హాలీవుడ్‌కు విజయ్?
ఇళయదళపతి విజయ్, హాలీవుడ్ చిత్రంలో నటించనున్నారా? ప్రస్తుతం కోలీవుడ్‌లో ఆసక్తిగా సాగుతున్న చర్చ ఇదే. కత్తి చిత్రం కోలీవుడ్‌లో అధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కత్తి నమోదైంది. దీంతో విజయ్ పాపులారిటీ అంతర్జాతీయ మార్కెట్ దృష్టికి చేరింది. ఫలితంగా ఐరోపాకు చెందిన ఒక చిత్ర నిర్మాణ సంస్థ విజయ్ హీరోగా ఒక హాలీవుడ్ చిత్రం నిర్మించడానికి ముందుకొచ్చినట్లు విజయ్ సన్నిహితులు తెలిపారు. ఈ చిత్రాన్ని ముందు ఒక బాలీవుడ్ ప్రముఖ హీరోతో చేయాలనుకున్నారట. ఆ తరువాత వారి దృష్టి విజయ్ మీదకు మళ్లిందని సమాచారం. అయితే ఈ హాలీవుడ్ అవకాశాన్ని విజయ్ అంగీకరిస్తారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇంతకుముందు రజనీకాంత్ కూడా బ్లడ్‌స్టోన్ అనే హాలీవుడ్ చిత్రంలో నటించారు.