
‘ఒక విచిత్రం’ సినిమాతో హీరోగా పరిచయం అయిన యంగ్ హీరో ఆది పినిశెట్టి కోలీవుడ్‌లో హీరోగా మంచి విజయాలు సాధించాడు. అయితే తెలుగులో మాత్రం హీరోగా కన్నా ఎక్కువగా ప్రతినాయక పాత్రల్లో, సహాయ పాత్రల్లోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. సరైనోడు, అజ్ఞాతవాసి సినిమాల్లో విలన్‌గా, ఆకట్టుకున్న ఆది ఇటీవల రంగస్థలం సినిమాలో హీరో అన్నగా నటించి మెప్పించాడు. అయితే ఇక మీద ఇలాంటి పాత్రలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడట ఈ యువ నటుడు.
ఆది పినిశెట్టి ఇక మీద సోలో హీరోగానే సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం యూటర్న్ రీమేక్ తో పాటు కోన వెంకట్ నిర్మిస్తున్న సినిమాలో లీడ్ రోల్‌లో కనిపించనున్నాడు ఆది. ఇప్పటికే కోలీవుడ్ లో హీరోగా ప్రూవ్ చేసుకున్న ఆది త్వరలోనే తెలుగులో కూడా సోలో హీరోగా సత్తా చాటే ఆలోచనలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment