సాక్షి, వైఎస్సార్: ఆంధ్రా భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి (మార్చి 30) నుంచి ప్రారంభం కానున్నాయి. పది రోజుల పాటు ఈ వేడుకలను అంగరంగ వైభవంగా జరిపేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అన్ని ఏర్పాటు చేస్తోంది.
శ్రీరామనవమి సందర్భంగా గురువారం అంకురార్పణతో ప్రారంభమై.. ఏప్రిల్ 9వ తేదీ పుష్పయాగంతో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఏప్రిల్ 5న ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment