![The Batman Movie All Set To Release On Marach 4th 2022 - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/26/Untitled-2.gif.webp?itok=tf6DdRDw)
హాలీవుడ్ హై ఓల్టేజ్ యాక్ష న్ థ్రిల్లర్ చిత్రం 'ది బ్యాట్‌మ్యాన్' తమిళం, తెలుగు, హిందీ, ఆంగ్లం భాషల్లో మార్చి 4న తెరపైకి రానుంది. ఈ చిత్రాన్ని మ్యాట్ రీవ్స్ దర్శకత్వంలో వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇది ఇంతకు ముందు వచ్చిన బ్యాట్‌మ్యాన్ చిత్రానికి సీక్వెల్. ఇందులో నటుడు రాబర్ట్ ప్యాటిన్సన్ కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా రెండు అసాధారణ పాత్రల్లో ద్విపాత్రాభినయం చేయడం విశేషం.
ఇది భావోద్వేగాలతో కూడిన శక్తివంతమైన యాక్షన్‌తో కూడిన బ్రహ్మాండ దృశ్యకావ్యంగా ఉంటుందని చిత్ర నిర్వాహకులు పేర్కొన్నారు. చిత్రంలో ఇంతకుముందెప్పుడూ చూడ ని అబ్బురపరిచే పలు సన్నివేశాలు ఉంటాయన్నారు. ఆధునిక సాంకేతికతో దర్శకుడు మ్యాట్ రీవ్స్ అద్భుతంగా సెల్యులాయిడ్‌పై ఆవిష్కరించిన చిత్రం ఇదని యూనిట్ వర్గాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment