Gopi chandh
-
బిజీ బిజీ కాజల్
కాజల్ అగర్వాల్ ఏం చేస్తున్నారు? బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో రెండు సినిమాలు చేస్తున్నారు. ఇంకేం చేస్తున్నారు అంటే? హిందీ ‘క్వీన్’ తమిళ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’లో నటిస్తున్నారు. ఇంకేం చేస్తున్నారు.. కొత్త సినిమాలకు కమిట్మెంట్స్ ఇస్తున్నారు. ఇంతకీ తాజాగా గ్రీన్ సిగ్నల్ సినిమా ఏంటీ? అంటే.. గోపీచంద్ సరసన ఓ చిత్రంలో నటించడానికి అంగీకరించారు. ఈ చిత్రానికి దర్శకుడు కుమార్ సాయి. తమిళ సూపర్ హిట్ ‘తని ఒరువన్’ చిత్రదర్శకుడు మోహన్‌రాజా వద్ద కో–డైరెక్టర్‌గా పనిచేశారు కుమార్ సాయి. గోపీచంద్, కాజల్‌తో చేయబోయేది దర్శకుడిగా ఆయనకు తొలి సినిమా. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మించనున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభమవుతుంది. మొత్తం మీద కాజల్ బిజీ బిజీగా ఉన్నారు. అన్నట్లు.. ఈ బ్యూటీ హీరోయిన్ అయి దాదాపు పదేళ్లకు పైనే అవుతోంది. స్టిల్ బిజీ అంటే చిన్న విషయం కాదు సుమా. -
కథ బాగా చెప్పాడు... సినిమా బాగా తీశాడు
‘‘ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి ఇద్దరు వ్యక్తులు కారణం. ‘చాలా చిత్రాలకు రచయితగా పని చేసిన ఓ కుర్రాడి దగ్గర మంచి కథ ఉంది. ఓసారి విన’మని నాకు చెప్పారు కెమెరామెన్ ప్రసాద్ మూరెళ్ల, రైటర్ రమేశ్రెడ్డిగారు. విన్నాను. మొదటి సిట్టింగ్‌లోనే నచ్చింది. కథ బాగా చెప్పారు కానీ సినిమా ఎలా తీస్తారు? అని అడిగాను. ఆ రోజు ఆయనేమన్నా ఫీలయ్యాడేమో తెలియదు కానీ ‘అవకాశం ఇవ్వండి సార్ బాగా తీస్తా’ అన్నాడు. చెప్పినట్లే బాగా తీశాడు’’ అన్నారు గోపీచంద్. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో గోపీచంద్, మెహరీన్ జంటగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘పంతం’. కె. చక్రవర్తి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. గోపీసుందర్ స్వరకర్త. జూలై 5న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ–రిలీజ్ వేడుక విజయవాడలో జరిగింది. ఈ వేడుకలో ఆడియో బిగ్ సీడీని, సీడీని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ విడుదల చేసి, గోపీచంద్‌కు అందచేశారు. గోపీచంద్ మాట్లాడుతూ – ‘‘నేను చేసిన 25 సినిమాల్లో ‘యజ్ఞం’లో మంచి మెసేజ్ ఉంటుంది.అలాంటి మెసేజ్‌తోపాటు మంచి కమర్షియల్ వేల్యూస్ ఉన్న సినిమా ‘పంతం’. ఈ చిత్రం ద్వారా ఓ స్ట్రాంగ్ మెసేజ్ చెప్పగలిగానని తృప్తిగా ఉన్నాను. రాధామోహన్‌గారు మేకింగ్‌లో కాంప్రమైజ్ కాలేదు. గోపీసుందర్‌గారు చక్కని బాణీలతో పాటు మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు’’ అని చెప్పారు. ‘‘మన దేశాన్ని పట్టి పీడించే సమస్యను ఆధారంగా తీసుకొని ఈ సినిమా చేశాం. గోపీచంద్ 25వ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్’’ అన్నారు రాధామోహన్. ‘‘కమాండబుల్ యాక్టింగ్, మంచి వాయిస్ ఉన్న హీరో గోపీచంద్. మ్యాన్లీగా ఉంటారు. నేను ఓ సీన్ రాసుకున్నప్పుడు 70 మార్కులు పడితే నూటికి నూరు మార్కులు పడేలా గోపీచంద్ యాక్ట్ చేశారు’’ అన్నారు కె. చక్రవర్తి. ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా ఎఫ్.డి.సీ చైర్మన్ అంబికాకృష్ణ, నిర్మాత బీవీయస్‌యన్ ప్రసాద్, దర్శకులు సంపత్ నంది, బాబి, గోపీచంద్ మలినేని తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో పీవీ సింధు, గోపిచంద్‌కు ఘనస్వాగతం
కృష్ణా: రియో ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్‌లో రజత పతకం సాధించి హైదరాబాద్ నగరంలో అపూర్వ స్వాగతం అందుకున్న పీవీ సింధుకు ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే స్థాయిలో ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న పీవీ సింధు, గోపిచంద్‌కు ఏపీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటిపుల్లారావు, నారాయణ, ఎంపీలు మురళీమోహన్, కేశినేని నాని, విద్యార్థులు, పలువురు ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. గన్నవరం నుంచి ప్రారంభమైన విజయోత్సవ ర్యాలీ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం వరకు నిర్వహించనున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి రెండు కిలోమీటర్ల మేర పొడువైన జాతీయ పతాకంతో పీవీ సింధుకు స్వాగతం పలికేందుకు చిన్నారులు బారులు తీరారు. ఈ నేపథ్యంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ర్యాలీ సందర్భంగా విజయవాడలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. విజయోత్సవ ర్యాలీ అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సింధును సన్మానించనున్నారు. అందులోనూ ఈ రోజు కృష్ణా పుష్కరాలు ముగియనుండటంతో సాయంత్రం కృష్ణా హారతి కార్యక్రమానికి పీవీ సింధు హాజరుకానుంది.