సర్దార్ గబ్బర్సింగ్ సెట్లో చిరంజీవి | chiranjeevi visits Pawan Kalyan sardaar gabbarsingh sets | Sakshi
Sakshi News home page

సర్దార్ గబ్బర్సింగ్ సెట్లో చిరంజీవి

Published Thu, Jan 28 2016 10:04 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

సర్దార్ గబ్బర్సింగ్ సెట్లో చిరంజీవి - Sakshi

సర్దార్ గబ్బర్సింగ్ సెట్లో చిరంజీవి

మెగా ఫ్యామిలీలో వివాదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టేందుకు మెగా హీరోలు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. కొంత కాలంగా అన్నయ్య చిరంజీవికి దూరంగా ఉంటున్న పవన్, ఈ మధ్యే మళ్లీ ఆ కుటుంబానికి దగ్గరవుతున్నాడు. ఇటీవల సర్దార్ సెట్ నుంచి చిరంజీవి ఇంటికి వెళ్లి కలిసి పవన్, ఆ తరువాత చిరు 60వ పుట్టినరోజు వేడుకల్లోనూ సందడి చేశాడు.

తాజాగా చిరంజీవి కూడా సర్దార్ గబ్బర్సింగ్ సెట్కు వెళ్లి తమ్ముడితో కాసేపు సరదాగా గడిపాడు. ప్రస్తుతం హైదరాబాద్లో వేసిన విలేజ్ సెట్లో షూటింగ్ జరుపుకుంటున్న సర్దార్ గబ్బర్సింగ్ సెట్లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశాడు. పవన్ కళ్యాణ్తో పాటు యూనిట్ సభ్యులతో సరదాగా గడిపిన మెగాస్టార్, అభిమానులతో పాటు యూనిట్ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు. చిరు, పవన్తో పాటు ఇతర యూనిట్ సభ్యులు కలిసి దిగిన ఫోటోను నిర్మాత శరత్ మరార్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement