'ఆడిషన్‌కు ముందే పవన్ ఓకే చెప్పారు' | Pawan Kalyan has great eye for talent: Sharad Kelkar | Sakshi
Sakshi News home page

'ఆడిషన్‌కు ముందే పవన్ ఓకే చెప్పారు'

Published Wed, Mar 30 2016 1:55 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

'ఆడిషన్‌కు ముందే పవన్ ఓకే చెప్పారు' - Sakshi

'ఆడిషన్‌కు ముందే పవన్ ఓకే చెప్పారు'

సర్దార్ గబ్బర్సింగ్ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెడుతున్న యువనటుడు శరద్ కేల్కర్, ఆ సినిమా హీరో పవన్ కళ్యాణ్ను ఆకాశానికెత్తేశాడు. ఈ సినిమాలో రాక్షసుడైన భూస్వామిపాత్రలో నటిస్తున్న శరద్, తనకు ఆడిషన్ జరగకముందే, పవన్ తనను ఆ పాత్రకు ఎంపిక చేశారని చెప్పాడు. స్క్రీన్ టెస్ట్ కూడా కాకముందే తనను ఎంపిక చేయటం తనకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగించిందని, తర్వాత ఆయనతో కలిసి నటించడం మొదలుపెట్టాక ఆ రెట్టింపయ్యిందని, తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నాడు.

ఉత్తరాదిన టీవీ సీరియల్స్తో పాటు రామ్ లీలా, రాఖీ హ్యాండ్సమ్ లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించిన శరద్ కేల్కర్, సర్దార్ గబ్బర్సింగ్ సినిమాతో తొలిసారిగా టాలీవుడ్లో అడుగుపెడుతున్నాడు. సర్దార్ రిలీజ్ దగ్గర పడుతున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన శరద్ కేల్కర్, పవన్తో పాటు సినిమా యూనిట్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి వివరించాడు. తొలిసారిగా తాను మహరాష్ట్రలో షూటింగ్ జరుగుతుండగా సర్దార్ టీంతో జాయిన్ అయ్యానని, దాదాపు 1000 మందితో ఆ షూటింగ్ జరగడం ఆశ్చర్యంగా అనిపించిందన్నాడు.

ఇప్పటివరకు తను కలిసి నటించినవారిలో పవన్ అందరికన్నా గొప్ప వ్యక్తి అంటూ పొగిడాడు. పవర్ ఫేం బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్దార్ గబ్బర్సింగ్ సినిమాలో పవన్ సరసన కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమాను, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసి ఏప్రిల్ 8న తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement