భారీ చిత్రాల నిర్మాతలకు టెన్షన్ | sardaar fever for big budget movies | Sakshi
Sakshi News home page

భారీ చిత్రాల నిర్మాతలకు టెన్షన్

Published Thu, Apr 14 2016 8:56 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

భారీ చిత్రాల నిర్మాతలకు టెన్షన్ - Sakshi

భారీ చిత్రాల నిర్మాతలకు టెన్షన్

ఈ సమ్మర్ బరిలో స్టార్ హీరోలు నటించిన భారీ చిత్రాలు రిలీజ్కు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, 'సర్దార్ గబ్బర్సింగ్'తో ఆడియన్స్ ముందుకు రాగా.. అల్లు అర్జున్, మహేష్ బాబు, సూర్య లాంటి స్టార్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధం అవుతున్నారు. అయితే తాజాగా సర్దార్ రిజల్ట్తో ఈ బడా చిత్రాల నిర్మాతల్లో టెన్షన్ మొదలైంది. ముఖ్యంగా ఆడియన్స్ టేస్ట్ మారుతుండటంతో ఎలాంటి సినిమాను ఆదరిస్తారో అర్ధం కాక తికమకపడుతున్నారు.
 
భారీ స్థాయిలో సినిమాను రిలీజ్ చేసినా.. నష్టాలు తప్పేలా కనిపించటం లేదు. భారీ బడ్జెట్ సినిమాలు కావటంతో కనీసం వారం రోజుల పాటు సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడిస్తేగాని పెట్టుబడి వెనక్కు వచ్చే పరిస్థితి కనిపించటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాకు ఏమాత్రం నెగెటివ్ టాక్ వచ్చినా బయ్యర్ల నుంచి నిర్మాత వరకు అందరూ నష్టపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా రిలీజ్కు రెడీ అవుతున్న అల్లు అర్జున్, సరైనోడు, మహేష్ బ్రహ్మోత్సవం, సూర్య 24 సినిమాల విషయంలో రిజల్ట్ ఎలా ఉండబోతుందో అని ఇండస్ట్రీ వర్గాలు టెన్షన్గా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement