్, కాజల్ అగర్వాల్, శరద్ కేల్కర్, ముఖేష్ రుషి, అలీ దర్శకత్వం : కే యస్ రవీంద్ర (బాబీ) నిర్మాత : శరత్ మరార్ దాదాపు మూడేళ్ల విరామం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోలో హీరోగా తెరకెక్కిన సినిమా సర్దార్ గబ్బర్‌సింగ్. పవన్ కెరీర్లో బిగెస్ట్ హిట్‌గా నిలిచిన గబ్బర్‌సింగ్ సినిమాలోని క్యారెక్టరైజేషన్‌తో తెరకెక్కిన ఈ సినిమా కోసం, పూర్తిగా కొత్త కథా కథనాలను ఎంపిక చేసుకున్నారు. గబ్బర్‌సింగ్ సక్సెస్‌తో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు లాంగ్ గ్యాప్ తరువాత పవన్ సోలో హీరోగా తెరకెక్కిన సినిమా కావటంతో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. మరి ఆ అంచనాలను సర్దార్ గబ్బర్‌సింగ్ అందుకుందా..? పవన్ ముందున్న రికార్డ్‌లు సర్దార్ బుల్లెట్ల దెబ్బకు బద్దలయ్యాయా..? కథ : రతన్ పూర్ తెలుగు రాష్ట్ర సరిహద్దులోని ప్రాంతం. ఇప్పటికీ రాజరికపు వ్యవస్థ పాలనలో ఉన్న ఈ ప్రాంతంలో ప్రభుత్వాధికారులు, రాజకీయ నాయకులు, ఆ రాజవంశీకుల కనుసన్నల్లోనే నడుస్తుంటారు. రాజుగారు చనిపొవటవంతో రాజవంశానికి చెందిన మూడు కుటుంబాలు అధికారం, ఆస్తుల కోసం పోటీపడతాయి. దుర్మార్గుడైన భైరవ్(శరద్ కేల్కర్) తన బలం, బలగంతో ఊరి ప్రజలను బయపెట్టి వ్యాపారం చేస్తుంటాడు. కానీ రాజుగారి వారసురాలు ఆర్శి దేవి( కాజల్ అగర్వాల్) ఉన్న ఆస్తులను అమ్మి తన తండ్రి ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుంటుంది. రాజవంశానికి దళపతి అయిన హరినారాయణ (ముఖేష్ రుషి) ఆమెకు సాయంగా భైరవ్ నుంచి ఇబ్బందులు ఎదురు కాకుండా కాపాడుతుంటాడు. రాజకుంటుంబాన్ని, ఆ ఊరి ప్రజలను భైరవ్ భారీ నుంచి కాపాడే సరైన వ్యక్తి కోసం హరినారాయణ ఎదురు చూస్తుంటారు. ఆ సమయంలో అతడి స్నేహితుడైన పోలీస్ అధికారి, రతన్ పూర్‌కు సిఐగా కండబలం, బుద్ధిబలం ఉన్న సర్దార్ గబ్బర్‌సింగ్(పవన్ కళ్యాణ్)ను పంపిస్తాడు. అనాథగా పెరిగిన సర్దార్, అతని స్నేహితుడు సాంబా ఓ పోలీస్ అధికారి సాయంతో డిపార్ట్ మెంట్ లో చేరతారు. ఎవరి మాట వినకుండా మొండిగా వ్యవహరించే సర్దార్, రతన్ పూర్లో అడుగుపెట్టిన తరువాత తొలిసారిగా భైరవ్కు ఎదురు నిలబడే వాడు ఒకడు వచ్చాడన్న ధైర్యం, ఆ ఊరి జనంలో కనిపిస్తుంది. అదే సమయంలో రాజకుమారిని ఆ ఇంటి పనిమనిషిగా భావించిన ప్రేమలో పడతాడు సర్దార్. అదే రాకుమారిని తన సొంతం చేసుకొని రాజవంశానికి చెందిన మొత్తం ఆస్తిని సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తాడు భైరవ్. అలా డ్యూటీ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా భైరవ్, సర్దార్ల మధ్య యుద్ధం మొదలవుతుంది. మరి ఈ యుద్ధంలో ఎవరు ఎలా దెబ్బకొట్టారు. చివరకు భైరవ్ సామ్రాజ్యాన్ని సర్దార్ ఎలా కూల్చేశాడు అన్నదే మిగతా కథ. నటీనటులు : గబ్బర్‌సింగ్ పాత్రతో తెలుగు సినిమాకు కిక్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి అదే పాత్రలో ఆకట్టుకున్నాడు. కామెడీ యాక్షన్, ఎమోషన్లను అద్భుతంగా పలికించి సినిమా అంతా వన్ మేన్ షోలా నడిపించాడు. యువరాణి పాత్రలో కాజల్ ఆకట్టుకుంది. మగథీర సినిమాలో మిత్రవింద తరహాలోనే సాగిన పాత్ర, పెద్దగా కొత్తగా కనిపించకపోయినా, తొలిసారిగా పవన్ సరసన నటించి మెప్పించింది. విలన్ పాత్రలో తెలుగు తెరకు పరిచయం అయిన శరద్ కేల్కర్ ఫరవాలేదనిపించాడు. నటన పరంగా ఓకె అనిపించిన శరద్, లుక్ విషయంలో మాత్రం మెప్పించాడు. రాక్షసుడైన రాజుగా సరిగ్గా సరిపోయాడు. ముఖేష్ రుషి, రావు రమేష్, అలీ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం, ప్రదీప్ రావత్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి ఇలా భారీ తారాగణం ఉన్న ఈ సినిమాలో ఎవరికి వారు తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతిక నిపుణులు : తెర మీదే కాదు తెర వెనక కూడా ఈ సినిమాతో పవన్ కళ్యాణ్‌దే కీలక పాత్ర. కథా కథనాలను అందించటంతో పాటు అంతా తానే అయి సినిమాను ముందుకు నడిపించాడు పవన్. అయితే కథా పరంగా మెప్పించినా, కథనం పరంగా మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్స్ సాగదీసినట్టుగా అనిపించింది. దర్శకుడిగా బాబీ ఆకట్టుకున్నాడు. మాస్ యాక్షన్ సినిమాకు తను మంచి ఛాయిస్ అని ప్రూవ్ చేసుకున్నాడు. సాయిమాధవ్ బుర్రా మాటలు బాగున్నాయి. చాలా సందర్భాల్లో పవన్ వ్యక్తిత్వాన్ని డైలాగ్స్‌లో వినిపించే ప్రయత్నం చేశారు. యాక్షన్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. అయితే క్లైమాక్స్ ఫైట్‌లో మితిమీరిన తూపాకుల మోత కాస్త ఇబ్బంది పెడుతోంది. దేవీ శ్రీ ప్రసాద్ పాటలతో పాటు నేపథ్య సంగీతంలోనూ తన మార్క్ చూపించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : పవన్ కళ్యాణ్ యాక్షన్ సీన్స్ సంగీతం మైనస్ పాయింట్స్ : బోర్ కొట్టించే లవ్ సీన్స్, స్క్రీన్ ప్లే ఓవరాల్‌గా సర్థార్ గబ్బర్‌సింగ్ పవన్ అభిమానులను మెప్పించే యాక్షన్ ఎంటర్టైనర్ - సతీష్ రెడ్డి, ఇంటర్ నెట్ డెస్క్ -
పవన్ vs మహేష్
టాలీవుడ్లో నెంబర్ వన్ ప్లేస్‌కి పోటీ పడుతున్న ఇద్దరు హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఈ వేసవిలో తమ సినిమాలతో రిలీజ్‌కు రెడీ అవుతున్నారు. అయితే ఈ ఇద్దరి సినిమాల మధ్య చాలా గ్యాప్ ఉన్నా, రికార్డ్ల విషయంలో మాత్రం భారీగా పోటీ కనిపిస్తోంది. ఇప్పటికే సర్దార్ గబ్బర్‌సింగ్ ఆడియో రిలీజ్ కాగా, ఏప్రిల్ 8న ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో భారీగా రిలీజ్ చేయాడానికి రెడీ అవుతున్నారు. ఇక మహేష్ హీరోగా తెరకెక్కుతున్న బ్రహ్మోత్సవం ఆడియోను ఏప్రిల్ రెండో వారంలో రిలీజ్ చేసి మే లో సినిమా విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బిజినెస్ విషయంలో ఈ రెండు సినిమాల మధ్య పోటీ పక్కాగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఫారిన్ మార్కెట్లో గట్టి పట్టున్న మహేష్, ఓవర్సిస్ రైట్స్ విషయంలో పై చేయి సాధించాడు. బ్రహ్మోత్సవం ఓవర్సీస్ రైట్స్ 13 కోట్లకు అమ్ముడవ్వగా, సర్థార్ గబ్బర్‌సింగ్ 11.5 కోట్లతో సరిపెట్టుకున్నాడు. కానీ శాటిలైట్ రైట్స్ విషయంలో మాత్రం పవన్ ముందున్నాడు. సర్దార్ గబ్బర్‌సింగ్ శాటిలైట్ రైట్స్ 13 కోట్లకు అమ్ముడవ్వగా, బ్రహ్మోత్సవం రైట్స్ 11.5 కోట్లతో సరిపెట్టుకుంది. బిజినెస్‌లోనే ఇంతగా పోటి పడుతున్న ఈ ఇద్దరు స్టార్స్, రిలీజ్ తరువాత కలెక్షన్ల విషయంలో ఎలాంటి రికార్డ్స్ నమోదు చూస్తారో చూడాలి. -
'ఆడిషన్‌కు ముందే పవన్ ఓకే చెప్పారు'
సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెడుతున్న యువనటుడు శరద్ కేల్కర్, ఆ సినిమా హీరో పవన్ కళ్యాణ్‌ను ఆకాశానికెత్తేశాడు. ఈ సినిమాలో రాక్షసుడైన భూస్వామిపాత్రలో నటిస్తున్న శరద్, తనకు ఆడిషన్ జరగకముందే, పవన్ తనను ఆ పాత్రకు ఎంపిక చేశారని చెప్పాడు. స్క్రీన్ టెస్ట్ కూడా కాకముందే తనను ఎంపిక చేయటం తనకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగించిందని, తర్వాత ఆయనతో కలిసి నటించడం మొదలుపెట్టాక ఆ రెట్టింపయ్యిందని, తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నాడు. ఉత్తరాదిన టీవీ సీరియల్స్‌తో పాటు రామ్ లీలా, రాఖీ హ్యాండ్సమ్ లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించిన శరద్ కేల్కర్, సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాతో తొలిసారిగా టాలీవుడ్లో అడుగుపెడుతున్నాడు. సర్దార్ రిలీజ్ దగ్గర పడుతున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన శరద్ కేల్కర్, పవన్‌తో పాటు సినిమా యూనిట్‌తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి వివరించాడు. తొలిసారిగా తాను మహరాష్ట్రలో షూటింగ్ జరుగుతుండగా సర్దార్ టీంతో జాయిన్ అయ్యానని, దాదాపు 1000 మందితో ఆ షూటింగ్ జరగడం ఆశ్చర్యంగా అనిపించిందన్నాడు. ఇప్పటివరకు తను కలిసి నటించినవారిలో పవన్ అందరికన్నా గొప్ప వ్యక్తి అంటూ పొగిడాడు. పవర్ ఫేం బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాలో పవన్ సరసన కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమాను, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసి ఏప్రిల్ 8న తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. -
'పవన్ కళ్యాణ్ పాట కాబట్టి సరిపోయింది'
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సర్దార్ గబ్బర్‌సింగ్ ఫీవర్ అభిమానులతో పాటు స్టార్ హీరోలలో కూడా బాగా కనిపిస్తోంది. ముఖ్యంగా మెగా హీరోలు ఈ సినిమా ప్రమోషన్ కోసం అన్ని రకాలుగా కష్టపడుతున్నారు. తాజాగా మెగా హీరో అల్లు అర్జున్ చేసిన ట్వీట్స్, మీడియా సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. 'దేవుడా... నా కొడుకు అయాన్, నా ఫోన్లో ఐ ట్యూన్స్ నుంచి సాంగ్స్ వింటూ కనిపించాడు. నా ట్విట్టర్ ఎకౌంట్ నుంచి సర్దార్ గబ్బర్ సింగ్ పాటలను ఓపెన్ చేశాడు. వాడికి ఫోన్ గురించి ఏమీ తెలియదు. అయినా వాడు పాటలు ప్లే చేశాడంటే అది కేవలం లక్ మాత్రమే'. అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు ఈ ట్వీట్స్ కు కొసమెరుపుగా తన మార్క్ కామెడీ టచ్ కూడా ఇచ్చాడు బన్నీ. అయాన్ పాటలు వినటం చూసిన బన్నీ భార్య స్నేహ.. 'అది పవన్ పాట కాబట్టి సరిపోయింది, ఇంకెవరి పాట అన్నా అయి ఉంటే' అంటూ కంగారు పడిందంట. బన్నీ ఫోన్లో అంతలా భయపడేలా ఇంకెవరి పాటలు ఉంటాయో మరి. ఏది ఏమైనా సర్దార్ గబ్బర్‌సింగ్‌ను వీలైనంతగా ప్రమోట్ చేయటం కోసం మెగా హీరోలు తెగ కష్టపడిపోతున్నారు. Oh my god ! Shocking! My son was listening to songs in my phone iTunes a while ago. The next thing I see is Sardaar song in my Twitter acc. — Allu Arjun (@alluarjun) 29 March 2016 It's impossible to do it. It took my 10 mins to figure out how he did it. He does'nt know anything on the phone. Just pureeee luck. Unreal. — Allu Arjun (@alluarjun) 29 March 2016 My wife said : Thank god ! It's was a Pawan Kalyan song -
హిందీ రిపోర్టర్‌కు పవన్ గిఫ్ట్
లాంగ్ గ్యాప్ తరువాత సర్దార్ గబ్బర్‌సింగ్‌గా వస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఈ సినిమాతో సరికొత్త రికార్డ్‌లు క్రియేట్ చేయాలని భావిస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా సినిమా ప్రమోషన్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. గతంలో మీడియాకు దూరంగా ఉండే పవన్, ఈ సారి మాత్రం ప్రముఖ చానల్స్‌కు ఇంటర్య్యూలు ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు. అంతేకాదు తొలిసారిగా సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెడుతున్న పవన్ కళ్యాణ్, అక్కడ కూడా ఈ సినిమాను భారీగా ప్రమోట్ చేస్తున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ ఫిలిం రిపోర్టర్ అనుపమ చోప్రాకు సర్దార్ సెట్లోనే ఇంటర్వ్యూ ఇచ్చిన పవన్, మరో హిందీ విలేకరి అజయ్ బ్రహ్మత్మజ్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా అజయ్‌కి పవన్ ఓ మెమొరబుల్ గిఫ్ట్ కూడా ఇచ్చాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన అజయ్, పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేశాడు. అంతేకాదు తన చేసిన ఇంటర్య్వూ జాగరన్ న్యూస్‌లో పబ్లిష్ అయిన విషయాన్ని కూడా తన ట్విట్టర్ పేజ్‌లో పోస్ట్ చేశారు అజయ్ బ్రహ్మత్మజ్. @PawanKalyan thanks for your precious gift and time.your signature in hindi,english n telugu on same page for fans. pic.twitter.com/3W6c7MYagS — Ajay Brahmatmaj (@brahmatmajay) March 22, 2016 -
హిందీ రిపోర్టర్‌కు పవన్ గిఫ్ట్
లాంగ్ గ్యాప్ తరువాత సర్థార్ గబ్బర్‌సింగ్‌గా వస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఈ సినిమాతో సరికొత్త రికార్డ్‌లు క్రియేట్ చేయాలని భావిస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా సినిమా ప్రమోషన్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. గతంలో మీడియాకు దూరంగా ఉండే పవన్, ఈ సారి మాత్రం ప్రముఖ చానల్స్‌కు ఇంటర్య్యూలు ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు. అంతేకాదు తొలిసారిగా సర్థార్ గబ్బర్‌సింగ్ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెడుతున్న పవన్ కళ్యాణ్, అక్కడ కూడా ఈ సినిమాను భారీగా ప్రమోట్ చేస్తున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ ఫిలిం రిపోర్టర్ అనుపమ చోప్రాకు సర్థార్ సెట్లోనే ఇంటర్వ్యూ ఇచ్చిన పవన్, మరో హిందీ విలేఖరి అజయ్ బ్రహ్మత్మజ్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా అజయ్‌కి పవన్ ఓ మెమరబుల్ గిఫ్ట్ కూడా ఇచ్చాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన అజయ్, పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేశాడు. అంతేకాదు తన చేసిన ఇంటర్య్వూ జాగరన్ న్యూస్‌లో పబ్లిష్ అయిన విషయాన్ని కూడా తన ట్విట్టర్ పేజ్‌లో పోస్ట్ చేశారు అజయ్ బ్రహ్మత్మజ్. @PawanKalyan thanks for your precious gift and time.your signature in hindi,english n telugu on same page for fans. pic.twitter.com/3W6c7MYagS— Ajay Brahmatmaj (@brahmatmajay) March 22, 2016 -
సర్దార్ గబ్బర్‌సింగ్ టైటిల్ సాంగ్ వచ్చేసింది
మెగా అభిమానులకు పండుగ వాతావరణం మొదలైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సర్దార్ గబ్బర్‌సింగ్ ఫీవర్ టాలీవుడ్లో మొదలైంది. ఈ ఆదివారం ఆడియో రిలీజ్ అవుతున్న సందర్భంగా చిత్రయూనిట్ ప్రమోషన్ వేగం పెంచింది. ఇప్పటికే ఓ టీజర్, మేకింగ్ వీడియోతో పాటు స్టిల్స్‌ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్, తాజాగా ఫస్ట్ సాంగ్ టీజర్‌ను రిలీజ్ చేసింది. ముందుగా ప్రకటించిన విధంగా నాలుగు రోజుల పాటు నాలుగు రకాల టీజర్లను రిలీజ్ చేస్తామన్న యూనిట్ సభ్యులు.. ముందుగా సాంగ్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈసాంగ్ టీజర్ పవన్ తన మార్క్ స్టైల్స్‌తో అదరగొట్టాడు. సినిమాలో పవన్ క్యారెక్టరైజేషన్‌ను రివీల్ చేస్తూ రూపొందించిన ఈ టీజర్ అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇవ్వనుంది. పవర్ ఫేం బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. పవన్ సన్నిహితుడు శరత్ మరార్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రొడక్షన్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 8న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మార్చి 20న హైదరాబాద్ నొవాటెల్ హోటల్లో అభిమానుల సమక్షంలో దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సర్దార్ ఆడియో రిలీజ్ అవుతోంది. Here it goes... Official Teaser of the title song. https://t.co/DiPG49bMNE #SardaarGabbarSingh #PawanKalyan. — Sharrath Marar (@sharrath_marar) March 17, 2016 -
చిరు పాటకు పవన్ స్టెప్పులు
వారసులుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోలు వాళ్ల తండ్రులు, తాతలు చేసిన పాటలను రీమిక్స్ చేయటం టాలీవుడ్లో తరుచుగా కనిపిస్తుంది. నందమూరి, అక్కినేని, మెగా ఫ్యామిలీల నుంచి వచ్చిన అందరు హీరోలు దాదాపుగా ఈ ఫార్ములాను ఫాలో అయిన వాళ్లే. కానీ ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రం ఇంతవరకు మెగాస్టార్ చిరంజీవి పాటను రీమిక్స్ చేయలేదు. స్వతహాగా పాత పాటలను ఇష్టపడే పవర్ స్టార్ పాత సినిమా పాటలను రీమిక్స్ చేసినా ఎప్పుడూ చిరు పాటను మాత్రం వాడలేదు. తన తరువాత ఇండస్ట్రీకి వచ్చిన రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్‌లు మాత్రం మెగా పాటలను తెగ వాడేస్తున్నారు. దీంతో సర్థార్ గబ్బర్‌సింగ్ సినిమాతో తను కూడా అదే పని చేయడానికి ఫిక్స్ అయ్యాడు పవన్ కళ్యాణ్. 80లలో చిరు ఆడి పాడిన ఓ పాటు తన నెక్ట్స్ సినిమా కోసం రీమిక్స్ చేస్తున్నాడు. చిరంజీవి, రాధ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన 'కొండవీటి రాజా' సినిమాలోని 'నా కోక బాగుందా.. నా రైక బాగుందా..' అనే పాటను సర్థార్ గబ్బర్ సింగ్ సినిమా కోసం పవన్ రీమిక్స్ చేస్తున్నాడు. ఈ పాటలో పవన్ సరసన లక్ష్మీ రాయ్ ఆడిపాడుతుంది. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా చిరు పాటకు పవన్ చిందులు కన్ఫామ్ అంటున్నారు మెగా ఫ్యాన్స్. -
అభిమానులను భయపెడుతున్నాడు
ప్రస్తుతం సర్థార్ గబ్బర్‌సింగ్ సినిమా షూటింగ్లో ఉన్న పవన్ నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అఫీషియల్‌గా ఏ సినిమా చేయబోయేది కన్ఫామ్ చేయకపోయినా.. పవన్ నెక్ట్స్ సినిమా దర్శకులుగా వినిపిస్తున్న పేర్లు మాత్రం, అభిమానులను భయపెడుతున్నాయి. ముఖ్యంగా సక్సెస్‌కు చాలా దూరంలో ఉన్న దర్శకులు పవన్‌తో సినిమాకు రెడీ అవుతున్నారన్న వార్తలు ఇప్పుడు టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి.మొన్నటి వరకు తమిళ దర్శకుడు ఎస్ జె సూర్యతో పవన్ నెక్ట్స్ సినిమా ఉంటుందన్న వార్త టాలీవుడ్లో షికారు చేసింది. దాదాపుగా కన్ఫామ్ అయిన ఎస్ జె సూర్య ప్రాజెక్ట్‌ను ఇప్పుడు పవన్ పక్కన పెట్టేశాడట. తమిళ్లో సూపర్ హిట్ అయిన అజిత్ వేదలం సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా విషయంలో కూడా షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు పవర్ స్టార్. కందిరీగ సినిమాతో ఎంట్రీ ఇచ్చి తరువాత రభసతో భారీ డిజాస్టర్‌ను అందించిన సంతోష్ శ్రీనివాస్‌ను వేదలం రీమేక్‌కు దర్శకుడిగా ఎంచుకున్నాడు. దీంతో అభిమానులు ఈ సినిమా రిజల్ట్‌పై డౌట్ పడుతున్నారు. మరి పవన్ ఈ కాంబినేషన్లో సినిమా చేస్తాడా లేక.. మరో గాసిప్‌తో ఆడియన్స్ ను తికమక పెడతాడా.. చూడాలి. -
సమ్మర్ సినిమాల బిజినెస్ జోరు
బాహుబలి సినిమా రిలీజ్ తరువాత టాలీవుడ్ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయి ఎన్నో రెట్లు పెరిగింది. ఒకప్పుడు 50 కోట్ల కలెక్షన్లు కూడా కష్టంగా కనిపించిన ఇండస్ట్రీలో ఇప్పుడు 100 కోట్లు కూడా సాధ్యమే అని ప్రూవ్ అయ్యింది. ముఖ్యంగా ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు వసూళ్ల సునామీ సృష్టిస్తుండటంతో రాబోయే సినిమాలకు కూడా భారీ బిజినెస్ జరుగుతోంది. ఈ వేసవిలో రిలీజ్‌కు రెడీ అవుతున్న భారీ చిత్రాలకు ఇప్పటికే బిజినెస్ స్టార్ట్ అయిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. ఈ లిస్ట్‌లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందే ఉన్నాడు. లాంగ్ గ్యాప్ తరువాత సర్థార్ గబ్బర్‌సింగ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్న పవన్, ఇప్పటికే 90 కోట్లకు పైగా బిజినెస్ చేసేశాడన్న టాక్ వినిపిస్తోంది. మహేష్ హీరోగా తెరకెక్కుతున్న బ్రహ్మోత్సవానికి కూడా ఇదే స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. సన్నాఫ్ సత్యమూర్తి తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు సినిమాతో వస్తున్న అల్లు అర్జున్ కూడా ఇప్పటికే 70 కోట్ల వరకు బిజినెస్‌ను పూర్తిచేశాడు. ఇక ఇంతవరకు షూటింగ్ కూడా మొదలుకాక ముందే ఎన్టీఆర్, కొరటాల శివల జనతా గ్యారేజ్‌కు కూడా బిజినెస్ మొదలైందన్న టాక్ వినిపిస్తోంది. ఈ జోరు చూస్తుంటే ఈ సమ్మర్లో టాలీవుడ్ బాక్సాఫీస్ ముందు రెండు, మూడు వందల కోట్ల రూపాయల విలువైన సినిమాలు సందడి చేసే ఛాన్స్ కనిపిస్తోంది. -
పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు
ప్రస్తుతం సర్థార్ గబ్బర్‌సింగ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, తన నెక్ట్స్ సినిమా విషయంలో అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. స్టార్ హీరోలందరూ వరుస సినిమాలతో హవా చూపిస్తుంటే పవన్ మాత్రం సినిమాకు సినిమాకు మధ్యలో భారీ గ్యాప్ తీసుకుంటూ అభిమానులను నిరాశపరుస్తున్నాడు. ప్రస్తుతం సర్థార్ గబ్బర్‌సింగ్ షూటింగ్ ముగింపు దశలో ఉండటంతో పవర్ స్టార్ చేయబోయే నెక్ట్స్ సినిమాపై టాక్ మొదలైంది. ఇప్పటి వరకు పవన్ టీం నుంచి ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రాకపోయినా, పవన్‌తో ఖుషి లాంటి బ్లాక్ బస్టర్, కొమరం పులి లాంటి డిజాస్టర్ అందించిన ఎస్ జె సూర్య దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడన్న వార్త, ప్రముఖంగా వినిపించింది. అంతేకాదు అజిత్ హీరోగా నటించిన తమిళ సూపర్ హిట్ సినిమా వీరంను పవన్ తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడన్న వార్త తాజాగా వినిపిస్తోంది. వీటికి తోడు గోపాల గోపాల ఫేం కిశోర్ కుమార్ పార్థసాని దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించాడట. మరి ఈ మూడు సినిమాలో పవన్, ఏ సినిమాకు కమిట్ అవుతాడో తెలియక అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు తికమక పడుతున్నారు. -
సర్దార్ గబ్బర్‌సింగ్ సెట్లో చిరంజీవి
మెగా ఫ్యామిలీలో వివాదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టేందుకు మెగా హీరోలు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. కొంత కాలంగా అన్నయ్య చిరంజీవికి దూరంగా ఉంటున్న పవన్, ఈ మధ్యే మళ్లీ ఆ కుటుంబానికి దగ్గరవుతున్నాడు. ఇటీవల సర్దార్ సెట్ నుంచి చిరంజీవి ఇంటికి వెళ్లి కలిసి పవన్, ఆ తరువాత చిరు 60వ పుట్టినరోజు వేడుకల్లోనూ సందడి చేశాడు. తాజాగా చిరంజీవి కూడా సర్దార్ గబ్బర్‌సింగ్ సెట్‌కు వెళ్లి తమ్ముడితో కాసేపు సరదాగా గడిపాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన విలేజ్ సెట్లో షూటింగ్ జరుపుకుంటున్న సర్దార్ గబ్బర్‌సింగ్ సెట్లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశాడు. పవన్ కళ్యాణ్‌తో పాటు యూనిట్ సభ్యులతో సరదాగా గడిపిన మెగాస్టార్, అభిమానులతో పాటు యూనిట్ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు. చిరు, పవన్‌తో పాటు ఇతర యూనిట్ సభ్యులు కలిసి దిగిన ఫోటోను నిర్మాత శరత్ మరార్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. #ShankarDada meets #Sardaar on the sets of #SardaarGabbarSingh. Team celebrates the visit. #PSPK #PawanKalyan. pic.twitter.com/kweMna1rze — Sharrath Marar (@sharrath_marar) January 28, 2016 -
రిస్క్ చేస్తున్న పవర్‌స్టార్
ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ క్రేజ్ ఉన్న స్టార్ హీరో ఎవరు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సినిమా సక్సెస్ ఫెయిల్యూర్‌తో సంబందం లేకుండా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న పవన్ ఇప్పుడో భారీ రిస్క్ చేస్తున్నాడు. తన కెరీర్‌ను మలుపు తిప్పిన హిట్‌తో పాటు అదే స్ధాయిలో భారీ ప్లాప్ కూడా ఇచ్చిన ఓ దర్శకుడితో మరోసారి కలిసి పని చేయాలని భావిస్తున్నాడు. పవన్ కళ్యాణ్‌ను యూత్ ఆడియన్స్‌కు దగ్గర చేసిన సక్సెస్ఫుల్ సినిమా ఖుషి. ఈ సినిమాతో ఒక్కసారిగా టాప్ స్టార్స్ లిస్ట్‌లో చేరిపోయిన పవన్, ఆ తరువాత వెనుదిరిగి చూసుకోలేదు. ఈ ఒక్క సక్సెస్, ఆ తరువాత పవన్ పదేళ్ల పాటు హిట్ ఇవ్వలేకపోయినా అతడి స్టార్ ఇమేజ్ను కాపాడింది. ఈ సినిమాకు దర్శకుడు ఎస్ జె సూర్య. ఖుషి లాంటి సినిమా ఇచ్చాడన్న నమ్మకంతో సూర్యతో కలిసి కొమరం పులి సినిమా చేశాడు పవన్. అయితే ఆ సినిమా పవన్ కెరీర్లోనే బిగెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది. అంతేకాదు అలాంటి కథ ఎంచుకున్నందుకు ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కోన్నాడు. ఇప్పుడు మరోసారి అదే రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు పవర్ స్టార్. ప్రస్తుతం గబ్బర్‌సింగ్‌కు సీక్వల్గా తెరకెక్కుతున్న సర్థార్ గబ్బర్‌సింగ్ సినిమాలోనటిస్తున్న పవన్ కళ్యాణ్, ఆ సినిమా తరువాత ఎస్ జె సూర్య దర్శకత్వంలో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను రేణుదేశాయ్ నిర్మించే అవకాశం ఉందన్న టాక్ వినిపించినా ఫైనల్‌గా పవన్ స్నేహితుడు శరత్ మరార్ చేతికే వెళ్లింది. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది.