జైలులో హీరో దర్శన్.. ఇతడికి సపోర్ట్‌గా టాలీవుడ్ హీరో | Actor Naga Shaurya Supports Darshan In Recent Issue | Sakshi
Sakshi News home page

Darshan Case: దర్శన్ అలాంటి వాడు కాదు.. హీరో నాగశౌర్య షాకింగ్ కామెంట్స్

Published Fri, Jun 28 2024 7:47 AM | Last Updated on Fri, Jun 28 2024 8:49 AM

Actor Naga Shaurya Supports Darshan In Recent Issue

హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అయి దాదాపు 20 రోజులు అవుతోంది. తన ప్రేయసి పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు, వీడియోలు పంపాడనే కారణంతో రేణుకాస్వామిని హీరో దర్శన్ హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు ఇతడితో పాటు ఏకంగా 17 మంది అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. కానీ బయటకొస్తున్న రోజుకో ఫొటో, న్యూస్ దర్శన్ అంటే అసహ్యం కలిగేలా చేస్తోంది. ఇలాంటి టైంలో దర్శన్‌కి సపోర్ట్ చేస్తూ టాలీవుడ్ హీరో నాగశౌర్య పోస్ట్ పెట్టడం చర్చనీయాంశమైంది.

'చనిపోయిన వ్యక్తి (రేణుకాస్వామి) కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. అయితే ఈ కేసులో అందరూ అప్పుడే ఓ అభిప్రాయానికి వచ్చేయడం నాకు చాలా నచ్చేలేదు. ఎందుకంటే దర్శన్ అన్న ఎవరికీ ఎలాంటి హానీ తలపెట్టే వ్యక్తి కాదు. కలలో కూడా అలాంటి పనిచేయరు. ఇతరులకు సహాయం చేసే విషయంలో ఆయన ఎంత మంచివాడో పరిచయమున్న వాళ్లకు తెలుసు. చాలామందికి కష్టకాలంలో తోడున్నాడు. కానీ నేను ఈ వార్తల్ని అస్సలు నమ్మలేకపోతున్నాను. న్యాయ వ్యవస్థపై నాకు నమ్మకముంది. త్వరలోనే నిజం బయటపడుతుంది'

(ఇదీ చదవండి: పేరు మార్చుకున్న ప్రభాస్.. 'కల్కి'లో ఇది గమనించారా?)

'ఈ కేసు వల్ల మరో కుటుంబం (దర్శన్ ఫ్యామిలీ) కూడా బాధపడుతోందని మనం గుర్తుంచుకోవాలి. వాళ్లకు ఇలాంటి పరిస్థితుల్లో కాస్త ప్రైవసీ కావాలి. మీపై నాకు నమ్మకముంది అన్న. మీరు అమాయకుడు అనేది తేలుతుంది. అసలు నేరస్థుడు ఎవరనేది త్వరలోనే బయటపడుతుంది' అని నాగశౌర్య ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దర్శన్ నిందితుడు అని ఇంకా నిర్ధారణ కాలేదు. కానీ దొరికిన ఆధారాలు బట్టి అభిమానిని ఎంత దారుణంగా హత్య చేశాడో ప్రతి ఒక్కరికీ అర్థమవుతోంది. ఇలాంటి టైంలో హీరో నాగశౌర్య పోస్ట్ పెట్టడం కరెక్ట్ కాదని పలువురు నెటిజన్లు అంటున్నారు. ఎంత అభిమానం ఉన్నాసరే కొన్నిసార్లు దాన్ని దాచుకోవాల్సి ఉంటుంది. ఇలా రాంగ్ టైంలో పోస్ట్ పెడితే లేనిపోని ట్రోల్స్ తప్ప ఇంకేం ఉండవనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

(ఇదీ చదవండి: ఎంతోమంది దర్శన్‌ను మోసం చేశారు.. ఆయనెవర్నీ మోసగించలేదు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement