వణికించే చలిలో సూపర్‌స్టార్ షూటింగ్ | Mahesh Babu Shooting Under Colder Conditions | Sakshi
Sakshi News home page

వణికించే చలిలో సూపర్‌స్టార్ షూటింగ్

Published Wed, Dec 16 2015 8:42 AM | Last Updated on Sun, Sep 3 2017 2:06 PM

వణికించే చలిలో సూపర్‌స్టార్ షూటింగ్

వణికించే చలిలో సూపర్‌స్టార్ షూటింగ్

ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'బ్రహ్మోత్సవం' సినిమా షూటింగ్లో పాల్గొంటున్న మహేష్ బాబు, ఆ సినిమా షూటింగ్ను జెట్ స్పీడులో పూర్తిచేయాలని భావిస్తున్నాడు. ఇటీవల మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాల మధ్య విభేదాలు వచ్చాయంటూ వస్తున్న వార్తలను ఖండించిన చిత్రయూనిట్, తాజాగా ఊటీలో భారీ షెడ్యూల్ను ప్రారంభించింది. పివిపి సంస్థ భారీగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ను మార్చి నాటికల్లా ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని భావిస్తున్నాడు మహేష్.

ప్రస్తుతం ఊటీలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో షూటింగ్ వాయిదా వేద్దామని యూనిట్ సభ్యులు వారించినా, మహేష్ మాత్రం అంగీకరించటం లేదట. మురుగుదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ఏప్రిల్ 14 నుంచి ప్రారంభం కానుంది. ఈలోగా ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను పూర్తి చేయాలి. అందుకే వణికించే చలిలోనూ షూటింగ్ చేస్తున్నాడు మహేష్. నిర్మాతలకు కూడా అనుకున్న సమయానికి సినిమా పూర్తి చేయలని గట్టిగా చెప్పాడట.

మురుగదాస్ ప్రస్తుతం సోనాక్షి సిన్హా లీడ్ రోల్లో నటిస్తున్న బాలీవుడ్ మూవీ అకీరా పనుల్లో బిజీగా ఉన్నాడు. 2016 ఫిబ్రవరి నాటికల్లా ఈ సినిమాను పూర్తిచేసి మహేష్తో చేయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ను ప్రారంభించనున్నాడు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్ టైనర్లో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించనుంది. సంతోష్ శివన్, రసూల్ పోకుట్టి లాంటి అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement