బాహుబలి సినిమా రిలీజ్ తరువాత టాలీవుడ్ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయి ఎన్నో రెట్లు పెరిగింది. ఒకప్పుడు 50 కోట్ల కలెక్షన్లు కూడా కష్టంగా కనిపించిన ఇండస్ట్రీలో ఇప్పుడు 100 కోట్లు కూడా సాధ్యమే అని ప్రూవ్ అయ్యింది. ముఖ్యంగా ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు వసూళ్ల సునామీ సృష్టిస్తుండటంతో రాబోయే సినిమాలకు కూడా భారీ బిజినెస్ జరుగుతోంది.
ఈ వేసవిలో రిలీజ్కు రెడీ అవుతున్న భారీ చిత్రాలకు ఇప్పటికే బిజినెస్ స్టార్ట్ అయిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. ఈ లిస్ట్లో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందే ఉన్నాడు. లాంగ్ గ్యాప్ తరువాత సర్థార్ గబ్బర్సింగ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్న పవన్, ఇప్పటికే 90 కోట్లకు పైగా బిజినెస్ చేసేశాడన్న టాక్ వినిపిస్తోంది. మహేష్ హీరోగా తెరకెక్కుతున్న బ్రహ్మోత్సవానికి కూడా ఇదే స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.
సన్నాఫ్ సత్యమూర్తి తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు సినిమాతో వస్తున్న అల్లు అర్జున్ కూడా ఇప్పటికే 70 కోట్ల వరకు బిజినెస్ను పూర్తిచేశాడు. ఇక ఇంతవరకు షూటింగ్ కూడా మొదలుకాక ముందే ఎన్టీఆర్, కొరటాల శివల జనతా గ్యారేజ్కు కూడా బిజినెస్ మొదలైందన్న టాక్ వినిపిస్తోంది. ఈ జోరు చూస్తుంటే ఈ సమ్మర్లో టాలీవుడ్ బాక్సాఫీస్ ముందు రెండు, మూడు వందల కోట్ల రూపాయల విలువైన సినిమాలు సందడి చేసే ఛాన్స్ కనిపిస్తోంది.
సమ్మర్ సినిమాల బిజినెస్ జోరు
Published Tue, Feb 2 2016 10:35 AM | Last Updated on Sun, Sep 3 2017 4:49 PM
Advertisement
Advertisement