Tamil Nadu: Protest Against Worship Of Love Marriage Couples, Details Inside - Sakshi
Sakshi News home page

ప్రేమపెళ్లి చేసుకున్నారని.. ఆ గుడిలో ఏం చేశారంటే!

Published Mon, Jun 12 2023 10:41 AM | Last Updated on Mon, Jun 12 2023 1:34 PM

Tamil Nadu: Protest Against Worship Of Love Marriage Couples - Sakshi

అన్నానగర్‌(చెన్నై): తిరుచ్చి జిల్లా ముసిరి సమీపంలో సూరంపట్టి అనే గ్రామం ఉంది. ఇక్కడ సంఘానికి చెందిన వేడిచ్చి అమ్మన్‌ ఆలయం ఉంది. ఇందులో ఎనిమిది పట్టి వర్గాలకు చెందిన సముదాయ ప్రజలు పూజలు నిర్వహిస్తున్నారు. ఈ స్థితిలో గతవారం ఆలయంలో కుంభాభిషేకం జరిగింది. ఇందులో వివిధ వర్గాలకు చెందిన మహిళలను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎనిమిది మంది యువకులు గుడిలో పూజలు చేయడాన్ని నిరసించారు. దీంతో బాధిత దంపతులు ముసిరి పోలీస్‌స్టేషన్‌న్‌లో ఫిర్యాదు చేశారు. తరువాత రాజీ చర్చలు జరిగాయి.

అనంతరం కుంభాభిషేక కార్యక్రమంలో కుటుంబసమేతంగా యువకులు హాజరయ్యారు. అయితే ఆ తర్వాత జరిగిన పూజల్లో కూడా శుక్రవారం కొంతమంది ప్రేమ వివాహం చేసుకున్నారు. యువకులు కొబ్బరికాయలు పగులగొట్టి పూజలు చేయడంపై ఓ వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో వారు మళ్లీ ముసిరి పోలీస్‌స్టేషన్‌న్‌ను ఆశ్రయించారు.అనంతరం ఇన్‌స్పెక్టర్‌ సెంథిల్‌ కుమార్‌ ఇరువర్గాలను పిలిపించి ప్రేమించి పెళ్లి చేసుకుంటే వారిని మినహాయించేందుకు చట్టంలో ఎక్కడా లేదని హెచ్చరించారు. అయితే చర్చల్లో ఎలాంటి అంగీకారం కుదరలేదు. దీంతో పూజలు నిలిపివేశారు.

చదవండి: Noida Model Death: పాపం వంశిక.. మోడల్‌ ప్రాణం తీసిన ర్యాంప్‌ వాక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement