ఆ భావన కలిగినపుడే పెళ్లి | Kajal Aggarwal to Romance Vikram in Garuda movie | Sakshi
Sakshi News home page

ఆ భావన కలిగినపుడే పెళ్లి

Published Tue, Sep 13 2016 2:01 AM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM

ఆ భావన కలిగినపుడే పెళ్లి

ఆ భావన కలిగినపుడే పెళ్లి

ఎప్పుడైతే నాకు అలాంటి భావన కలుగుతుందే అప్పుడే పెళ్లి చేసుకుంటాను అంటున్నారు నటి కాజల్‌అగర్వాల్. ఈ బ్యూటీకిప్పుడు గుడ్‌టైమ్ నడుస్తోంది. ఈ మాట తనే అన్నారు. ఒక రకంగా అది నిజమే కావచ్చు. ఎందుకంటే కాజల్ ఇప్పుడు కోలీవుడ్‌లో బిజీ హీరోయిన్. జీవాతో నటిస్తున్న కవలైవేండామ్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. త్వరలో విక్రమ్‌కు జంటగా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. ఇప్పటికే విక్రమ్‌తో నటించే అవకాశం రెండు సార్లు వచ్చి మిస్ అయ్యింది.
 
  తాజాగా గరుడా అనే చిత్రం కూడా వాయిదా పడినట్లు కోలీవుడ్‌లో టాక్ హల్‌చల్ చేస్తోంది. అయితే విక్రమ్ తదుపరి చిత్రంలో హీరోయిన్ కాజల్‌నేననే టాక్ వినిపిస్తోంది. కాజల్ పెళ్లికి రెడీ అవుతున్నారనే ప్రచారం మరో పక్క సాగుతోంది. దీని గురించి కాజల్‌అగర్వాల్ స్పందన ఏమిటో చూద్దాం. పెళ్లి అన్నది ప్రతి స్త్రీ జీవితంలోనూ ఒక ముఖ్య అంశంగా పేర్కొన్నారు. ఆ సమయం ఆసన్నమైనప్పుడు అది తప్పక జరుగుతుందని అన్నారు. పెళ్లి తరువాత నటనను కంటిన్యూ చేస్తారా అని చాలా మంది అడుగుతున్నారన్నారు.
 
  చాలా మంది వివాహానంతరం నటనను కొనసాగిస్తున్నారనీ, మరి కొందరు కొన్నేళ్ల తరువాత మళ్లీ నటించడానికి వస్తున్నారని అన్నారు. అయితే తన వరకూ తాను వివాహానంతరం నటనకు స్వస్తి చెబుతానని అన్నారు. కారణం పెళ్లి తరువాత బాధ్యతలు పెరుగుతాయన్నారు. భర్త, పిల్లల యోగక్షేమాలు, భర్త కుటుంబానికి సాయపడేలా వారి అవసరాలను పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. పెద్దలను గౌరవిస్తూ వారికి మర్యాద ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఒక  ఇంటి కోడలిగా బాధ్యతలు వస్తాయన్నారు.
 
  దీంతో దినచర్యలోనూ మార్పు వస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాంటప్పుడు రెండు పడవలపై ప్రయాణం చేయడం సాధ్యం కాదని అన్నారు. అందుకే నాకు నచ్చిన పాత్రలన్నీ చేసేస్తున్నాననీ చెప్పారు. ప్రస్తుతం తనకు మంచి టైమ్ న డుస్తోందనీ, నటనకు అవకాశం ఉన్న పాత్రలు అమరుతున్నాయనీ తెలిపారు. అవకాశాలు తలుపుతడుతున్నాయనీ, ఎప్పుడైతే నచ్చిన పాత్రలన్నీ చేశాననే భావన తనకు కలుగుతుందో అప్పుడే పెళ్లికి సిద్ధం అవుతాననీ కాజల్ తన మనసులోని మాటను వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement