bramhotsavam
-
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ
మహానంది: మహానంది క్షేత్రంలో జరగనున్న శివరాత్రి బ్రహ్మోత్సవాలకు బుధవారం అంకురార్పణ చేయనున్నట్లు మహానంది దేవస్థానం పండితుడు రవిశంకర అవధాని తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహానంది క్షేత్రంలో ఈ నెల 27వరకు ఉత్సవాలు ఉంటాయన్నారు. అందులో భాగంగా 24న మహా లింగోద్భవం, మహా లింగోద్భవం, 25న స్వామివారి కల్యాణం, 26న రథోత్సవం ఉంటాయన్నారు. ఈ ఏడాది కొత్తగా శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారికి పుష్పపల్లకీ ఉత్సవం నిర్వహిస్తున్నామన్నారు. -
మార్చి 2 నుంచి అహోబిలం బ్రహ్మోత్సవాలు
- మార్చి 13 వరకు నిర్వహణ - ఏర్పాట్లపై ఆర్డీఓ సమీక్ష నంద్యాల: అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 2వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆర్డీఓ రామ సుందర్ రెడ్డి తెలిపారు. సోమవారం.. అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బ్రహ్మోత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో సకల సౌకర్యాలు కల్పించాలన్నారు. దొంగతనాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తుల స్నానాలకు తెలుగుగంగ కాల్వ ద్వారా నీటి సౌకర్యాన్ని కల్పించాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆర్అండ్బీ అధికారులకుససూచించారు.ఆలయ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత పంచాయతీరాజ్ అధికారులదేనన్నారు. భక్తుల సంఖ్యకు తగినట్లు ఆర్టీసీ అధికారులు బస్సులను నడపాలన్నారు. విద్యుత్ సమస్య లేకుండా 24గంటలు సరఫరా చేయాలని చెప్పారు. వైద్యశాఖ అధికారులు.. ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడంతోపాటు అబులెన్స్ను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. పావన నరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గించొద్దని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. ఉత్సవాల్లో మద్యం విక్రయాలను నియంత్రించాలన్నారు. అనంతరం ఆర్డీఓతోపాటు దేవస్థానం ఈఓ మల్లికార్జునప్రసాద్ తదితరులు.. బ్రహ్మోత్సవాల పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో తెలుగుగంగ డీఈ నరసింహారెడ్డి, ఇన్చార్జి ఆర్టీఓ జీవీ రమణ, ఆర్డబ్ల్యూఎస్ డీఈ రవికుమార్, ప్రొహిబిషన్ ఎస్ఐ చంద్రహాస్, , ఫైర్ ఆఫీసర్ హేమంత్‌రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ ముక్తార్, ఫారెస్ట్ ఆఫీసర్ రామ్‌సింగ్, మెడికల్ ఆఫీసర్ గుణశేఖర్, ఎంపీడీఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
శ్రీగిరి.. ఉత్సవభేరి
- శాస్త్రోక్తంగా ప్రారంభమైన శివరాత్రి వేడుకలు - సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజపటావిష్కరణ - చండీశ్వరునికి విశేష పూజలు శ్రీశైలం: శివ భక్తులకు భూకైలాసమైన శ్రీశైల మహాక్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆరంభ పూజలను అత్యంత శాస్త్రోక్తంగా ఈఓ నారాయణ భరత్ గుప్త, అర్చకులు, వేదపండితులు నిర్వహించారు. ప్రత్యేక పూజల్లో భాగంగా బ్రహ్మోత్సవాల నిర్వాహకుడైన చండీశ్వరుని ఆవాహన చేసి దీక్షా వస్త్రాలను సమర్పించి కంకణధారణ చేయించారు. ఆ తరువాత ఉత్సవంలో పాల్గొనే అర్చకులు, వేదపండితులు, భజంత్రీలు, సంబంధిత సిబ్బందికి దీక్షా వస్త్రాలను అందజేశారు. అనంతరం పుణ్యహవాచనం, శివసంకల్పం, చండీశ్వర పూజ, రుత్విగ్వరణం, అఖండస్థాపన, వాస్తు పూజ, వాస్తు హోమం, పంచావరణార్చన, మండపారాధన, కలశ స్థాపన తదితర ప్రత్యేకపూజలను నిర్వహించారు. క్షేత్ర పాలకుడైన వీరభద్రుని ఆధ్వర్యంలో ముక్కంటి బ్రహ్మోత్సవాలను చండీశ్వరుడే నిర్వహిస్తారని వేదపండితులు తెలిపారు. అందుకే చండీశ్వరునికి ముందుగా కంకణధారణ చేస్తామన్నారు. ఉత్సవ సమయంలో ప్రతి రోజూ ఉభయ దేవాలయ పూజల వేళల్లో ఈ చండీశ్వరుని పల్లకి ఊరేగింపు ఉంటుందన్నారు. సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఉదయం యాగశాలలో గణపతి పూజతో ప్రారంభం కాగా, రాత్రి 8 గంటలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజపటావిష్కరణ చేసి ధ్వజారోహణ కార్యక్రమాన్ని వేదమంత్రోచ్ఛారణలతో నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటలకు అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠాపన పూజలు జరిగాయి. అనంతరం పల్లకిలో చండీశ్వరుడిని ఊరేగిస్తూ ఆలయ ప్రదక్షిణ చేసి ధ్వజ స్తంభం వద్దకు తీసుకు వచ్చారు. వేదమంత్రోచ్ఛారణలతో మంత్రపూర్వకంగా సకల దేవతలను ఆహ్వానిస్తూ శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలి రావాల్సిందిగా ముక్కోటి దేవతలకు పిలుపునిచ్చారు. క్షేత్ర పాలకుడైన వీరభద్రుని పర్యవేక్షణలో చండీశ్వరుని ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాలకు మహాశివరాత్రి రోజున శ్రీ భ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల కల్యాణ మహోత్సవానికి ముక్కోటి దేవతలు వస్తారని, మహావిష్ణువు కన్యాదానం చేయగా, బ్రహ్మ రుత్వికత్వం నిర్వహిస్తారని శైవాగమం చెబుతోందని వేదపండితులు పేర్కొన్నారు. ధ్వజారోహణకు ఈఓ దూరం: ప్రతి ఏటా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో ఆలయ కార్యనిర్వహణాధికారి కంకణధారణ చేసుకుని ధ్వజపటావిష్కరణ, ధ్వజారోహణ కార్యక్రమ క్రతువులను నిర్వహించడం ఆగమ సంప్రదాయం. అయితే అత్యున్నత అధికారి లేనప్పుడు, ఆలయ అధికారి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. శుక్రవారం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆరంభ క్రతువులలో కీలకమైన ధ్వజపటావిష్కరణ, ధ్వజారోహణ కార్యక్రమాలకు ఈఓ హాజరు కాకపోవడంతో అర్చకులు, వేదపండితులే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విమర్శలకు తావిచ్చినట్లయింది. -
అశ్వవాహనంపై శ్రీవారి వైభవం
-
వైభవంగా శ్రీవారి రథోత్సవం
-
చంద్రప్రభ వాహనాంపై శ్రీవారి వైభవం
-
సూర్యప్రభ వాహనంపై శ్రీవారి వైభవం
-
మాస్‌కి ఏప్రిల్.. క్లాస్‌కి మే
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సమ్మర్ సీజన్లో భారీ సినిమాలు వరుసగా రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలలో స్టార్ హీరోలు నటించిన భారీ బడ్జెట్ సినిమాలు వరుసగా థియేటర్లలో సందడి చేయనున్నాయి. అయితే రిలీజ్ విషయంలో పక్కాగా ప్లాన్ చేసుకున్నట్టున్నారు మన దర్శక నిర్మాతలు. ఒక నెలలో పూర్తిగా మాస్ సినిమాలను రిలీజ్ చేసి తరువాత వరుసగా క్లాస్ సినిమాల రిలీజ్‌లకు రెడీ అవుతున్నారు. ఈ లిస్ట్‌లో ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా సర్దార్ గబ్బర్‌సింగ్, టాక్ సంగతి ఎలా ఉన్నా.., ఈ సినిమా పూర్తిగా మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూనే తెరకెక్కించారు. ఇక మంచు వారబ్బాయి ఈడో రకం ఆడో రకం కూడా బోల్డ్ కాన్సెప్ట్‌తో యూత్, మాస్ ఆడియన్స్ కోసమే తెరకెక్కింది. రిలీజ్‌కు రెడీ అవుతున్న అల్లు అర్జున్ సరైనోడు ఊర మాస్ అంటూ ట్రైలర్లోనే కన్ఫామ్ చేసేశారు. ఇవేకాదు డబ్బింగ్ సినిమాగా రిలీజ్ అవుతున్న విజయ్ పోలీస్ కూడా మాస్ ఆడియన్స్‌కు కిక్ ఇచ్చే సినిమా అన్నటాక్ వినిపిస్తోంది. ఇలా ఏప్రిల్ నెలంతా మాస్ సినిమాలు మోత మొగిస్తున్నాయి. ఇక మే నెలల రిలీజ్ అయ్యే సినిమాల విషయంలో పూర్తిగా క్లారిటీ లేకపోయినా అన్నీ క్లాస్ సినిమాలే ఆడియన్స్ ముందుకు రానున్నాయి. డేట్ కన్ఫామ్ చేయకపోయినా మహేష్ బ్రహ్మోత్సవం మే లోనే రిలీజ్‌కు రెడీ అవుతోంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్లోనే ఓన్లీ ఫర్ క్లాస్ అని తేల్చేశారు. ఇక త్రివిక్రమ్, నితిన్ కాంబినేషన్లో వస్తున్న అ.. ఆ.. కూడా క్లాస్ ఎంటర్టైనర్లాగే కనిపిస్తోంది. డబ్బింగ్ సినిమాగా రిలీజ్ అవుతున్న సూర్య 24లో మాస్‌ను ఆకట్టుకునే యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నా.. సైన్స్ ఫిక్షన్ సినిమా కావటంతో ఇది కూడా క్లాస్ ఆడియన్స్‌కే బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. -
సూపర్ స్టార్ vs సూపర్ స్టార్
దక్షిణాదిలో ఓ ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమవుతోంది. సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న ఇద్దరు టాప్ హీరోలు ఒకేసారి బాక్సాఫీస్ బరిలో దిగుతుండటంతో తెలుగు, తమిళ భాషల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరి సినిమాలు తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ద్విభాషా చిత్రాలు కావటంతో పోటీ మరింత రసవత్తరంగా మారింది. ఒకేసారి బరిలో దిగుతున్న ఆ ఇద్దరు హీరోలు ఒకరు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాగా, మరొకరు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీ కాంత్. మహేష్ బాబు ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను పివిపి సంస్థ భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి నిర్మిస్తోంది. శ్రీమంతుడు సినిమాతో వంద కోట్ల వసూళ్లను సాధించిన మహేష్, ఈ సినిమాతో మరోసారి రికార్డ్‌లు తిరగరాయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటివరకు డేట్ ఎనౌన్స్ చేయకపోయినా మే చివరి వారంలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కబాలి సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్న కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా మే చివరి వారంలోనే తన సినిమా రిలీజ్‌కు రెడీ అవుతున్నాడు. వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న రజనీ, ఈ సారి యంగ్ డైరెక్టర్ పా రంజిత్‌తో కలిసి భారీ యాక్షన్ డ్రామాను ప్లాన్ చేశాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాధికా ఆప్టే హీరోయిన్గా నటిస్తుండగా, ధన్సిక, ప్రకాష్ రాజ్, కిశోర్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇలా ఇద్దరు సూపర్ స్టార్లు ఒకేసారి బాక్సాఫీస్ ముందు తలపడుతుండటంతో అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. అయితే వీరిలో ఒకరితో ఒకరికి పోటి లేకపోవటం, ఇద్దరికీ సొంతం మార్కెట్ బలంగా ఉండటంతో బిజినెస్ పరంగా పెద్దగా నష్టాలు జరిగే అవకాశం లేదంటున్నారు విశ్లేషకులు. -
మూడు రోజుల్లో నాకో కూతురు కావాలి: సమంత
ప్రస్తుతం బ్రహ్మోత్సవం, అ.. ఆ.. సినిమాలతో పాటు తమిళంలో మరో రెండు సినిమాల షూటింగ్‌లతో ఫుల్ బిజీగా ఉన్న సమంత, ఓ ఇంపార్టెంట్ పర్సన్‌తో డేట్‌కి ఓకే చెప్పింది. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఒక్క రోజు తనతో గడపడానికి అంగీకరించింది జెస్సీ. అయితే తనతో డేట్‌కి వస్తా అన్న పర్సన్ పెట్టిన కండిషన్‌తో ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో పడిందట. ఇంతకీ ఈ స్టార్ హీరోయిన్‌తో డేట్‌కి వెళ్తున్నది ఎవరు అనుకుంటున్నారా..? ఆ లక్కీ పర్సన్ ఏ స్టార్ హీరోనో.. మరో బోయ్ ఫ్రెండో కాదు.. సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి, టాలీవుడ్ ప్రిన్సెస్ సితార. సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితారతో ఈ శనివారం ఆడుకోడానికి డేట్ ఫిక్స్ చేసుకుంది సమంత. ఈ విషయాన్ని సితారతో కలిసి దిగిన ఫోటోతో పాటు ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అయితే సితార తను ఆడుకోవడానికి సమంత పాపను కూడా వెంట తీసుకొని రావాలని చెప్పిందిట. ఈ విషయాన్ని సరదాగా తన అభిమానులతో షేర్ చేసుకుంది సామ్. శనివారానికల్లా తనకో కూతురు కావాలని, ఎలాగోలా ఎరేంజ్ చేసుకోవాలని చెప్పింది. సమంత ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తుంది. పివిపి సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాను మే మొదటివారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాతో మరోసారి ఇండస్ట్రీ రికార్డ్లను తిరగరాయాలని ప్లాన్ చేస్తున్నాడు మహేష్. Sitara we have a play date but she wants me to bring my baby along .Now how to arrange for that by Saturday pic.twitter.com/e3zHnG2vl1 — Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) March 15, 2016 -
మరో తమిళ దర్శకుడితో మహేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు తమిళ మార్కెట్ మీద దృష్టి పెట్టాడు. ఇప్పటికే శ్రీమంతుడు సినిమాతో తమిళ్లో కూడా మంచి విజయం సాధించిన మహేష్ బాబు ఇప్పుడు వరుసగా తమిళ దర్శకులతో పనిచేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్న మహేష్, ఈ సినిమాను కూడా తెలుగుతో పాటు తమిళంలోనూ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత తమిళ దర్శకుడు మురుగదాస్ డైరెక్షన్లో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు మహేష్. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమాతో అక్కడ కూడా స్టార్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అంతేకాదు మురుగదాస్ సినిమా తరువాత కూడా మరోసారి తమిళ దర్శకుడితోనే సినిమాకు రెడీ అవుతున్నాడు రాజకుమారుడు. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో కూడా స్టైలిష్ డైరెక్టర్‌గా మంచి పేరున్న గౌతమ్ మీనన్, దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాత అశ్వనిదత్ నిర్మించనున్నారు. ఈవిషయాన్ని స్వయంగా ప్రకటించిన అశ్వనీదత్, ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. -
మహేష్‌కి పోటీ వస్తున్న నితిన్
ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అ..ఆ..(అనసూయ రామలింగ్ vs ఆనంద్ విహారి)' పేరుతో సినిమా చేస్తోన్న నితిన్, ఆ సినిమాతో భారీ రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు. తొలిసారిగా నితిన్ కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ రయూనిట్ ప్రకటించారు. ముందుగా అ..ఆ..ను ఫిబ్రవరిలోనే రిలీజ్ చేయాలని భావించినా షూటింగ్ ఆలస్యం కావటం ఏప్రిల్‌కు వాయిదా వేశారు. సమంత హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాను ఏప్రిల్ 22న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రటించారు యూనిట్. అయితే అదే సమయంలో మహేష్ హీరోగా తెరకెక్కుతున్న బ్రహ్మోత్సవం కూడా రిలీజ్ అవుతుండటంతో ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్రహ్మోత్సవం సినిమాను ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తున్నట్టుగా చాలాకాలం క్రితమే ప్రకటించారు. అయితే ఆ సినిమాకు వారం ముందుగా నితిన్ సినిమాను రిలీజ్ చేయటం రిస్క్ అంటున్నారు విశ్లేషకులు. అ.. ఆ.. కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఒక్క వారంలో పూర్తి కలెక్షన్లు రాబట్టం కష్టం. మహేష్, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో వస్తున్న బ్రహ్మోత్సవంకు భారీ హైప్ ఉండటంతో పాటు రిలీజ్‌ను కూడా భారీగా ప్లాన్ చేస్తుండటంతో రిలీజ్ తరువాత అ..ఆ.. కలెక్షన్లు భారీగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే గ్యాప్ చూసుకొని విడుదల చేయటం బెటర్ అని భావిస్తున్నారు. మరి నితిన్ రిలీజ్ విషయంలో వెనక్కి తగ్గుతాడో, లేక పోటీకే రెడీ అవుతాడో చూడాలి. -
వణికించే చలిలో సూపర్‌స్టార్ షూటింగ్
ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'బ్రహ్మోత్సవం' సినిమా షూటింగ్లో పాల్గొంటున్న మహేష్ బాబు, ఆ సినిమా షూటింగ్‌ను జెట్ స్పీడులో పూర్తిచేయాలని భావిస్తున్నాడు. ఇటీవల మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాల మధ్య విభేదాలు వచ్చాయంటూ వస్తున్న వార్తలను ఖండించిన చిత్రయూనిట్, తాజాగా ఊటీలో భారీ షెడ్యూల్‌ను ప్రారంభించింది. పివిపి సంస్థ భారీగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను మార్చి నాటికల్లా ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని భావిస్తున్నాడు మహేష్. ప్రస్తుతం ఊటీలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో షూటింగ్ వాయిదా వేద్దామని యూనిట్ సభ్యులు వారించినా, మహేష్ మాత్రం అంగీకరించటం లేదట. మురుగుదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ఏప్రిల్ 14 నుంచి ప్రారంభం కానుంది. ఈలోగా ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను పూర్తి చేయాలి. అందుకే వణికించే చలిలోనూ షూటింగ్ చేస్తున్నాడు మహేష్. నిర్మాతలకు కూడా అనుకున్న సమయానికి సినిమా పూర్తి చేయలని గట్టిగా చెప్పాడట. మురుగదాస్ ప్రస్తుతం సోనాక్షి సిన్హా లీడ్ రోల్లో నటిస్తున్న బాలీవుడ్ మూవీ అకీరా పనుల్లో బిజీగా ఉన్నాడు. 2016 ఫిబ్రవరి నాటికల్లా ఈ సినిమాను పూర్తిచేసి మహేష్‌తో చేయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్‌ను ప్రారంభించనున్నాడు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్ టైనర్లో శృతిహాసన్ హీరోయిన్గా నటించనుంది. సంతోష్ శివన్, రసూల్ పోకుట్టి లాంటి అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. -
శ్రీవారికి నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవ