
రంగస్థలంతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన దర్శకుడు సుకుమార్.. తన సొంత సంస్థలో చిన్న సినిమాలకు ప్రాణం పోస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్‌ను స్థాపించి తన వద్ద పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్లను డైరెక్టర్లుగా మార్చేస్తున్నారు. తాజాగా ఈ సంస్థ నుంచి మరో ప్రాజెక్ట్ ఖరారైంది.
ఛలో సినిమాతో సందడి చేసిన నాగశౌర్యకు మళ్లీ ఆ రేంజ్‌లో సక్సెస్ లభించలేదు. అయితే నాగశౌర్య హీరోగా.. తన దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన కాశీ విశాల్‌ను దర్శకుడిగా పరిచయం చేయబోతున్నారు మన లెక్కల మాష్టారు.ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత శరత్ మరార్ నిర్మిస్తున్నారు. మిగతా వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment