ప్రస్తుతం బ్రహ్మోత్సవం, అ.. ఆ.. సినిమాలతో పాటు తమిళంలో మరో రెండు సినిమాల షూటింగ్లతో ఫుల్ బిజీగా ఉన్న సమంత, ఓ ఇంపార్టెంట్ పర్సన్తో డేట్కి ఓకే చెప్పింది. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఒక్క రోజు తనతో గడపడానికి అంగీకరించింది జెస్సీ. అయితే తనతో డేట్కి వస్తా అన్న పర్సన్ పెట్టిన కండిషన్తో ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో పడిందట. ఇంతకీ ఈ స్టార్ హీరోయిన్తో డేట్కి వెళ్తున్నది ఎవరు అనుకుంటున్నారా..?
ఆ లక్కీ పర్సన్ ఏ స్టార్ హీరోనో.. మరో బోయ్ ఫ్రెండో కాదు.. సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి, టాలీవుడ్ ప్రిన్సెస్ సితార. సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితారతో ఈ శనివారం ఆడుకోడానికి డేట్ ఫిక్స్ చేసుకుంది సమంత. ఈ విషయాన్ని సితారతో కలిసి దిగిన ఫోటోతో పాటు ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అయితే సితార తను ఆడుకోవడానికి సమంత పాపను కూడా వెంట తీసుకొని రావాలని చెప్పిందిట. ఈ విషయాన్ని సరదాగా తన అభిమానులతో షేర్ చేసుకుంది సామ్. శనివారానికల్లా తనకో కూతురు కావాలని, ఎలాగోలా ఎరేంజ్ చేసుకోవాలని చెప్పింది.
సమంత ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తుంది. పివిపి సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాను మే మొదటివారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాతో మరోసారి ఇండస్ట్రీ రికార్డ్లను తిరగరాయాలని ప్లాన్ చేస్తున్నాడు మహేష్.
Sitara we have a play date but she wants me to bring my baby along .Now how to arrange for that by Saturday pic.twitter.com/e3zHnG2vl1
— Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) March 15, 2016