క్యాథరిన్ ట్రెసా సరైనోడు ఇంకా కంటపడలేదు అంటోంది. క్యాథరిన్‌కు తమిళంలో సరైన హిట్ రాలేదనే చెప్పాలి. ఆమె గ్లామర్‌గా నటించడానికి ఏమాత్రం వెనుకాడని ధైర్యం ఉన్న నటి. అయినా స్టార్స్‌తో జత కట్టే అవకాశాలు పెద్దగా రావడం లేదు. ఆ మధ్య విశాల్‌తో కథకళి చేసినా, అధర్వ కణిదన్‌తో విజయం అందుకున్నా, అవకాశాల్లో జోరు పెరగలేదు. అయితే టాలీవుడ్‌లో అల్లుఅర్జున్ లాంటి స్టార్స్‌తో నటించే అవకాశాలను రాబట్టుకుంటోంది. కోలీవుడ్‌లో ఆర్యతో జతకట్టిన కడంబన్ చిత్రం తరువాత క్యాథరిన్ ట్రెసాను చూడలేదు. అయితే ప్రస్తుతం కలగలప్పు-2, కథానాయగన్ చిత్రాలతో రానుంది. ముఖ్యంగా కలగలప్పు-2లో ఈ బ్యూటీ తన అందాలతో మోత మోగించనుందనే ప్రచారం జరుగుతోంది. సుందర్.సీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది.
ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి చెన్నై వచ్చిన క్యాథరిన్‌ను ఎలాంటి ప్రాతలను ఇష్ట పడుతున్నారంటే చాలా మంది హీరోయన్ల మాదిరిగానే చాలెంజింగ్ అనిపించే ఎలాంటి పాత్రనైనా చేయడానికి రెడీ అని చెప్పింది. అయితే హీరోలకు అక్కగానో, చెల్లెలిగానో నటించమంటే మోహమాటం లేకుంటా సారీ అనేస్తానని అన్నది. కథ, పాత్ర బాగుంటే హీరోయిన్‌గా కాకపోయినా వారికి లవర్ లాంటి పాత్రల్లో గ్లామర్‌గా నటించడానికైనా రెడీ అని చెప్పింది. క్యారెక్టర్ పాత్రలు చేయడానికి సిద్ధమా? అంటే ఆ వయసుకు తానింకా రాలేదని చెప్పింది. సరే పెళ్లెప్పుడు? ఎవరినైనా ప్రేమిస్తున్నారా? అన్న ప్రశ్నకు సమాధానంగా అందుకు సరైనోడు ఇంకా తారస పడలేదని, నాకు నచ్చిన వాడు దొరికితే అప్పుడు పెళ్లి గురించి నిర్ణయం తీసుకుంటానని క్యాథరిన్ ట్రెసా చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment