పవన్ రెమ్యూనరేషన్ అంతా..? | Pawan kalyan remunaration for his next | Sakshi
Sakshi News home page

పవన్ రెమ్యూనరేషన్ అంతా..?

Published Thu, May 19 2016 10:57 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పవన్ రెమ్యూనరేషన్ అంతా..? - Sakshi

పవన్ రెమ్యూనరేషన్ అంతా..?

సర్దార్ గబ్బర్సింగ్ సినిమాతో నిరాశపరిచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రస్తుతం తన నెక్ట్స్ సినిమా మీద దృష్టిపెట్టాడు. మరోసారి తన ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మాణంలో తెరకెక్కనున్న సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడు. తన కెరీర్ను ములుపు తిప్పిన, ఖుషీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా అందించిన ఎస్ జె సూర్య దర్శకత్వంలో ఈ సినిమా చేయనున్నాడు పవన్. ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఓ వార్త టాలీవుడ్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది.

పవన్ తన నెక్ట్స్ సినిమాకు భారీ రెమ్యూనరేషన్ అందుకోనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. సర్దార్ గబ్బర్సింగ్ లాంటి భారీ డిజాస్టర్ తరువాత కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గకపోవటంతో ఎంత రెమ్యూనరేషన్ అడిగినా ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్లో పవర్ స్టార్కు భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకే సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా, పాత రికార్డులన్ని తుడిచిపెట్టుకుపోతాయన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్. దీంతో ఏకంగా 25 కోట్ల భారీ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement