Vijay ilayadalapati
-
మాస్క్‌తో మెరీనాకు దళపతి
జల్లికట్టు పోరాటం తమిళనాట ఉదృ్ధత స్థాయికి చేరిన విషయం తెలిసిందే. యువత ప్రారంభించిన ఈ పోరాటం ఈ స్థాయికి చేరుతుందని మొదట ఎవరూ ఊహించలేదు. అలాంటిది జల్లికట్టు పోరాటం ఒక్కసారిగా ఉప్పెనలా ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. ఈ పోరాటాన్ని ఏ రాజకీయ పార్టీలు, పోలీసు బలగాలు కట్టడి చేయలేని పరిస్థితి. తమిళులు స్వచ్ఛందంగా చేస్తున్న పోరాటం ఇది. ఈ పోరాటం ఇష్టంలేని కొందరు కూడా మద్దతు పలకాల్సిన పరిస్థితి. అయితే కాస్త ఆలస్యంగానైనా కోలీవుడ్ జల్లికట్టుకు తాము సైతం అంటూ గొంతు కలిపింది. జల్లికట్టుకు మద్దతుగా నిరసనల కార్యక్రమాలు నిర్వహించారు. దక్షిణ భారత నటీనటుల సంఘం శ్రుకవారం మౌనపోరాటం చేసింది. ఇది విజయవంతం అయ్యిందనే చెప్పాలి. ఇందులో సినీ కళాకారులు భారీగా పాల్గొన్నారు. అయితే సంఘ బహిష్కరణకు గురైన మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్, మాజీ కార్యదర్శి రాధారవి, మాజీ కోశాధికారి వాగై చంద్రశేఖర్ లాంటి వారు ఈ మౌన పోరాటానికి దూరంగా ఉన్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే జల్లికట్టుకు వ్యక్తిగతంగానూ మద్దతు పలికిన సూపర్‌స్టార్ రజనీకాంత్, కమలహాసన్, అజిత్, సూర్య, విశాల్, కార్తీ లాంటి వారు మౌన పోరాటంలో పాల్గొన్నారు. అలాంటిది ఇళయదళపతి విజయ్ నటీనటుల సంఘం మౌన పోరాటానికి డమ్మా కోట్టారు. అయితే శుక్రవారం రాత్రి మెరీనా ప్రాంతానికి వెళ్లి అక్కడ జల్లికట్టు కోసం పోరాటం చేస్తున్న యువతను కలిసి సంఘీభావాం తెలిపారు. అదీ ముఖానికి ముసుగుతో వెళ్లారు. నటీనటుల మౌన పోరాటంలో పాల్గొనని విజయ్ ముసుగుతో మెరీనాకు వెళ్లి జల్లికట్టుకు మద్దతుగా నిలవడంలో మర్మమేమిటన్నది కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. -
ఇళయదళపతితో మూడోసారి?
ఇళయదళపతి విజయ్‌తో ముచ్చటగా మూడోసారి రొమాన్స్‌కు అందాలభామ కాజల్‌అగర్వాల్ రెడీ అవుతున్నారా? అలాంటి అవకాశం లేకపోలేదంటున్నారు కోలీవుడ్ వర్గాలు. నిన్నటి వరకూ టాలీవుడ్లో బిజీగా ఉన్న కాజల్ ఇప్పుడు అంతకంటే బిజీగా కోలీవుడ్‌లో ఉన్నారు. ఈ బ్యూటీ జీవాతో నటించిన కవలైవేండామ్ చిత్రం త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ప్రస్తుతం అజిత్ 57వ చిత్రంలో నటిస్తున్నారు. దీనితో పాటు దర్శకుడు సోక్రటీస్ చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపారు. ఇక తెలుగులోనూ రెండు చిత్రాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. తాజాగా ఇళయదళపతికి జంటగా నటించే అవకాశం కాజల్‌అగర్వాల్‌ను వరించినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. నిజం చెప్పాలంటే విజయ్‌తో నటించిన తుపాకీ చిత్రంతోనే కాజల్ కోలీవుడ్‌లో కమర్శియల్ సక్సెస్‌ను అందుకున్నారని చెప్పవచ్చు.ఆ తరువాత మరోసారి జిల్లా చిత్రంలో విజయ్‌తో జత కట్టారు. ఆ చిత్రం మంచి విజయాన్నే సాధించింది. దీంతో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట మరోసారి తెరపైకి రానున్నట్లు తెలుస్తోంది. విజయ్ ప్రస్తుతం తన 60వ చిత్రం భైరవాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తదుపరి అట్లీ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారని సమాచారం.విజయ్, అట్లీల కాంభినేషన్లో ఇంతకు ముందు తెరి వంటి బ్లాక్ బస్టర్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. మరోసారి వీరి కలయికలో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ తేనాండాళ్ ఫిలింస్ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తుందనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో విజయ్‌తో కాజల్ రొమాన్స్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి బాహుబలి చిత్ర రచయిత విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. -
విజయ్ చిత్రానికి సంగీతం అందించాలి
ఇళయదళపతి విజయ్ చిత్రానికి సంగీతాన్ని అందించాలన్న కోరికను వ్యక్తం చేశారు యువ సంగీతదర్శకుడు సిద్ధార్థ్ విపిన్. ఈయన్ని ఒక్క సంగీతదర్శకుడని మాత్రమే సరిపెట్టలేం. కారణం సిద్ధార్థ్విపిన్లో ఒక గాయకుడు, మంచి నటుడు, నిర్మాత ఉన్నారు. ఇలా మల్టీ ట్యాలెంట్‌ను ప్రదర్శస్తున్న అతి కొద్దిమంది సంగీతదర్శకుల్లో ఈయన ఒకరు. చెన్నై లయోలా కళాశాల విద్యార్థి అయిన సిద్ధార్థ్ విపిన్ ఆ తరువాత సంగీత పాఠశాలో సంగీతాన్ని అభ్యర్థించారు. కర్ణాటక సంగీతాన్ని నేర్చుకున్న ఈయన తొలుత హాలీవుడ్ చిత్రాలకు సౌండ్ ఎఫెక్ట్స్‌ను అందించారు. అలాపేరు తెచ్చుకున్న సిద్ధార్థ్విపిన్ మిషన్ 90 డేస్ అనే మలయాళ చిత్రానికి నేపథ్య సంగీతాన్ని అందించి సంగీత దర్శకుడిగా రంగప్రవేశం చేశారు. అదే చిత్రంలో రాజీవ్గాంధీగా కీలక పాత్ర పోషించి నటుడిగానూ పరిచయమయ్యారు. ఆ తరువాత సిద్ధార్థ్ విపిన్ వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయింది. తమిళంలో నడువుల కొంచెం పక్కత్తుకానోమ్ చిత్రానికి నేపథ్య సంగీతాన్ని అందించారు. అటుపై ఇదర్కుదానే అశై పడ్డాయ్ బాలకుమారా చిత్రానికి సంగీతాన్ని అందించి అందులో ఒక కీలక పాత్రలో నటించి మెప్పించారు. చేరన్ దర్శకత్వం వహించిన జేకే ఎనుమ్ నన్భనిన్ వాళ్కై, సుందర్.సీ కథానాయకుడిగా నటించి నిర్మించిన ముత్తిన కత్తిరిక, శుక్రవారం తెరపైకి వచ్చిన జాక్సన్‌దురై వరకూ పలు విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించి సక్సెస్ గాడిలో దూసుకుపోతున్న సిద్ధార్థ్విపిన్ నిర్మాతగా కూడా అవతారమెత్తారు. లెన్స్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. అయితే తనకు నటన, నిర్మాత కంటే సంగీతం తన ప్రాధాన్యం అంటున్న విపిన్ ఇదర్కుదానే ఆశైపడ్డాయ్ బాలకుమారా లాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలకు సంగీతాన్ని అందించడం ఇష్టం అంటున్నారు. సంగీతంలో తనకు స్ఫూర్తి ఏఆర్.రెహ్మాన్ అని పేర్కొన్న సిద్ధార్థ్విపిన్ నటుడు విజయ్ చిత్రానికి సంగీతాన్ని అందించాలన్న కోరికను వ్యక్తం చేశారు.ప్రస్తుతం మలమాళంలో మోహన్‌లాల్ నటిస్తున్న చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. తమిళంలో ఇద ర్కుదానే ఆశైపడ్డాయ్ బాలకుమారా చిత్రానికి సీక్వెల్ చిత్రాలకు సంగీతం అందించనున్నట్లు తెలిపారు. -
విజయ్‌తో ఢీ అంటున్నశింబు
సంచలన నటుడు శింబు ఇళయదళపతి విజయ్‌తో ఢీ కొంటున్నానంటున్నారు. ఇప్పటికే ఈయన నటుడు అజిత్ వీరాభిమానిగా ముద్ర వేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల బీప్ సాంగ్ వివాదంలో చిక్కుకున్న శింబు విషయంలో అజిత్ స్పందించలేదన్న ఆరోపణలు ఎదురైనా, అభిమానం వేరు, అజిత్ స్పందిచక పోవడం వేరని కొట్టి పారేశారు. శింబు ఇప్పుడు అజిత్‌కు పోటీగా అభిమానులు భావించే విజయ్‌తో శింబు పోటీకీ కాలు దువ్వుతున్నారు. వివరాల్లోకెళ్లితే విజయ్ నటిస్తున్న తాజా చిత్రం తెరి. సమంత, ఎమీజాక్సన్‌లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అట్లీ దర్శకత్వంలో కలైపులి ఎస్.థాను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. చిత్ర నిర్మాణం పూర్తి చేసుకున్న తెరి చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాల పనిలో ఉంది. దీనికి యు సర్టిఫికెట్ వస్తుందనే నమ్మకంతో చిత్ర యూనిట్ ఉంది. కాగా తెరి చిత్రాన్ని తమిళ ఉగాది సందర్భంగా ఎప్రిల్ 14న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇకపోతే సంచల నటుడు శింబు నటిస్తున్న చిత్రం ఇదు నమ్మఆళు. నయనతార, ఆండ్రియా నాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని పాండిరాజ్ దర్శకత్వంలో శింబు సినీ ఆర్ట్స్ పతాకంపై టి.రాజేందర్ నిర్మిస్తున్నారు.చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం ఎట్టకేలకు చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ చిత్రం ద్వారా శింబు తమ్ముడు కురలరసన్ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కాగా ఇదు నమ్మఆళు చిత్రాన్ని తెరికి పోటీగా ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు శింబు తన ట్విట్టర్లో పేర్కొనడం పెద్ద వార్తగా మారింది. విజయ్ తెరి చిత్ర క్రేజ్‌ను ఎదుర్కొనే సత్తా ఇదు నమ్మఆళుకు ఉందా? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే పాండిరాజ్ దర్శకత్వం, మాజీ ప్రేమికులు శింబు, నయనతార కలిసి నటించడం వంటి అంశాలు ఇదు నమ్మఆళుకు హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. అయినా తమిళ ఉగాదికి విడుదలయ్యే చిత్రాలలో ఏది విజేతగా నిలుస్తుందో వేచి చూడాల్సిందే. -
కొత్తగా ఇళయదళపతి పులి చిత్రం
ఇళయదళపతి విజయ్ నటించిన చిత్రాలన్నింటి కంటే పులి కొత్తగా ఉంటుందని ఆ చిత్ర నిర్మాత పి.టి.సెల్వకుమార్ అన్నారు. ఎస్.కె.స్టూడియో పతాకంపై ఈయన నిర్మిస్తున్న అత్యంత భారీ చిత్రం పులి. విజయ్ సరసన హన్సిక, శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అతిలోక సుందరి శ్రీదేవి ముఖ్యపాత్ర రాణిగా నటిస్తున్నారు. కన్నడ ప్రముఖ హీరో సుదీప్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని శింబుదేవన్ నిర్వహిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న పులికి సంగీత బాణీలను దేవిశ్రీ ప్రసాద్ అందించారు. చిత్ర ఆడి యో ఆవిష్కరణ కార్యక్రమాన్ని వచ్చే నెల రెం డవ తారీఖున మహాబలిపురంలో భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు బుధవారం చెన్నైలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర యూ నిట్ వెల్లడించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మా త, పి.టి.సెల్వకుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం బ్రహ్మాండం అని చెప్పుకుంటున్న ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న చిత్రంతో తమ పులి చిత్రాన్ని పోల్చంగాని విజయ్ ఇప్పటి వరకు నటించిన చిత్రాలన్నింటికంటే కొత్తగా, భారీగా పులి చిత్రం ఉంటుందన్నారు. విజయ్, శ్రీదేవి, శ్రుతిహాసన్, హన్సిక, సుదీప్ అంటూ భారీ తారాగణం, ప్రఖ్యాత సాంకేతిక వర్గం పని చేస్తున్న చిత్రం పులి అన్నారు. దేవిశ్రీప్రసాద్ అద్భుతంగా సంగీత బాణీలు అందించారన్నారు. చిత్రంలో ఆరు పాటలు ఉన్నాయని తెలిపారు. ఫాంటసీ అడ్వెంచర్: ఇంతకుముందు చెప్పినట్లుగా పులి ఫాంటసీ అడ్వెంచర్ యాక్షన్ ఎంట ర్‌టైనర్ అని దర్శకుడు శింబుదేవన్ తెలిపారు. ఇది రాజారాణిల ఇతివృత్తంతో సాగే కుటుంబ సమేతంగా చూసే జనరంజక కథా చిత్రం అని చెప్పారు. కథ విన్నప్పుడే ఇన్స్పైర్ అయ్యా: దర్శకుడు శింబుదేవన్ కథ చెప్పినప్పుడే ఇన్స్పైర్ అ య్యానని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అ న్నారు. చిత్రంలో చోటు చేసుకున్న ఏండీ ఏండీ లాంటి టీజింగ్ సాంగ్ చేయాలని చాలాకాలం గా ఆశించానన్నారు. అది పులి చిత్రంతో నెరవేరిందన్నారు. తెలుగులో మహేశ్‌బాబు నటిం చిన శ్రీమంతుడు, తమిళంలో విజయ్ చిత్రం పులి ఒకేసారి చేయడం సంతోషంగా ఉందని దేవిశ్రీప్రసాద్ అన్నారు. చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు. -
నా జీవితంలో పెళ్లి లేదు
నా జీవితంలో పెళ్లి అనే పదానికి తావే లేదని నటి శ్రుతిహాసన్ ఖరాఖండిగా వెల్లడించారు. ఈమె విడిపోయిన ఇద్దరు నట ప్రముఖుల వారసురాలన్న విషయం తెలిసిందే. ఈ సంచలన నటి ప్రస్తుతం ఇళయదళపతి విజయ్ సరసన పులి చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. తాజాగా అజిత్‌కు జంటగా కొత్త చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి సూర్యతో సింగం-3 చిత్రంలోనూ నటించనున్నారు. ఇలా వరుసగా ప్రముఖ హీరోలతో నటిస్తున్న శ్రుతిహాసన్ ఇటీవల ఒక పత్రికకు భేటీ ఇస్తూ తన తండ్రి కమలహాసన్‌తో కలసి నటించాలనే అభిలాషను వ్యక్తం చేశారు. అయితే అలాంటి అవకాశం ఇంతకుముందు రెండుసార్లు వచ్చినా సద్వినియోగం చేసుకోలేదామె. కారణం కాల్షీట్స్ సర్దుబాటు కాకపోవడమే నని వివరించారు. కాగా వివాహం ఎప్పుడన్న ప్రశ్నకు శ్రుతి బదులిస్తూ ఈ విషయమై ఇప్పటికే ఒకసారి బదులిచ్చానని అయినా మళ్లీ చెప్పడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని పెళ్ళి గురించి తానెప్పుడూ ఆలోచించలేదని స్పష్టం చేశారు. ఇష్టాలు, ఆశల్లో భేదాభిప్రాయాలు ఉన్న దంపతులు సంసార జీవితం ప్రశాంతంగా సాగదన్నారు. ఈ కారణం గానే విడిపోతుంటారని వ్యాఖ్యానించారు. అందుకే తాను వివాహమే చేసుకోరాదన్న నిర్ణయాన్ని తీసుకున్నానన్నారు. శ్రుతి నిర్ణయం విస్మయాన్ని కలిగించినా ఆమె పెరిగిన వాతావరణం శ్రుతిపై అలాంటి ప్రభావానికి కారణం అని భావించాల్సి ఉంటుంది. శృతి తల్లిదండ్రులు కమలహాసన్, సారిక విడివిడిగా జీవిస్తున్నారు. శృతి కూడా ముంబయిలో ఒంటరిగానే నివసిస్తున్నారు. తల్లిదండ్రులను కలవాలపించినప్పడు వెళ్లి చూసి వస్తున్నారు. తల్లిదండ్రులు విడిపోవడం అన్నది ఎంత బాధాకరమే శ్రుతి చెప్పక పోయి నా స్పష్టంగా తెలిసిపోతుంది. -
ఆయన సూపర్ చెఫ్
నటుడు అజిత్ సూపర్ చెఫ్ అట. ఇది చెప్పింది ఎవరో కాదు క్రేజీ హీరోయిన్ శ్రుతిహాసన్. ఇంతకుముందు టాలీవుడ్లో ఎంత బిజీ నటిగా వెలుగొందారో అంతకంటే యమబిజీగా ఈ బ్యూటీ కోలీవుడ్‌లో విరాజిల్లుతున్నారు. శ్రుతి, ఇళయదళపతి విజయ్ సరసన నటిస్తున్న పులి చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం ఆమె మరో టాప్ స్టార్ అజిత్‌తో రొమాన్స్ చేస్తున్నారు. ఎన్నై అరిందాల్ తరువాత అజిత్ నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ మొదలైంది. ఇంతకుముందు అజిత్‌తో వీరం చిత్రాన్ని తెరకెక్కించిన శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఏఎం రత్నం నిర్మిస్తున్న మరో భారీ చిత్రం ఇది. శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అజిత్‌కు చెల్లెలిగా నటి లక్ష్మీమీనన్ నటిస్తున్నారు. చిత్ర షూటింగ్లో ఘుమఘుమలాడే బిరియానీ చేసి యూనిట్ సభ్యులకు విందునివ్వడం అజిత్‌కు ఆనవాయితి. ఈ చిత్ర షూటింగ్‌లోనూ అజిత్ తన చేతివాటం చూపించారట. ఆయన చేసిన బిరియానీ తిన్న శ్రుతిహాసన్ ఆహా ఏమి రుచి అనరా మైమరచి అంటూ అజిత్‌కు పొగడ్తలతో ముంచెత్తేశారు. దీని గురించి ఈ బబ్లీ గర్ల్ తెలుపుతూ అజిత్ మంచి వ్యక్తిత్వం గల మనిషి మాత్రమే కాదు. ఆయనలో మంచి పాక శాస్త్ర నైపుణ్యుడు ఉన్నారని కితాబిచ్చారు. ఆయన సరసన నటిం చడం తీయని అనుభవంగా పేర్కొన్నారు. -
హాలీవుడ్‌కు విజయ్?
ఇళయదళపతి విజయ్, హాలీవుడ్ చిత్రంలో నటించనున్నారా? ప్రస్తుతం కోలీవుడ్‌లో ఆసక్తిగా సాగుతున్న చర్చ ఇదే. కత్తి చిత్రం కోలీవుడ్‌లో అధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కత్తి నమోదైంది. దీంతో విజయ్ పాపులారిటీ అంతర్జాతీయ మార్కెట్ దృష్టికి చేరింది. ఫలితంగా ఐరోపాకు చెందిన ఒక చిత్ర నిర్మాణ సంస్థ విజయ్ హీరోగా ఒక హాలీవుడ్ చిత్రం నిర్మించడానికి ముందుకొచ్చినట్లు విజయ్ సన్నిహితులు తెలిపారు. ఈ చిత్రాన్ని ముందు ఒక బాలీవుడ్ ప్రముఖ హీరోతో చేయాలనుకున్నారట. ఆ తరువాత వారి దృష్టి విజయ్ మీదకు మళ్లిందని సమాచారం. అయితే ఈ హాలీవుడ్ అవకాశాన్ని విజయ్ అంగీకరిస్తారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇంతకుముందు రజనీకాంత్ కూడా బ్లడ్‌స్టోన్ అనే హాలీవుడ్ చిత్రంలో నటించారు. -
విజయ్ 60వ చిత్రానికి దర్శకుడు కేవీ?
తమిళసినిమా: ఇళయదళపతి విజయ్ 60వ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు కె.వి.ఆనంద్ దర్వకత్వం వహించనున్నట్లు కోలీవుడ్ సమాచారం. రజనీకాంత్ నటించిన శివాజీలాంటి చిత్రాలకు ఛాయాగ్రహణం అందించి బ్రహ్మాండం అనిపించుకున్న కే.వీ.ఆనంద్ కనా కండేన్ చిత్రంతో మెగాఫోన్ పట్టిన ఈ ఛాయాగ్రాహకుడు ఆ తరువాత సూర్యతో అయన్, జీవా హీరోగా కో వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. అయితే ఆ మధ్య సూర్యతో రూపొందించిన మాట్రాన్ ఆశించిన విజయం సాధించలేదు. పస్తుతం ధనుష్ హీరోగా తెరకెక్కించిన అనేగన్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. తదుపరి విజయ్ హీరోగా చిత్రం చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. విజయ్ ప్రస్తుతం శింబుదేవన్ దర్శకత్వంలో సోషల్ మైథాలజికల్ చిత్రం చేస్తున్నారు. ఇది ఈయనకు 58వ చిత్రం. కాగా 59వ చిత్రానికి యువ దర్శకుడు అట్లి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రం 2015లో సెట్‌పైకి వెళ్లనుంది. దీంతో ఇళయదళపతి 60వ చిత్రానికి కేవీ ఆనంద్ దర్శకత్వం వహించనున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇది సూపర్ యాక్షన్, రొమాన్స్ అంశాలతో కూడిన భారీ చిత్రంగా ఉంటుందంటున్నారు. -
లింగా రీ షూట్ చేయం
సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఝలక్ ఇచ్చిన ఇళయదళపతి విజయ్. ఇది సోషల్ నెట్వర్కులో హల్చల్ చేస్తున్న ప్రచారం. విషయమేమిటంటే విజయ్ నటించిన కత్తి, రజనీకాంత్ నటించిన లింగా చిత్రాల్లో కొన్ని సన్నివేశాలు ఒకేలా ఉన్నాయనే ప్రచారం ఇంటర్నెట్లో హోరెత్తుతోంది. విజయ్, సమంత జంటగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన కత్తి చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. కొన్ని కార్పొరేట్ సంస్థలు గ్రామాల్లో నీటి సమస్య సృష్టిస్తూ అక్కడ వ్యవసాయదారుల భూములను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తారుు. వారి దురాక్రమాలను ఒక యువకుడు ఎలా ఎదిరించి గ్రామ ప్రజల కోసం పోరాడి గెలిచాడన్నది కొత్త చిత్ర కథ. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలకు రజనీకాంత్ తాజా చిత్రం లింగా చిత్రంలోని సన్నివేశాలకు పోలికలున్నట్లు తేలింది. దీంతో లింగా చిత్రంలోని ఆ సన్నివేశాలను రీ షూట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే విధంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ ముందుగా అనుకున్నట్లుగా ఆదివారం జరగాల్సి ఉంది. అయితే అదిప్పుడు వారుుదా పడింది. రజనీకాంత్ పుట్టిన రోజు డిసెంబర్ 12న లింగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర యూని ట్ గతంలో ప్రకటించింది. ఇప్పుడు చిత్ర విడుదల కూడా వాయిదా పడుతుందన్న ప్రచారం మొదలైంది. దీనిపై లింగా చిత్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ స్పందిస్తూ ఇది అసత్య ప్రచారం అని ఆరోపించారు. వాస్తవానికి లింగా చిత్ర కథకు, కత్తి చిత్ర కథకు ఎలాంటి పోలికలు ఉండవన్నారు. అందువలన తమ చిత్రంలోని సన్నివేశాలను మార్చాల్సిన అవసరం, రీషూట్ చేయాల్సి న పని లేదని స్పష్టం చేశారు. లింగా చిత్ర షూటింగ్ పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టేసినట్లు తెలిపారు. ప్రస్తుతం చిత్ర నేపథ్య సంగీతం సమకూర్చే పని జరుగుతోందని లింగా చిత్రాన్ని ఖచ్చితంగా డిసెంబర్ 12న విడుదల చేయనున్నట్లు నిర్మాత వెల్లడించారు.