మాస్కి ఏప్రిల్.. క్లాస్కి మే
మాస్కి ఏప్రిల్.. క్లాస్కి మే
Published Fri, Apr 15 2016 8:54 AM | Last Updated on Sun, Sep 3 2017 10:00 PM
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సమ్మర్ సీజన్లో భారీ సినిమాలు వరుసగా రిలీజ్కు రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలలో స్టార్ హీరోలు నటించిన భారీ బడ్జెట్ సినిమాలు వరుసగా థియేటర్లలో సందడి చేయనున్నాయి. అయితే రిలీజ్ విషయంలో పక్కాగా ప్లాన్ చేసుకున్నట్టున్నారు మన దర్శక నిర్మాతలు. ఒక నెలలో పూర్తిగా మాస్ సినిమాలను రిలీజ్ చేసి తరువాత వరుసగా క్లాస్ సినిమాల రిలీజ్లకు రెడీ అవుతున్నారు.
ఈ లిస్ట్లో ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా సర్దార్ గబ్బర్సింగ్, టాక్ సంగతి ఎలా ఉన్నా.., ఈ సినిమా పూర్తిగా మాస్ ఆడియన్స్ను టార్గెట్ చేస్తూనే తెరకెక్కించారు. ఇక మంచు వారబ్బాయి ఈడో రకం ఆడో రకం కూడా బోల్డ్ కాన్సెప్ట్తో యూత్, మాస్ ఆడియన్స్ కోసమే తెరకెక్కింది. రిలీజ్కు రెడీ అవుతున్న అల్లు అర్జున్ సరైనోడు ఊర మాస్ అంటూ ట్రైలర్లోనే కన్ఫామ్ చేసేశారు. ఇవేకాదు డబ్బింగ్ సినిమాగా రిలీజ్ అవుతున్న విజయ్ పోలీస్ కూడా మాస్ ఆడియన్స్కు కిక్ ఇచ్చే సినిమా అన్నటాక్ వినిపిస్తోంది. ఇలా ఏప్రిల్ నెలంతా మాస్ సినిమాలు మోత మొగిస్తున్నాయి.
ఇక మే నెలల రిలీజ్ అయ్యే సినిమాల విషయంలో పూర్తిగా క్లారిటీ లేకపోయినా అన్నీ క్లాస్ సినిమాలే ఆడియన్స్ ముందుకు రానున్నాయి. డేట్ కన్ఫామ్ చేయకపోయినా మహేష్ బ్రహ్మోత్సవం మే లోనే రిలీజ్కు రెడీ అవుతోంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్లోనే ఓన్లీ ఫర్ క్లాస్ అని తేల్చేశారు. ఇక త్రివిక్రమ్, నితిన్ కాంబినేషన్లో వస్తున్న అ.. ఆ.. కూడా క్లాస్ ఎంటర్టైనర్లాగే కనిపిస్తోంది. డబ్బింగ్ సినిమాగా రిలీజ్ అవుతున్న సూర్య 24లో మాస్ను ఆకట్టుకునే యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నా.. సైన్స్ ఫిక్షన్ సినిమా కావటంతో ఇది కూడా క్లాస్ ఆడియన్స్కే బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
Advertisement