'పవన్ రెండు రూపాయల స్టార్' | Ram gopal varma, Kamal Khan comments on sardaar gabbarsingh | Sakshi
Sakshi News home page

'పవన్ రెండు రూపాయల స్టార్'

Published Fri, Apr 8 2016 2:25 PM | Last Updated on Sun, Sep 3 2017 9:29 PM

'పవన్ రెండు రూపాయల స్టార్'

'పవన్ రెండు రూపాయల స్టార్'

ఛాన్స్ దొరికినప్పుడల్లా మెగా హీరోలను టార్గెట్ చేసే రామ్ గోపాల్ వర్మ, సర్దార్ గబ్బర్సింగ్ రిలీజ్ సందర్భంగా ప్రతి ఒక్కరినీ ప్రశ్నలతో విసిగిస్తున్నాడు. కొద్ది రోజులుగా సర్దార్ సినిమా సంచలనాలు నమోదు చేస్తుందంటూ మోసేస్తున్న వర్మ.. శుక్రవారం సినిమా విడుదలైన తర్వాత వరుణ్ తేజ్, హారీష్ శంకర్లను సర్దార్ గబ్బర్సింగ్ సినిమాపై అభిప్రాయం చెప్పాలని కోరాడు. గతంలో పవన్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ ఎనలిస్ట్ కమాల్ ఆర్ ఖాన్ను కూడా కదిలించాడు వర్మ.
 
మెగా హీరోలతో పాటు హరీష్ కూడా ఈ సినిమాపై స్పందించకపోయినా, కమాల్ ఆర్ ఖాన్ మాత్రం దీనిపై బాగా ఘాటుగానే స్పందించాడు. సర్దార్ గబ్బర్సింగ్ హిందీలోనే కాదు తెలుగులో కూడా బిగెస్ట్ ఫ్లాప్ అన్న రివ్యూలు వస్తున్నాయంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు, డైరెక్ట్గా పవన్ని ఉద్దేశిస్తూ 'పవన్ కళ్యాణ్ సార్, మీ సర్దార్ గబ్బర్ సింగ్ బిగ్గెస్ట్ ఫ్లాప్, మీరు ఇప్పుడు రెండు రూపాయల స్టార్. కాబట్టి నా దేశ్ద్రోహి 2 సినిమాలో నటించి తిరిగి సూపర్ స్టార్గా ఎదగండి' అంటూ కామెంట్ చేశాడు.
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement