సంపూ బాబు, రజనీ మీదే కౌంటరేశాడు..! | Sampoornesh Babu tweet on Kabali | Sakshi
Sakshi News home page

సంపూ బాబు, రజనీ మీదే కౌంటరేశాడు..!

Jul 28 2016 8:37 AM | Updated on Sep 4 2017 6:46 AM

సంపూ బాబు, రజనీ మీదే కౌంటరేశాడు..!

సంపూ బాబు, రజనీ మీదే కౌంటరేశాడు..!

యూట్యూబ్ సెన్సేషన్తో వెండితెర మీద అడుగుపెట్టిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, ఎప్పటికప్పుడు తన ఫాలోయింగ్ను కాపాడుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. సోలో హీరోగా సినిమాలు చేస్తూనే...

యూట్యూబ్ సెన్సేషన్తో వెండితెర మీద అడుగుపెట్టిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, ఎప్పటికప్పుడు తన ఫాలోయింగ్ను కాపాడుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. సోలో హీరోగా సినిమాలు చేస్తూనే కామెడీయన్గా కూడా దూసుకుపోతున్న సంపూ, తన ట్విట్టర్ పేజ్లో స్టార్ హీరోలను ఉద్దేశించి పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.

సినిమా మొదట్లో వచ్చే ఈ నగరానికేమయ్యింది యాడ్ స్టైల్లో ఈ ఏడాది స్టార్ హీరోల సినిమాలు ఫ్లాప్ అవ్వడంపై కౌంటరేశాడు సంపూ. సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేసిన కామెంట్ను షేర్ చేశాడు సంపూ. 'ఈ 2016కి ఏమైంది? ఓ పక్క సర్థార్ గబ్బర్సింగ్, మరో పక్క బ్రహ్మోత్సవం. కబాలి కూడా నోరుమెదపలేదు, ఈ నిర్లక్ష్య ధోరణికి కొబ్బరి మట్ట పాడాలి చరమగీతం' అని రాసున్న పోస్ట్ను షేర్ చేశాడు.

అయితే ఇలాంటి పోస్ట్లు షేర్ చేస్తే అభిమానుల నుంచి ఏ స్థాయిలో వ్యతిరేకత వస్తుందో ముందే ఆలోచించిన సంపూర్ణేష్, ఎవరో పంపించారు సరదాకి తీసుకోండి అంటూ స్టార్ హీరోల అభిమానులను కూల్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. అదే సమయంలో తన కొబ్బరి మట్ట సినిమాకు మంచి ప్రమోషన్ కూడా చేసుకున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement