మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ
Published Wed, Feb 22 2017 12:19 AM | Last Updated on Tue, Sep 5 2017 4:16 AM
మహానంది: మహానంది క్షేత్రంలో జరగనున్న శివరాత్రి బ్రహ్మోత్సవాలకు బుధవారం అంకురార్పణ చేయనున్నట్లు మహానంది దేవస్థానం పండితుడు రవిశంకర అవధాని తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహానంది క్షేత్రంలో ఈ నెల 27వరకు ఉత్సవాలు ఉంటాయన్నారు. అందులో భాగంగా 24న మహా లింగోద్భవం, మహా లింగోద్భవం, 25న స్వామివారి కల్యాణం, 26న రథోత్సవం ఉంటాయన్నారు. ఈ ఏడాది కొత్తగా శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారికి పుష్పపల్లకీ ఉత్సవం నిర్వహిస్తున్నామన్నారు.
Advertisement
Advertisement