sharath marar
-
హ్యపీ బర్త్ డే శౌర్య.. అదిరిపోయిన ‘లక్ష్య’ టీజర్
ఆర్చరీ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న సినిమా ''లక్ష్య''. యువ నటుడు నాగశౌర్య జన్మదినం సందర్భంగా గురువారం చిత్రబృందం లక్ష్య టీజర్ విడుదల చేసింది. ఈ సినిమా శౌర్యకు ఇది 20వ చిత్రం. ధీరేంద్ర సంతోశ్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సోనాలి నారంగ్ సమర్పణలో వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై రూపుదిద్దుకుంటోంది. నారాయణ్ దాస్ కె నారంగ్ - పుష్కర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఈ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పార్థు పాత్రలో ఆర్చరీ ఆటగాడుగా నాగశౌర్య నటిస్తున్నాడు. 'చాలా మందికి ఆడితే గుర్తింపు వస్తుంది.. కానీ ఎవడో ఒకడు పుడతాడు.. ఆటకే గుర్తింపు తెచ్చేవాడు' అంటూ జగపతిబాబు డైలాగ్‌తో టీజర్ మొదలవుతుంది. 'పడి లేచిన వాడితో పందెం వేయడం చాలా ప్రమాదకరం' అంటూ వచ్చిన 'లక్ష్య' టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో శౌర్య సిక్స్ ప్యాక్‌తో కనిపిస్తున్నాడు. హీరోయిన్గా కేతిక శర్మ నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు టీజర్ అదిరిపోవడంతో నాగశౌర్య ఖాతాలో మరో విజయం పక్కా అని తెలుస్తోంది. ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందిస్తుండగా, రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అయితే ఆర్చరీ నేపథ్యంగా దేశంలో రూపొందుతున్న మొదటి సినిమా ఇదే. -
కొత్త సినిమాను ప్రారంభించిన యంగ్ హీరో
‘ఛలో’ సినిమాతో మంచి హిట్టు అందుకున్న యంగ్ హీరో నాగశౌర్య.. మళ్లీ ఆ స్థాయిలో విజయం సాధించలేకపోయాడు. నర్తనశాల, అమ్మమ్మగారి ఇల్లు వంటి చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్నా.. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమాలు బోర్లాపడ్డాయి. అయితే జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో.. తాజాగా మరో కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. నాగశౌర్య హీరోగా 'సుబ్రమణ్యపురం' ఫేమ్ సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నారయణదాస్ నారంగ్, శరత్ మరార్, రామ్మోహన్రావు సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈ రోజు జరిగాయి. నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ నివ్వగా, దిల్ రాజు కెమెరా స్విచాన్ చేశారు. మొదటి సన్నివేశాన్ని దేవుడి పటాలపై చిత్రీకరించారు. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ.. ‘ఇదొక స్పోర్ట్ బేస్డ్ మూవీ. కథ అద్భుతంగా ఉంది అలాగే సంతోష్ ప్రామిసింగ్ డైరెక్టర్. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం'' అన్నారు. యంగ్ హీరో నాగశౌర్య మాట్లాడుతూ - ‘ఏషియన్ సునీల్ గారు. శరత్ మరార్ గారి కాంబినేషన్లో ఈ చిత్రం ప్రారంభమవడం సంతోషంగా ఉంది. సంతోష్‌కు రెండో చిత్రం ఇది. ఆరు నెలలుగా ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాం. మంచి స్క్రిప్ట్ తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది' అన్నారు. ఇక చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చిత్రయూనిట్ పేర్కొంది. -
సుకుమార్-నాగశౌర్య-నార్త్‌స్టార్ కాంబోలో మూవీ!
రంగస్థలంతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన దర్శకుడు సుకుమార్.. తన సొంత సంస్థలో చిన్న సినిమాలకు ప్రాణం పోస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్‌ను స్థాపించి తన వద్ద పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్లను డైరెక్టర్లుగా మార్చేస్తున్నారు. తాజాగా ఈ సంస్థ నుంచి మరో ప్రాజెక్ట్ ఖరారైంది. ఛలో సినిమాతో సందడి చేసిన నాగశౌర్యకు మళ్లీ ఆ రేంజ్లో సక్సెస్ లభించలేదు. అయితే నాగశౌర్య హీరోగా.. తన దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన కాశీ విశాల్‌ను దర్శకుడిగా పరిచయం చేయబోతున్నారు మన లెక్కల మాష్టారు.ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత శరత్ మరార్ నిర్మిస్తున్నారు. మిగతా వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. -
సూర్య అవుట్... డాలీ ఇన్!
పవన్ కల్యాణ్ హీరోగా ఎస్.జె. సూర్య దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మించనున్న తాజా చిత్రం లాంచనంగా ప్రారంభమై దాదాపు రెండు నెలలు అవుతోంది. ఇంకా ఈ చిత్రం షూటింగ్ మొదలు కాకపోవడంతో కథా చర్చల దశలో ఉందనీ, రేపో మాపో చిత్రీకరణ మొదలుపెట్టేస్తారనే చర్చ జరుగుతోంది. అయితే అసలు విషయం అది కాదని నిర్ధారణ అయ్యింది. చిత్రదర్శకుడు ఎస్.జె. సూర్య డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడంతోనే షూటింగ్ ప్రారంభం కాలేదు. ఈ విషయాన్ని ఆదివారం చిత్రనిర్మాత శరత్ మరార్ ఓ ప్రకటన ద్వారా పేర్కొన్నారు. తమిళంలో ఎస్.జె. సూర్య నటించిన ‘ఇరైవి’ ఇటీవల విడుదలైంది. ఆ చిత్రం తర్వాత సూర్యకు తమిళ, తెలుగు భాషల్లో నటుడిగా పలు అవకాశాలు రావడంతో పవన్ కల్యాణ్‌తో కమిట్ అయిన చిత్రానికి టైమ్ కేటాయించలేని పరిస్థితి. ఈ కారణంగా సినిమా ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో పవన్ కల్యాణ్‌తో చర్చించి, సూర్య స్థానంలో వేరే దర్శకుణ్ణి తీసుకోవాలని శరత్ మరార్ నిర్ణయించుకున్నారు. సూర్యతో కూడా మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చారట. ఎలాంటి భిన్నాభిప్రాయాలకూ తావు లేకుండా ముగ్గురూ ఒక అవగాహన వచ్చాకే వేరే దర్శకుణ్ణి నిర్ణయించారు. వెంకటేశ్-పవన్ కల్యాణ్ కాంబినేషన్లో ‘గోపాల గోపాల’ తెరకెక్కించిన డాలీ (కిశోర్‌కుమార్ పార్థసాని) ని దర్శకుడిగా ఫిక్స్ చేశారు. జూలై నెలాఖరున షూటింగ్ మొదలుపెట్టనున్నారు. -
పవన్ రెమ్యూనరేషన్ అంతా..?
సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాతో నిరాశపరిచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రస్తుతం తన నెక్ట్స్ సినిమా మీద దృష్టిపెట్టాడు. మరోసారి తన ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మాణంలో తెరకెక్కనున్న సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడు. తన కెరీర్‌ను ములుపు తిప్పిన, ఖుషీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా అందించిన ఎస్ జె సూర్య దర్శకత్వంలో ఈ సినిమా చేయనున్నాడు పవన్. ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఓ వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. పవన్ తన నెక్ట్స్ సినిమాకు భారీ రెమ్యూనరేషన్ అందుకోనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. సర్దార్ గబ్బర్‌సింగ్ లాంటి భారీ డిజాస్టర్ తరువాత కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గకపోవటంతో ఎంత రెమ్యూనరేషన్ అడిగినా ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌లో పవర్ స్టార్‌కు భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకే సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా, పాత రికార్డులన్ని తుడిచిపెట్టుకుపోతాయన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్. దీంతో ఏకంగా 25 కోట్ల భారీ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నారట. -
అవును... వాళ్లిద్దరూ డ్యాన్స్ చేస్తున్నారు!
ఆ రోజు శ్రీకృష్ట జన్మాష్టమి. అందరూ ఆ పరమాత్మ లీలల్ని స్మరిస్తూ తన్మయత్వంతో ఆడిపాడుతున్నారు. అక్కడ రంగులు జల్లుకుంటూ ఆనందపరవశులయ్యేవారు కొందరైతే... ‘ఉట్టి’ సంబరంలో తలమునకలయ్యేవారు ఇంకొందరు. ఇలాంటి సందర్భంలో ఏకంగా ఆ దేవదేవుడే... ఆ భక్తజనంలో ఒకడిగా మారిపోయి సంబరంలో పాలుపంచుకుంటే... ఆ ఫీల్ ఎలా ఉంటుంది? తెలియని వారి సంగతి ఎలా ఉన్నా... తెర ముందు కూర్చొని చూస్తూ... అన్నీ తెలిసిన ప్రేక్షకుడికి మాత్రం అది నిజంగా తన్మయానందమే. త్వరలో ప్రేక్షకుడు అలాంటి అనుభూతినే పొందబోతు న్నాడు. ‘గోపాల... గోపాల’ సినిమా కోసం కృష్ణాష్టమి నేపథ్యంలో ఓ పాటను చిత్రీకరించనున్నట్లు చిత్రబృందం ధ్రువీకరించారు. ఈ పాటలో ‘గోపాలుడు’ పవన్‌కల్యాణ్‌తో పాటు, ‘గోపాల్రావ్’ పాత్రధారి వెంకటేశ్ కూడా పాల్గొంటారు. ప్రేక్షకులు సంభ్రమానికి లోనయ్యేలా ఈ పాటను చిత్రీకరించనున్నట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు. బాలీవుడ్ ‘ఓ మై గాడ్’ చిత్రం ఈ చిత్రానికి మాతృక అన్న విషయం తెలిసిందే. తెలుగు వాతావరణానికి తగ్గట్టుగా కొన్ని మార్పులు, చేర్పులు చేసి, జనరంజకంగా దర్శకుడు కిషోర్‌కుమార్ పార్థసాని (డాలీ) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మాతృకలో లేని ఈ పాటను తెలుగులో చేర్చడం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇందులో వెంకటేశ్‌కు జోడీగా శ్రీయ నటిస్తున్నారు. ఇక కథలో కీలకమైన పాత్రను అలనాటి బాలీవుడ్ సూపర్‌స్టార్ మిథున్ చక్రవర్తి పోషిస్తున్నారు. ఇంకా పోసాని కృష్ణమురళి, రంగనాథ్, రాళ్లపల్లి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: ఉమేశ్ శుక్లా, మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: జయనన్ విన్సెంట్, సంగీతం: అనూప్ రూబెన్స్, నిర్మాతలు: డి.సురేశ్‌బాబు, శరత్ మరార్. -
గబ్బర్ సింగ్ 2 మూవీ ఓపెనింగ్