డోంట్ వర్రీ బీ హ్యాపీ | kajal agarwal said dont worry be happy | Sakshi
Sakshi News home page

డోంట్ వర్రీ బీ హ్యాపీ

Published Sun, Nov 27 2016 2:38 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

డోంట్ వర్రీ బీ హ్యాపీ - Sakshi

డోంట్ వర్రీ బీ హ్యాపీ

డోంట్ వర్రీ బీ హ్యాపీ అంటున్నారు నటి కాజల్ అగర్వాల్.ఆ అమ్మడికిప్పుడు కోలీవుడ్‌లో అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. విక్రమ్ సరసన నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోరుుంది.ఆ చిత్రం ఆగిపోవడం కాజల్‌కు నష్టమే అని చెప్పక తప్పదు. నటుడు జీవాకు జంటగా నటించిన కవలై వేండామ్ చిత్రంపై కాజల్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణను చూరగొంటుందన్న ఆనందాన్ని కాజల్ అగర్వాల్ వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా తన స్పందన ఎలా ఉందో చూద్దాం. డోంట్ వర్?ర బీ హ్యాపీ కాన్సెప్ట్‌తో రూపొందిన కవలై వేండామ్ చిత్రంలో దివ్య అనే చాలా జాలీగా ఉండే జోవియల్ పాత్రలో నటించాను.

యువ నటుడు జీవాతో కలిసి నటించడం మంచి అనుభవం. ఆర్‌ఎస్.ఇన్‌ఫోటెరుున్‌మెంట్ పతాకంపై ఎల్‌రెడ్.కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి డీకే దర్శకుడు. ఆయన ఇంతకు ముందు దర్శకత్వం వహించిన యామిరుక్క భయమే చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడీ కవలైవేండామ్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండడం చాలా సంతోషంగా ఉంది.ఇంత మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన చిత్ర దర్శక నిర్మాతలకు, కథానాయకుడు జీవాకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.పెద్ద నోట్ల రద్దు కష్టాలను ఎదుర్కొంటున్న ప్రజలకు కవలైవేండామ్ చిత్రం మంచి రిలీఫ్ నిస్తుందని కాజల్ అగార్వాల్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement