ఇళయదళపతితో మూడోసారి? | Kajal Aggarwal Romance with third time Vijay ilayadalapati | Sakshi
Sakshi News home page

ఇళయదళపతితో మూడోసారి?

Published Wed, Sep 28 2016 1:36 AM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM

ఇళయదళపతితో మూడోసారి?

ఇళయదళపతితో మూడోసారి?

ఇళయదళపతి విజయ్‌తో ముచ్చటగా మూడోసారి రొమాన్స్‌కు అందాలభామ కాజల్‌అగర్వాల్ రెడీ అవుతున్నారా? అలాంటి అవకాశం లేకపోలేదంటున్నారు కోలీవుడ్ వర్గాలు. నిన్నటి వరకూ టాలీవుడ్‌లో బిజీగా ఉన్న కాజల్ ఇప్పుడు అంతకంటే బిజీగా కోలీవుడ్‌లో ఉన్నారు. ఈ బ్యూటీ జీవాతో నటించిన కవలైవేండామ్ చిత్రం త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ప్రస్తుతం అజిత్ 57వ చిత్రంలో నటిస్తున్నారు. దీనితో పాటు దర్శకుడు సోక్రటీస్ చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపారు. ఇక తెలుగులోనూ రెండు చిత్రాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు.
 
 తాజాగా ఇళయదళపతికి జంటగా నటించే అవకాశం కాజల్‌అగర్వాల్‌ను వరించినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. నిజం చెప్పాలంటే విజయ్‌తో నటించిన తుపాకీ చిత్రంతోనే కాజల్ కోలీవుడ్‌లో కమర్శియల్ సక్సెస్‌ను అందుకున్నారని చెప్పవచ్చు.ఆ తరువాత మరోసారి జిల్లా చిత్రంలో విజయ్‌తో జత కట్టారు. ఆ చిత్రం మంచి విజయాన్నే సాధించింది. దీంతో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట మరోసారి తెరపైకి రానున్నట్లు తెలుస్తోంది. విజయ్ ప్రస్తుతం తన 60వ చిత్రం భైరవాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
 
 తదుపరి అట్లీ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారని సమాచారం.విజయ్, అట్లీల కాంభినేషన్‌లో ఇంతకు ముందు తెరి వంటి బ్లాక్ బస్టర్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. మరోసారి వీరి కలయికలో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ తేనాండాళ్ ఫిలింస్ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తుందనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో విజయ్‌తో కాజల్ రొమాన్స్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి బాహుబలి చిత్ర రచయిత విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement