మహేష్కు ఫ్లాపిస్తే మెగా హీరోలు ఛాన్స్..? | Mahesh babu flop directgors in mega camp | Sakshi
Sakshi News home page

మహేష్కు ఫ్లాపిస్తే మెగా హీరోలు ఛాన్స్..?

Published Fri, May 27 2016 12:26 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

మహేష్కు ఫ్లాపిస్తే మెగా హీరోలు ఛాన్స్..? - Sakshi

మహేష్కు ఫ్లాపిస్తే మెగా హీరోలు ఛాన్స్..?

సాధారణంగా హీరోలు హిట్ ట్రాక్లో ఉన్న దర్శకులతోనే సినిమాలు చేయాలనుకుంటారు. ముఖ్యంగా స్టార్ వారసులుగా ఎంట్రీ ఇచ్చిన హీరోలు ఈ ఫార్ములాను ఎక్కువగా ఫాలో అవుతుంటారు. కానీ మహేష్, మెగా హీరోల విషయంలో మాత్రం ఈ ఫార్ములా రివర్స్ అవుతోంది. మహేష్తో ఒక్క ఫ్లాప్ ఇస్తే చాలు ఆ దర్శకులకు మెగా హీరోలు ఛాన్స్ ఇచ్చేస్తున్నారు.

తాజాగా మహేష్ హీరోగా బ్రహ్మోత్సవం సినిమాను తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాలతో మెగా హీరో సాయిధరమ్ తేజ్ సినిమాకు రెడీ అవుతున్నాడు. గతంలో కూడా ఇదే ఫార్ములాను ఫాలో అయ్యారు యంగ్ హీరోస్. మహేష్తో ఆగడు సినిమాను తెరకెక్కించిన శ్రీనువైట్లకు రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమాను డైరెక్టర్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా ఫ్లాప్ అయినా మరోసారి వరుణ్ హీరోగా మిస్టర్ సినిమాకు ఛాన్స్ ఇస్తున్నారు. మహేష్తో వన్ నేనొక్కడినే లాంటి ఫ్లాప్ సినిమా తరువాత నాన్నకు ప్రేమతో సినిమాతో ఫరవాలేదనిపించిన సుకుమార్తో సినిమాకు ఓకె చెప్పాడు చరణ్.

మహేష్ హీరోగా నాని లాంటి డిజాస్టర్ సినిమా చేసిన ఎస్ జె సూర్య డైరెక్షన్లో పులి సినిమా చేశాడు పవన్. ప్రిన్స్ హీరోగా సైనికుడు సినిమా చేసిన గుణశేఖర్తో వరుడు సినిమా చేశాడు అల్లు అర్జున్. ఖలేజా సినిమా చేసిన త్రివిక్రమ్ కూడా ఆ తరువాత మెగా కాంపౌడ్లో జులాయితో హిట్ కొట్టాడు. ఇలా మహేష్కు ఫ్లాప్ ఇచ్చిన దర్శకులకు మెగా హీరోలు ఛాన్స్ ఇవ్వటం యాదృచ్చికమే అయినా, ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు ఈ విషయాన్నే చర్చించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement