
కాజల్ అగర్వాల్ ఏం చేస్తున్నారు? బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో రెండు సినిమాలు చేస్తున్నారు. ఇంకేం చేస్తున్నారు అంటే? హిందీ ‘క్వీన్’ తమిళ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’లో నటిస్తున్నారు. ఇంకేం చేస్తున్నారు.. కొత్త సినిమాలకు కమిట్‌మెంట్స్ ఇస్తున్నారు. ఇంతకీ తాజాగా గ్రీన్ సిగ్నల్ సినిమా ఏంటీ? అంటే.. గోపీచంద్ సరసన ఓ చిత్రంలో నటించడానికి అంగీకరించారు. ఈ చిత్రానికి దర్శకుడు కుమార్ సాయి. తమిళ సూపర్ హిట్ ‘తని ఒరువన్’ చిత్రదర్శకుడు మోహన్‌రాజా వద్ద కో–డైరెక్టర్‌గా పనిచేశారు కుమార్ సాయి.
గోపీచంద్, కాజల్‌తో చేయబోయేది దర్శకుడిగా ఆయనకు తొలి సినిమా. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌లో బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మించనున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభమవుతుంది. మొత్తం మీద కాజల్ బిజీ బిజీగా ఉన్నారు. అన్నట్లు.. ఈ బ్యూటీ హీరోయిన్ అయి దాదాపు పదేళ్లకు పైనే అవుతోంది. స్టిల్ బిజీ అంటే చిన్న విషయం కాదు సుమా.
Comments
Please login to add a commentAdd a comment