తమిళనాడులోని ఓ ఆలయంలో నిర్వహించిన వేలంలో ఒక్క నిమ్మకాయ రూ.35,000 పలికింది. శివరాత్రి సందర్భంగా ఆ మహా శివుడికి సమర్పించిన నిమ్మకాయను ఆలయ అధికారులు వేలం వేయగా ఓ భక్తుడు అత్యధిక మొత్తానికి దక్కించుకున్నారు.
తమిళనాడులోని ఈరోడ్‌కి 35 కిలోమీటర్ల దూరంలోని శివగిరి గ్రామ సమీపంలోని పాతపూసయ్య ఆలయంలో శుక్రవారం రాత్రి మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా శివుడికి సమర్పించిన నిమ్మకాయ, పండ్లతోపాటు ఇతర వస్తువులను ఆచారం ప్రకారం వేలం వేశారు. ఈ వేలంలో 15 మంది భక్తులు పాల్గొనగా, ఈరోడ్‌కు చెందిన ఒక భక్తుడు రూ. 35,000కు నిమ్మకాయను దక్కించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
వేలం వేసిన నిమ్మకాయను ఆలయ పూజారి స్వామివారి ముందు ఉంచి పూజ చేసి వందలాది మంది భక్తుల సమక్షంలో వేలం దక్కించుకున్న భక్తుడికి అందజేశారు. స్వామివారికి సమర్పించిన నిమ్మకాయను పొందడం అదృష్టంగా భక్తులు భావిస్తారు. తమకు అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు లభిస్తాయని నమ్ముతారు.
Comments
Please login to add a commentAdd a comment