మహానందిలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
మహానంది: మహానంది క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు బుధవారం రాత్రి అంకురార్పణ పూజలు చేశారు. మహానంది దేవస్థానం పాలక మండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, డిప్యూటీ కమిషనర్ డాక్టర్ బి.శంకర వరప్రసాద్ ఆధ్వర్యంలో వేదపండితులు రవిశంకర అవధాని, నాగేశ్వరశర్మ, శాంతారాంభట్.. విశేష ద్రవ్యాభిషేక పూజలు నిర్వహించారు. ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనము, చండీశ్వరపూజ, దీక్షాధారణ, అఖండస్థాపనములు, తిరుమంజనము జరిపారు. రాత్రి అగ్నిప్రతిష్ఠాపన, కలశస్థాపన, వాస్తుపూజా హోమం, భేరిపూజ, ధ్వజారోహణం, బలిహరణం, వేదశాస్త్ర సమర్పణం గావించారు. పూజా కార్యక్రమాల్లో దేవస్థానం సూపరింటెండెంట్ ఈశ్వర్‌రెడ్డి, కళ్యాణోత్సవ దాత లక్కనబోయిన ప్రసాదు, ఆలయ ధర్మకర్తలు బాలరాజు, రామకృష్ణ, మునెయ్య తదితరులు పాల్గొన్నారు.